5, అక్టోబర్ 2026, సోమవారం

సమస్య - 5611

6-10-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సూతినిఁ గని నాకవిభుఁడు శోకితుఁ డయ్యెన్”

(లేదా...)

“సూతినిఁ గాంచి నాకపతి శోకమునొందెను ప్రాణభీతిచే”

(న.చ. సాహిత్ శతావధానంలో బైరపనేని పోతురాజు చౌదరి గారి సమస్య)

5 కామెంట్‌లు:

  1. దైతేయుని సతి యొందిన
    సూతినిఁ గని నాకవిభుఁడు శోకితుఁ డయ్యెన్ ,
    జాతుడు పెరిగిన పిమ్మట
    ఈ తావిషము పయికతడు యెత్తెడు భీతిన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    రీతిగఁ జేసెడు తపమున
    కాతంకము గూర్చెననుచు త్ర్యక్షుడు మాడ్చన్
    బాతకము తనదని రమా
    సూతినిఁ గని నాకవిభుఁడు శోకితుఁ డయ్యెన్!

    ఉత్పలమాల
    భూతగణాధిపుండు గిరి పుత్రినిఁ గొన్నఁ దదీశ్వరాంశ సం
    భూతకుమారసంభవము పోగొను నంచును దారకాసురున్,
    బ్రీతిగఁ బూన్చ మన్మథుని ప్రేల్చగఁ ద్ర్యంబకుటగ్ని, మాధవీ
    సూతినిఁ గాంచి నాకపతి శోకమునొందెను ప్రాణభీతిచే!

    రిప్లయితొలగించండి
  3. పరీక్షిన్మహారాజుతో శుక బ్రహ్మ:

    భూతలమందునసరిలే
    దా తపమెంతోకఠినము ధ్వంసముజేయన్
    చేతలుడిగెనునృపా! దితి
    *సూతిని గని నాకవిభుడు శోకితుడయ్యెన్*

    (హిరణ్యకశిపుని కఠోర తపస్సు ధ్వంసం చేయలేక ఇంద్రుడు శోకితుడైనాడని భావము)

    రిప్లయితొలగించండి

  4. సీతను గాయ పరచెనని
    కాతాళముతో రఘుపతి ఘాసిని వేయన్
    పీతువు కోల్పోయిన తన
    సూతినిఁ గని నాకవిభుఁడు శోకితుఁ డయ్యెన్.


    నాతియె కోరె నంచు యదు నందను డంతట సత్య భామతో
    నా తెఱగంటి రేణిదగు నారెము వేలుపు జెట్టుకై సమా
    ఘాతము జేయు పాళమున కైటభ ప్రద్విషు డైన దేవకీ
    సూతినిఁ గాంచి నాకపతి శోకమునొందెను ప్రాణభీతిచే.

    రిప్లయితొలగించండి