22, ఆగస్టు 2023, మంగళవారం

సమస్య - 4511

23-8-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకినిఁ గని మెచ్చి చేసెఁ గళ్యాణమ్మున్”
(లేదా...)
“కాకిని మెచ్చి పిల్చి తన కన్యనొసంగియుఁ బెండ్లిఁ జేసెనే”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో బొంతు సూర్యనారాయణ గారి సమస్య)

18 కామెంట్‌లు:

  1. ఏకులమని నడుగక యే
    కాకినిఁ గని నచ్చి జేసెఁ గళ్యాణమ్మున్
    ఏకైక పుత్రికకొకడు
    మేకలు గాసెడు యువకుని మెచ్చిన వాడై,

    రిప్లయితొలగించండి
  2. ఈకాలమందు మింటిని
    దాకు ధరలకు తినువారు తక్కువ నుండన్
    సాకుగ నాయింటన యే
    కాకినిఁ గని మెచ్చి చేసెఁ గళ్యాణమ్మున్

    రిప్లయితొలగించండి
  3. చేకొను యవకుడు దొరకక
    నాకంపంబొందెనాత డాత్రము తోడన్
    చీకాకుపడక తానే
    కాకినిఁ గని మెచ్చి చేసెఁ గళ్యాణమ్మున్

    రిప్లయితొలగించండి
  4. కందం
    లోకైక దైవమనుచున్
    శ్రీకరి పార్వతి మగనిగ శివుని దలంపన్
    జేకుర, హిమవంతుండే
    కాకినిఁ గని మెచ్చి చేసెఁ గళ్యాణమ్మున్

    ఉత్పలమాల
    లోకములేలెడున్ శివుని మ్రోల నపర్ణగ సేవలెంచఁగన్
    శ్రీకరి పార్వతీ రమణిఁ జేకొనఁ బూవిలుకాని త్యాగమై
    చేకురి నంతటన్ మురిసి శీత నగాధిపుఁడంత శూళి నే
    కాకిని మెచ్చి పిల్చి తన కన్యనొసంగియుఁ బెండ్లిఁ జేసెనే!

    రిప్లయితొలగించండి
  5. లోకజ్ఞానము గలవా
    డాకారములోన చెన్నుడాతడు గన శ్రీ
    లో కాయకంటి యని యే
    కాకినిఁ గని మెచ్చి చేసెఁ గళ్యాణమ్మున్.



    ఏకుల మైననేమి పరమేశుని నామము వీడబోడు తా
    నాకలిఁ జేరెడిత్వరుల కన్నమొసంగెడు గొప్పదాతగా
    ప్రాకట మందినట్టి గుణవంతుడటంచు నెఱంగి యట్టి యే
    కాకిని మెచ్చి పిల్చి తన కన్యనొసంగియుఁ బెండ్లిఁ జేసెనే.

    రిప్లయితొలగించండి
  6. చేకొను యోగ్యుడేతనకు చిక్కక వ్యాకులమొందువానిగా
    లోకమునంతటన్ వెదకి లోపము లేని వరుండు కన్పడన్
    దేకువతోడ గాంచి తన తిప్పలు తప్పునటంచు వానినే
    కాకిని మెచ్చి పిల్చి తన కన్యనొసంగియుఁ బెండ్లిఁ జేసెనే

    రిప్లయితొలగించండి
  7. ఏకాగ్ర చిత్తుఁడాతం
    డేకార్యమునైన జేయునెలమిని సుత మం
    దాకిని కీడగునని యే
    కాకినిఁ గని మెచ్చి చేసెఁ గళ్యాణమ్మున్

    రిప్లయితొలగించండి
  8. ఏ కులమో యెరుంగ డతడెక్కడనుండిట కేగుదెంచెనో
    నాకనువార లెవ్వరయినన్ గలరో మరి యాతడొంటరో
    వ్యాకులపాటునొందడెటువంటి పరిస్థితులందు నట్టియే
    కాకిని మెచ్చి పిల్చి తన కన్యనొసంగియుఁ బెండ్లిఁ జేసెనే

    రిప్లయితొలగించండి
  9. భీకర వ్యాధికి గురియై
    యేకైక కుమార్తె బాగు కిష్టు o డ గు చున్
    తేకువ తో బందు గు డే
    కాకిని గని మె చ్చి చే సెగళ్యా ణ మ్ము న్

    రిప్లయితొలగించండి
  10. కం॥ ఆకారముఁ గన మదనుఁడు
    సోకుల రాయుఁడు నడవడిఁ జూడ ముదమగున్
    జీకాకెరుఁగని యాయే
    కాకినిఁ గని మెచ్చి చేసెఁ గళ్యణమ్మున్

    ఉ॥ రాకుమరుండు గాఁడతఁడు రామునిఁ బోలును సద్గుణమ్ములన్
    సోకులఁ బోఁడు విద్యలను శోభగఁ బొందిన వాఁడు పెద్దలన్
    లోకువఁ జేయఁడెప్పుడును లోకపు తీరును దెల్సినట్టి యే
    కాకిని మెచ్చి పిల్చి తన కన్యనొసంగియుఁ బెండ్లిఁ జేసెనే

    రిప్లయితొలగించండి
  11. ఏకాకి కాకుండా మరేమైనా పదము దొరకుతుందేమో అని నిఘంటువు చూసానండి నాకగపడలేదు. తెలిసిన వారుంటే దయచేసి తెలుపగలరు

    రిప్లయితొలగించండి
  12. చీకటి బ్రత్కునీడ్చెడు సుశీలుని
    చక్కని రైతుబిడ్డ నే
    కాకిని మెచ్చి పిల్చి తన కన్య
    నొసంగియు పెండ్లి సేసెనే !
    మేకల రామచంద్రయ యమేయ
    ధనాఢ్యుడు పేదవానికిన్
    లోకులు మెచ్చిరాతని విలోకన
    నిర్మల హార్ద్ర చిత్తమున్.

    రిప్లయితొలగించండి
  13. ఉ.

    భీకర పుట్ట, సూన కని, బెట్టున కండ్లను గ్రుచ్చినంతనే
    లోకమదృశ్యమై చ్యవన లోచనముల్ పొడ లేక బాధతో
    దూకున శాపమిచ్చుటయు ధోరణి మౌనికి సేవసేయ నే
    *కాకిని మెచ్చి పిల్చి తన కన్యనొసంగియుఁ బెండ్లిఁ జేసెనే.*

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పేకాటనగా తెలియదు
    సోకులు లేనట్టి వాడు సుగుణాత్ముండౌ
    నాకర్షణ గలవా డే
    కాకినిఁ గని మెచ్చి చేసెఁ గల్యాణమ్మున్.

    రిప్లయితొలగించండి
  15. సాకుచు ప్రేమగ తనయను
    రూకలనాశించనట్టిరూపరినొకనిన్
    వ్యాకులమొందకనొకయే
    *“కాకినిఁ గని మెచ్చి చేసెఁ గళ్యాణమ్మున్”*

    రిప్లయితొలగించండి