30, జనవరి 2015, శుక్రవారం

పద్యరచన - 806

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. బ్లాగు కవులను గోరుదు భవ్యు లార !
    సెల్లు నంబర్లు మీ యవి చెలువు గాను
    నీయ వలయును నిచ్చిన నెపుడు నైన
    మాటలాడుట వీలగు మంచి మాట
    మఱియు దీ ర్చుకొం దునునను మానములను

    రిప్లయితొలగించండి
  2. హింసయె వద్దని జనులక
    హింసను బోధించె గాంధి యేశ్రమకైనన్
    సంసిద్ధుండై మతవి
    ధ్వంసమ్ములనాపనెంచి తనుబలియయ్యెన్
    9292204129

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. జాతిపితగనుబేరొంది జగమునందు
    సత్యము మఱియు నాయహింసా పథమ్ము
    నెఱపి యాంగ్లరాజులమఱి తఱిమి కొట్టి
    తెచ్చె రాజ్యము మనకు గా దెగువతోడ

    అంగ వస్రము ధరియించి యచట యుండి
    వడకు చుండెను దారము బాపు మిగుల
    శ్రద్ధ తోడన గనుడా ర్య ! చక్ర మునట
    ద్రిప్పు చుండగ గిరగిర దిరుగు చుండె

    రిప్లయితొలగించండి

  5. నూలు వడికేను గాంధీ
    'కెమిస్ట్రీ'లు కోరేను మోదీ
    ఆతనిది నవ్య సత్యాగ్రహం
    ఈతనిది భవ్య అభ్యుదయాగ్రహం !!

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. కాంచుచు పనిలో దేవుని గాంధి తాత
    సతముజీవితమ్ము గడిపె సంతసముగ
    తానహింస సిద్ధాంతమున్ తనివి తోడ
    నాచరించి జగతిన నారాధ్యు డయ్యె

    రిప్లయితొలగించండి
  7. అయ్యా, గడచిన దినములలో నెట్ సమస్య వల్ల వ్రాయలేకపోయిన పద్యములివ్వి.
    దయతో తప్పుయొప్పులనుఁ దెలుప మనవి.

    పద్యరచన 797
    అన్నదమ్ములతోడ వచ్చెనె యాలకింపగ కీర్తనల్
    మన్నియించెను త్యాగరాయని, మక్కువైనవటంచనెన్
    కన్నులందున కొల్వుదీరిన కల్పవృక్షమునార్తిగా
    కన్న భాగ్యము కన్న వేరగు కల్ములేవని తోచగా.

    సమస్యా పూరణం - 1584 (దుర్మార్గుని
    కర్మకు ఫలితము రూపున
    మర్మపు పాపములు పున్నెమంటుచునుండున్
    ధర్మమె యిట్టుల పలుకుట?-
    దుర్మార్గుని పొత్తువలనఁ దొలఁగు నఘమ్ముల్.

    పద్యరచన - 798
    జయముల్ కల్గునటంచు బల్కి కవితాసౌందర్యముప్పొంగగా
    నయమున్ మెప్పునుఁ బొందు వారగుచు విన్నాణమున్ చూపుచున్
    లయపూర్ణంబుగ పాడిరో యెటుల నాలాపమ్ములన్ చేసిరో
    దయతో తెల్పరదెవ్వరున్, వినుచు నే తాదాత్మ్యమున్ చెందగా.

    న్యస్తాక్షరి - 23
    భారతమ్మున గొప్పదై పారుచుండు
    నదిని గీర్వాణ జగతిని నడచునంద్రు.
    నాడు నా భగీరథుడిల నడువజేసె
    నంద్రు నట్టి యత్నమునకు నచ్చెరువగు.

    సమస్యా పూరణం - 1585 (గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్త...
    ఇలలోనెల్ల ప్రకృతినిన్
    పలువిధములుగా కొలిచెడు భారతవాసుల్
    చలిమిడుల తో సలుపు నా
    గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్.

    దత్తపది - 65 (కక-గగ-తత-నన)
    సురపుత్రుండొక కర్ణుఁడు
    తరియించగ గడిపె దాన తత్పరతఁ; సదా
    నెరనంటియున్న కవచము
    వెరువక నొసగి కననరిగె వీరపు చదలున్.

    పద్యరచన - 801
    నగలును దేహాంగములను
    నొగలునుఁ జూడ్కులను భక్తి నొప్పారంగా
    గగనముఁ దాకగఁ జెక్కిరి
    సొగసుగ నందిని! భళిభళి !సుందరమయ్యా!

    సమస్యా పూరణం - 1586 (చావు వార్త తెచ్చె సంబరమ్ము)
    జనుల బాధవెట్టి చంపుచునుండెడు
    రక్కసుండు జచ్చె రణమునందు
    ప్రజలకెల్ల నాఁడె పర్వమయ్యెను, వాని
    చావువార్త తెచ్చె సంబరమ్ము.

    పద్యరచన - 802
    మగవారలతోపాటుగ
    మగువలు సైనికులలో తమదు పాటవమున్
    తగురీతిగఁ జూపించిరి,
    నగరములో తమదు ప్రతిభ నలుగురు మెచ్చన్.

    నిషిద్ధాక్షరి - 30
    అశ్వములఁ గూర్చి నడుపగ నరుణుడిట్లు
    కాల చక్రముఁ నడిపెనా గగనవిభుఁడు,
    చిక్కుడాకుల పల్లకి చేర్చి భువిని
    రవికి పూజలు జరుగును లక్షణముగ.

    పద్యరచన - 803
    రేకులు విచ్చు నందముల రేయి మరింతగ నందగించగా,
    చీఁకటి మాటుఁజేరె, శశి చిక్కటి వెల్గులఁ గ్రుమ్మరించగా
    ప్రాకెనహో, నిలాతలముఁ బర్వె నెవో మధుభావవీచికల్
    నా కనుపాపలందు నది నర్మిలిఁ గొల్పెడు చిత్రమే యగున్.

    సమస్యా పూరణం - 1587 (కన్నులు గ్రుడ్డివే యయినఁ గానఁ

    మిన్నగ నీశునిన్ మదిని మేల్మిఁ దలంచుచునున్నవారికిన్,
    దన్నుగ మోక్షమిచ్చునని తథ్యముఁ దెల్సిన భక్తవర్యుకున్,
    పన్నగభూషణున్ గొలుచు పట్టున మానస పూజలందునన్
    కన్నులు గ్రుడ్డివే యయినఁ గానఁగవచ్చు సమస్తవస్తువుల్.

    పద్యరచన - 804
    తాండవమాడుచున్న తఱి తాళము తప్పనితీరుగాంచ బ్ర
    హ్మాండమునందునున్న నిఖిలంబున దేవతలెల్లవారులున్
    పండుగగా గనంగ నిట వచ్చిరొ ! విశ్వపు రూపుఁ జూచి నే
    దండముఁ జేతునయ్య ,నిను దాల్తు మనమ్మున నిశ్చలమ్ముగా.

    న్యస్తాక్షరి - 24
    పుక్కిటఁ బట్టినట్టివల పూర్వులు జెప్పిన గాథలన్నియున్
    చక్కగ నేర్చి మస్తకము శక్తియుతమ్ముగ వాడుచుండ్రి, నేఁ
    డొక్కరు నైనఁ జేయరిటులుండరు, కబ్బములెల్ల వ్రాసినన్
    సొక్కునటంచు వ్రాయుదురు, సుందర గ్రంథములన్ ముదమ్ముతో.

    పద్యరచన - 805
    చకచక త్రాటిపై నడచు చక్కని శిక్షణ పొంది బాలలే
    తికమక లేక చేయుదురు; దేశయశస్సునుఁ బెంచు వీరినిం
    చుక గమనించువారెవరు? శుద్ధమనస్కులు శ్రద్ధ వెట్టుచో
    నిక మన దేశమున్ ప్రతిభకించుక నైన కొఱంత లేదహో!

    సమస్యా పూరణం - 1588 (దీపము పెట్టెనింట యువతీమణి భళ్...

    పాపలచక్కగా నిదుర పట్టున నుండగ జూసి యెప్పుడో
    యోపికతోడ వేకువనె యొప్పుగ ముగ్గుల వెట్టి, భక్ష్యముల్
    మోపుగఁ జేసి యెల్లరకు, మ్రొక్కులఁ దీర్చెడు దైవసన్నిధిన్,
    దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్!

    రిప్లయితొలగించండి
  8. ఖద్దరునూలుబట్టలన?గాంధిమహాత్మునికెంతయిష్టమో
    ప్రొద్దుటరాట్నమున్నొడికిపోగుకుదారముపోగుజేసి|యే
    బద్దకమెంచకన్తగినబాధ్యతచేత-స్వదేశదుస్తులే
    ముద్దనిబోధజేసితనమోజునుదెల్పెనుభారతాళికిన్|

    రిప్లయితొలగించండి
  9. చరఖా చక్రమునే సుదర్శనముగా సంధించి యాంగ్లేయ ము
    ష్కర సంఘాత విభుత్వ గర్వమును వ్రక్కల్ చేసి స్వాతంత్ర్య సు
    స్థిర దీక్షామతియై చెలంగిన గుణశ్రీ మూర్తి బాపూజి సం
    స్మరియింతున్ సతతంబు భక్తి మెయి వాచా కర్మణా చేతసా !

    రిప్లయితొలగించండి
  10. భారతదేశ బడ్గులకు వల్వలు నిండుగ లేవు గాన నే
    ధారణచేయ 'పంచొకటి తప్ప' శరీరముపైన దుస్తులన్
    దారుణమైన 'పూనికను' దాల్చిన గొప్ప దయాళు , త్యాగి మా
    భారత మాత గన్న జనవంద్యుడు రాట్నము ద్రిప్పు గాంధియే.

    రిప్లయితొలగించండి
  11. పద్యరచన:చరఖా త్రిప్పెడి గాంధిని
    బురఖాలో దాచి నేడు వోట్లను కొనగా
    సురపంచుచు ప్రజలకిపుడు
    ఎరపెట్టిరి నేతలు సభ కెన్నిక యవగన్
    అమరుడయె గా౦ధి నాడుహత్య యొనర్చ
    జాతి పిత యని కొనియాడి చాటు కొనిరి
    చంపి వేసిరి యతని యాశయము లన్ని
    మద్యపాననిషేధమ్ము మతకలహము

    రిప్లయితొలగించండి
  12. ఖద్దరునే ధరియించెను
    వద్దనె హింసయు నసత్య వాదము మనకున్
    రద్దనె పరాయి పాలన
    యిద్దినముననే గతించె నీ మన బాపూ.

    రిప్లయితొలగించండి
  13. చరఖా వడుకుచు గాంధియె
    చెరవిడిపించుచు జగతికి చేతన నిచ్చెన్
    భరతము యున్నంతవరకు
    మరువదుగా జాతి నిన్ను మాన్య మహాత్మా!!!

    రిప్లయితొలగించండి
  14. రాట్న మాయుధముగ రణము నడిపినాడు
    దండి లోన ఉప్పు వండినాడు
    కత్తి పట్ట కుండ కదముగెలిచినాడు
    గాంధి తాత చాల గడుసువాడు

    రిప్లయితొలగించండి