30, ఏప్రిల్ 2017, ఆదివారం

సమస్య - 2350 (గయ్యాళినిఁ బెండ్లియాడ...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"గయ్యాళినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్"
(లేదా...)
"గయ్యాళిన్ దగఁ బెండ్లియాడి నపుడే కల్గున్ గదా సౌఖ్యముల్"

66 కామెంట్‌లు:

  1. ఒయ్యారిని బెండ్లాడిన
    కయ్యాలే పగలు రాత్రి కలలో నైనన్;
    తియ్యటి వేదాంత మలరు
    గయ్యాలినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్

    రిప్లయితొలగించండి
  2. వయ్యారంబులు జిల్కు సుందరిని స్వప్నంబందు గాంచంగనే
    సయ్యాటల్ సలుపంగ నెంచె వడుగౌ చంగుండు త్యాగయ్య యే
    లయ్యా! తీసుకురారు వేగముగ నా యాలిన్; ముదంబొప్ప త్యా
    గయ్యాలిన్ తగ పెండ్లియాడి నపుడే కల్గున్ గదా సౌఖ్యముల్
    (చంగుడు = సుందరుడు; త్యాగయ్యాలిన్ = త్యాగయ్య + ఆలిన్)

    రిప్లయితొలగించండి
  3. కుయ్యో మొర్రో యనుచున్
    కయ్యానికి కాలు దువ్వు కాంతయె మేలౌ
    సయ్యాట లందుకొను మను
    గయ్యాలినిఁబెండ్లి యాడగా సుఖమబ్బున్

    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
  4. అయ్యా,పెండ్లాడను ఆ
    గయ్యాలిని, బెండ్లి యాడగా సుఖమబ్బున్
    నెయ్యము గల్గిన స్త్రీతో,
    వియ్యము నేకోరునట్టి వెలదుల తోడన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యా కృష్ణగారూ ! పద్యం బాగుంది.
      ఉకారసంధి నిత్యం. కాబట్టి మొదటిపాదం ఇలా మారిస్తే ఎలా ఉటుందంటారు?
      అయ్యా! ఆడను పెండ్లా

      తొలగించండి
    2. నమస్కారము సోమ నేమాని గారు. మీ యొక్క సూచన ఆమోద యోగ్యము తప్పక పాటిస్తాను
      సర్వ వేళలందు పద్యములలో తప్పులున్న చూప ప్రార్ధన

      తొలగించండి


  5. అయ్యరి మాట వినవలెన్
    సయ్యాటలనన్ జిలేబి సరసపు పల్కుల్
    కయ్యంబన సయ్య నెడౌ
    గయ్యాలినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నోరూరించు జిలేబీ!
      చారుతరము లయ్యె నీదు చక్కని కవితల్
      కోరెద తెలుపవె యసలుగు
      పేరున్ ముసుగేలనొ సుకవివరా నీకున్?

      తొలగించండి


    2. నేమానిసోమ కవివర !
      యీమా లినియౌ బిలేజి యిష్టసఖియున
      య్యా మాయయ్యరు గారికి
      ధామన్ ! గయ్యాళి పేరు ధన్య జిలేబీ !

      ಜಿಲೇಬಿ

      తొలగించండి


  6. అయ్యారే సరిజోదు గారు రమణుల్, నారుల్, జిలేబీలకు
    న్నయ్యారే మనువాడు వారు వినురన్నా! మేలు మేలైనవా
    రయ్యారయ్యని కాలు ద్రువ్వు వనితల్, రావంబు గానన్ భళా
    గయ్యాలిన్ దగఁ బెండ్లియాడి నపుడే కల్గున్ గదా సౌఖ్యముల్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. ఓ తల్లి భావన:
    ఒయ్యారి దౌచు సుతునిన్,
    *గుయ్యోమనిపించ గల్గ కోడలు పిల్లై
    చయ్యన ప్రక్కింటి పరమ
    గయ్యాళిఁ*, బెండ్లియాడఁగా సుఖమబ్బున్

    రిప్లయితొలగించండి
  8. కం।।
    వియ్యాలందిననాడే
    వయ్యారికిచెప్పినాడవలదనితగవుల్
    కయ్యానికికాల్దువ్వని
    గయ్యా లినిఁ బెండ్లియాడఁగా సుఖమబ్బున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శా।।
      కయ్యాలైననునేమియాలిమరితాగయ్యాలికానేమినే
      వియ్యంబందగబుచ్చుకొందునుగదాబెక్కుల్ ధనంబుల్సదా
      వయ్యారంబులుజాలజూపికడుసంవాదమ్ములన్ జేయు నీ
      గయ్యాలిన్ దగఁ బెండ్లియాడి నపుడే కల్గున్ గదాసౌఖ్యముల్.

      తొలగించండి
  9. శయ్యాగృహమున పతికిన్
    సయ్యాటల తీసిపోక సరిజోడగుచున్
    సైయ్యను వలపుల తగవుకు
    గయ్యాళినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్

    రిప్లయితొలగించండి
  10. _కయ్యము,నెయ్యము లన్నియు_
    _తొయ్యలికి కాపురమున సదుద్దేశ్యంబే_
    _కయ్యనుటయు మన కొరకౌ_
    *గయ్యాళిని పెండ్లియాడగాసుఖమబ్బున్*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామారావుగారూ! స్త్రీలను ఇంత చక్కగా అర్ధం చేసుకున్న మీ సహృదయతకు కోటి కోటి ధన్యవాదాలు!
      చాల చక్కటి పద్యం!👏👏👏👏👏

      తొలగించండి
    2. సీతాదేవి గారి సహృదయతకు ధన్యవాదాలు.

      తొలగించండి
    3. అవును సుమీ మధుర కరణం గారు సూచించినట్లు తొయ్యలికికాపురమున 5 వ గణము జ గణము కాకూడదు గదా తొయ్యలి కాపురము సరిదిద్దవలనేమో

      తొలగించండి
    4. మీ సవరణను ఇప్పుడే గమనించాను. కృతజ్ఞతలు..
      తప్పకుండా సరిచేస్తాను

      తొలగించండి
  11. కయ్యానికి వియ్యానికి
    సయ్యాటకు మరి కనగను సామ్యములుండన్
    గయ్యాళము పలుకు నరుడు
    గయ్యాళిని పెండ్లి యాడగా సుఖ మబ్బున్
    గయ్యాళము=ధిక్కారపు మాట

    రిప్లయితొలగించండి
  12. వియ్యంకుల హతమార్చుచు
    దయ్యములను పారద్రోలి దాయాదులకున్
    నుయ్యో గొయ్యో జూపెడి
    గయ్యాలినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్

    రిప్లయితొలగించండి
  13. అయ్యో ఉలకదు పలకదు
    నెయ్యమ్ముగ బిల్చినకననేరదు అకటా
    కయ్యాలమారియైచను
    గయ్యాళిని పెండ్లి యాడగా సుఖమబ్బున్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  14. ఓ తల్లి భావన:
    ఒయ్యారి దౌచు సుతునిన్,
    *గుయ్యోమనిపించ గల్గ కోడలు పిల్లై
    చయ్యన ప్రక్కింటి పరమ
    గయ్యాళిఁ*, బెండ్లియాడఁగా సుఖమబ్బున్

    రిప్లయితొలగించండి
  15. అయ్యా! సన్యాసి యోగము
    సయ్యాటగ దలచితీను సకలము యెరిగిన్
    కుయ్యో మనియెదు రాడక
    గయ్యాళిని పెండ్లి యాడగా సుఖ మబ్బున్

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టా
    బొయ్యారంబుల కాపుర
    మయ్యా మద్యంబు మాను మనని యువతియై
    కుయ్యాలించిన మేలా?
    గయ్యాళిని బెండ్లి యాడగా సుఖమబ్బున్

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. డా.పిట్టా
    కయ్యము నేరని వర్గపు
    వియ్యముతో పాలనంబు విఫలంబగు మీ
    వ్రయ్యలు దీసెడి పక్షపు
    గయ్యాళిని బెండ్లియాడగా, సుఖ మబ్బున్

    (బలయుత ప్రతిపక్షము యొక్క ఆవశ్యకత నాశిస్తూ,)

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. అయ్యా విను నాదు పలుకు
      లియ్యవసరమున వరించి యీ సుందరిని
      న్నొయ్యన మనంబున వదలి
      గయ్యాళినిఁ, బెండ్లియాడఁగా సుఖ మబ్బున్


      ఒయ్యారంబులు సూపి మోహమున నయ్యోషిత్తు లాయత్తలై
      సయ్యాటమ్ములఁ గూలఁ ద్రోయుదురె యిశ్సాతోదరిం జూడ మే
      లయ్యా సద్గుణ రాశి రూపవతి సత్యం బెంచగన్ వీడి యీ
      గయ్యాళిన్, దగఁ బెండ్లియాడి నపుడే కల్గుం గదా సౌఖ్యముల్

      తొలగించండి
    2. ఒయ్యారంబులు సూపి మోహమున నయ్యోషిత్తు లాయత్తలై
      సయ్యాటమ్ములఁ గూలఁ ద్రోయుదురె యిశ్సాతోదరిం జూడ మే
      లయ్యా సద్గుణ రాశి రూపవతి సత్యంబెల్ల స్థైర్యంపు ప్రో
      గయ్యాళిన్, దగఁ బెండ్లియాడి నపుడే కల్గుం గదా సౌఖ్యముల్

      [ప్రోగు+అయ్యాళి = ప్రోగయ్యాళి; ఆళి = నిర్మలమయిన మనసుగలది]

      తొలగించండి
  20. అయ్యో!ధరలో నరకమె
    గయ్యాలినిఁ బెండ్లియాడఁగా!,సుఖమబ్బున్
    శయ్యన్ భువియే స్వర్గం
    బయ్యారే!సానుకూలయౌ సతి దక్కన్ !!


    అయ్యో! జీవితమెల్ల దుర్భరము పెండ్లాడంగనిల్లాలుగా
    గయ్యాళిన్ !, దగఁ బెండ్లియాడి నపుడే కల్గున్ గదా సౌఖ్యము
    ల్శయ్యాభోజనకార్యసద్విధులలో రంభాంబదాసీగణం
    బయ్యున్ ప్రేమను పంచు సాత్త్వికగుణాఢ్యన్ ధర్మపత్నీగతిన్ !!

    రిప్లయితొలగించండి
  21. డా.పిట్టా
    సయ్యాటన్ బొనరారు దంపతి యదే స్వర్గంబు నా ద్రాగుచున్
    గొయ్యిన్ ద్రవ్వరె భావి పౌరులకిలన్ ఘోరంపు దుర్వర్తనన్,
    బొ(పొ)య్యిన్ బిల్లిని లేపగన్ వలయు నీ పోరాటపుం జీవికన్
    గయ్యాళిన్ దగ బెండ్లి యాడినపుడే కల్గున్ గదా సౌఖ్యముల్!

    రిప్లయితొలగించండి
  22. నెయ్యమునఁ బతినిఁ బ్రోచుచు
    సయ్యాటలతోడ నిచ్చ సాగుచు గృహమున్
    కయ్యమున పరుల పైఁ బడు
    గయ్యాలినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్

    రిప్లయితొలగించండి
  23. కయ్యాలందున సాగుసుమ్ము బ్రతుకుల్ కాంచన్ కళత్రమ్ముగా
    గయ్యాలిన్, దగఁ బెండ్లియాడి నపుడే కల్గున్ గదా సౌఖ్యముల్
    తియ్యంబైన యడందతోచెలఁగు సాధ్విన్ మెచ్చ సంబంధులున్
    సయ్యాటమ్ములతోడసంతసమునన్ సాగున్ ప్రయాణమ్మిలన్

    రిప్లయితొలగించండి
  24. కయ్యము నెయ్యము వియ్యము
    లుయ్యాల లనూగునట్టు లురుకుచు చేయన్
    తియ్యగ మాట్లాడ గలుగు
    గయ్యాళినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కోరి శని మన జంటపై క్రూరు డయ్యె
    మతి భ్రమించగ కుందుచు మరచితి నిను ,
    తరుణి వంచించితేనని తలచ వలదు
    లాలనము జేయనిమ్మిక లలన ! నన్ను

    రిప్లయితొలగించండి
  25. శా. కుయ్యాలించెను తండ్రితోడ సుతుడున్ కూర్మిన్ సదావేడగా
    నయ్యా! నాథుడులేని సుందరియనన్ నన్నామె కాంక్షింప గా
    నయ్యా! సద్గుణరాశి మానితను నాయాకాంక్ష దీరంగ నే
    గయ్యాలిన్ దగబెండ్లి యాడనపుడే కల్గున్ గదా సౌఖ్యముల్.
    (ఏగు+ఆ+ఆలిన్=గయ్యాలిన్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారు మీ ప్రయత్నము బహు శ్లాఘనీయము. ఏగు +అయ్యాళి : ఏగునయ్యాళి అవుతుంది. (ఉదంతమగు తద్ధర్మార్థవిశేషణమున కచ్చు పరమగు నపుడు నుగాగమం బగు)
      నేను గూడ ముందు ఆగు+అయ్యాళి (ఆగుము అయ్యాళి) అని ప్రయోగించి అచ్చు పరమైనది కాబట్టి ము వర్ణక లోపము సరి కాదని మార్చితిని.
      ఇప్పుడు మళ్ళీ యిదే రీతిలో పూరణ చేసితిని. పరికించండి.

      తొలగించండి

  26. అయ్యో! యందురు పురుషులు
    గయ్యాళని భార్యనేమొ గడుసరి తనమున్
    కయ్యాలను దాము విడువ
    గయ్యాళిని పెండ్లియాడగా సుఖమబ్బున్!

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బ్రుయ్యును శాంతి సుఖమ్ములు
    గయ్యాళిని బెండ్లియాడగా; సుఖమబ్బున్
    నెయ్యము జూపుచు ననయము
    కయ్యము లాడక పొదలెడి గాదిలి వలనన్

    రిప్లయితొలగించండి
  28. గయ్యాళికి మనసుండద?
    నుయ్యాలల కూగుశక్తి యుంచినయపుడే|
    నెయ్యము జేసెడి మనసగు
    గయ్యాళిని పెండ్లి యాడగా సుఖ మబ్బున్|
    2.నెయ్యంబందున నేర్పు,కూర్పులట నన్నేగోరి ప్రేమించగా?
    సయ్యంచున్ మనసెంచు మార్పులకు విశ్వాసంబుదీవించగన్
    గయ్యాళిన్ దగబెండ్లి యాడినపుడే కల్గున్ గదా సౌఖ్యముల్
    కయ్యంబట్లుగ శోభనంబు జరుపన్ సంకల్పంబు శోబించెగా|

    రిప్లయితొలగించండి
  29. నెయ్యమ్మున్ ప్రసరించు మిత్రుడకటానేడిట్లు శత్రుండయెన్
    కుయ్యాలించడు, వాని జిహ్వపడ ఆ కోపిష్టి నేస్తమ్ముకున్
    కయ్యమ్మాడిడు భార్యయే దొరకుచో కాబోదె శిక్షింవగన్
    గయ్యాళిన్ పెండ్లియాడినపుడే కల్గున్ గదా సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  30. .దయ్యంబైనను మారు మార్పులకు సంధానమ్మె సౌఖ్యంబిడన్|
    అయ్యా|కొబ్బరికాయవంటి గుణమే నాశించంగ పాలబ్బునా?
    ఒయ్యారంబున సాధ్యమాపగులునా?ఓతంత్రంబు లేకున్నచో?
    గయ్యాళిన్ దగ బెండ్లియాడి నపుడే కల్గున్ గదాసౌఖ్యముల్|

    రిప్లయితొలగించండి
  31. గురువు గారు శంకరయ్య గారి ఆరోగ్యము ఎలా ఉన్నదో ఏమో ఇవాళ సమీక్షకు పద్యములు నోచుకోలేదు గదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారు ఎవరిదో మాసికం ఉన్నదని వేరే ఊరు వెళ్ళారు. ఈ రోజు బ్లాగ్ కు అందుబాటులో ఉండక పోవచ్చునని వాట్సప్ గ్రూప్ లో సందేశం పెట్టారు

      తొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  33. కం . కయ్యాని కి రారు ఎవరు
    సయ్యాటలు సాగనీదు సంసారమునన్,
    సయ్యాటలుసాగనివ్వని
    గయ్యాళిని cబెండ్లి యాడ cగా సుఖ మబ్బున్
    కొరుప్రోలు రాధా కృష్ణారావు

    రిప్లయితొలగించండి
  34. వయ్యారము చూచుట కా
    దయ్యా యనును యువతరము దారను వెతుకన్
    చెయ్యుము సఖినిం డేటిం
    గయ్యాళినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్

    ఆళి = సఖి
    డేటింగ్ ఆంగ్ల పదము వాడాను, క్షమించండి.

    రిప్లయితొలగించండి
  35. సయ్యాటలాడ నేర్చిన
    వయ్యారము లొల్కునట్టి వనితయె తానే
    జియ్యరు మెచ్చుచు వచ్చిన
    గయ్యాళినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్

    రిప్లయితొలగించండి
  36. కయ్యములెనిత్య కృత్యము
    గయ్యాలినిఁ బెండ్లియాడఁగా, సుఖ మబ్బున్
    తియ్యని మాటల నాడుచు
    నెయ్యపురాలై చరించు నెలతయె యున్నన్


    అయ్యారే కడు సుందరాంగిని వివాహమ్మాడె ప్రేమించియే
    కయ్యాలే యిక నిత్యకృత్యమవ శోకమ్మాతనిన్ జేరనే
    గయ్యాలిన్ దగఁ బెండ్లియాడి నపుడే, కల్గున్ గదా సౌఖ్యముల్
    వయ్యారుల్ గన సద్గుణాత్ములిల సంప్రాప్తించినన్ చాలునే

    రిప్లయితొలగించండి
  37. కవిమిత్రులకు నమస్కృతులు.
    మా బావమరది ప్రథమ మాసికానికి వెళ్ళి ఇంతకు ముందే ఇంటికి చేరుకున్నాను. అంతర్జాలం అందుబాటులో లేక మీ పూరణలపై వెంటవెంట స్పందించలేక పోయాను. అలసట వల్ల ఇప్పుడు కూడా సమీక్షించలేను. మన్నించండి.
    ఈనాటి సమస్యకు పూరణలు పంపిన...
    జి. ప్రభాకర శాస్త్రి గారికి,
    నేమాని సోమయాజులు గారికి,
    బి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారికి,
    పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి,
    జిలేబీ గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    మాకెన నారాయణ పాత్రుడు గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    చేపూరి శ్రీరామారావు గారికి,
    తోపెల్ల మూర్తి గారికి,
    వీటూరి భాస్కరమ్మ గారికి,
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి,
    డా. పిట్టా సత్యనారాయణ గారికి,
    పోచిరాజు కామేశ్వర రావు గారికి,
    మైలవరపు మురళీకృష్ణ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    గుఱ్ఱం సీతాదేవి గారికి,
    క్రొవ్విడి వేంకట రాజారావు గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    కొరుప్రోలు రాధాకృష్ణారావు గారికి,
    తంగిరాల రఘురామ్ గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    విరించి గారికి....
    అభినందనలు, ధన్యవాదాలు.
    మిత్రుల పద్యాలలోని గుణదోషాలను ప్రస్తావించినవారికి ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  38. కయ్యంబులెమిగులు బ్రతుకున
    గయ్యాళిని బెండ్లియాడగ సుఖమబ్బున్
    తొయ్యలి కోరిమి హెచ్చిన
    నెయ్యపు సంసారమగుచు నెలతయు మురియున్.

    9493846984 Dr.B.Umadevi


    కయ్యమె నిత్యము జరుగును
    గయ్యాళిని పెండ్లియాడగ,సుఖమబ్బు
    న్నెయ్యమునొద్దిక కలిగిన
    నొయ్యారియెసఖియు నైన నొప్పుగ బ్రతుకున్

    రిప్లయితొలగించండి
  39. డా.పిట్టా
    బొయ్యారంబుల కాపుర
    మయ్యా మద్యంబు మాను మనని యువతియై
    కుయ్యాలించిన మేలా?
    గయ్యాళిని బెండ్లి యాడగా సుఖమబ్బున్

    రిప్లయితొలగించండి
  40. కయ్యమున తులాభారము
    మొయ్యఁగ కృష్ణయ్యఁ దూచి పొందఁగఁ జూడ
    న్నొయ్యారి సత్యఁ బోలిన
    గయ్యాలిఁ బెండ్లియాడఁగా సుఖమబ్బున్

    రిప్లయితొలగించండి
  41. దయ్యమ్మౌచును నాడ బిడ్డలకు తా దట్టించి పిత్రార్జితాల్
    బియ్యం బెట్టక నొక్క పక్షికినితా బీర్వాలు నింపించుచున్
    కయ్యమ్మాడుచు నత్త మామలను తా కాశీకి తర్లించెడిన్
    గయ్యాళిన్ దగఁ బెండ్లియాడి నపుడే కల్గున్ గదా సౌఖ్యముల్ :)

    రిప్లయితొలగించండి