9, మార్చి 2017, గురువారం

సమస్య - 2303 (పడమటం బొంచె రవి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"పడమటం బొంచె రవి సుప్రభాతమందు"
లేదా...
"పడమటఁ బొంచి చూచెనఁట భానుఁ డుషోదయకాంతు లీనుచున్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

8, మార్చి 2017, బుధవారం

మా దక్షిణ భారత తీర్థయాత్ర....

ఈనెల 9 నుండి ప్రారంభమయ్యే మా దంపతుల యాత్రావిశేషాలు ఇవి....

9-3-2017 వరంగల్లులో కేరళ ఎక్స్‌ప్రెస్‍లో ప్రయాణం
10-3-2017 తిరువనంతపురం
11-3-2017 శుచీంద్రం, కన్యాకుమారి
12-3-2017 తిరుచందూర్, రామేశ్వరం
13-3-2017 మధురై
14-3-2017 పళని
15-3-2017 శ్రీరంగం
16-3-2017 తంజావూరు, తిరువారూరు
17-3-2017 కుంభకోణం, చిదంబరం
18-3-2017 చెన్నై
19-3-2017 వరంగల్లు చేరుకొనడం.

ఈ ప్రయాణంలో ఎక్కడైనా ఎవరైనా అంతర్జాల, బ్లాగు మిత్రులు కలిసే అవకాశం ఉందా?

ఈ యాత్రకోసం వరంగల్ నుండి త్రివేండ్రం, చెన్నై నుండి వరంగల్ రైల్వే రిజర్వేషన్లు చంద్రమౌళి సూర్యనారాయణ గారు చేయించారు. వారి సౌహార్దానికి ధన్యవాదాలు.

సమస్య - 2302 (హరునిఁ జూచి వేగమ్మున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె"
లేదా...
"హరునిఁ గనంగనే కడు భయార్తినిఁ బారె హరుండు వేగమే"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

7, మార్చి 2017, మంగళవారం

దత్తపది - 108 (కట్టె-నిప్పు-బూది-మసి)

కట్టె - నిప్పు - బూది - మసి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
పచ్చని ప్రకృతిని వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

6, మార్చి 2017, సోమవారం

సమస్య - 2301 (అరయఁగ రాముని కుమారులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"అరయఁగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్" 
లేదా...
"అల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మే మిందులో"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో 🌻)

5, మార్చి 2017, ఆదివారం

సమస్య - 2300 (స్త్రీలకు మ్రొక్కిన ధనమును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్" 
లేదా...
"స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో)

4, మార్చి 2017, శనివారం

సమస్య - 2299 (రావణునకుఁ బుత్రుఁ డయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"రావణునకుఁ బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్" 
లేదా...
"రావణ కుంభకర్ణులకు రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో)

3, మార్చి 2017, శుక్రవారం

సమస్య - 2298 (ద్రౌపది సీతయును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే" 
లేదా...
"ద్రౌపది సీత యిద్ద రొక తండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా!"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో)

2, మార్చి 2017, గురువారం

సమస్య - 2297 (ముగురు స్త్రీల మగఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి"
(గరికిపాటి వారు పూరించిన సమస్య)
లేదా...
"ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె యాదియోగియౌ"

1, మార్చి 2017, బుధవారం

సమస్య - 2296 (వదినా నీ కందఁ జేతు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"వదినా నీ కందఁ జేతు స్వర్గసుఖమ్ముల్"
లేదా...
"వదినా కౌగిటఁ జేర్చుకొందు నిను నే స్వర్గంబుఁ జూపించెదన్"
(ఒకానొక అవధానంలో గరికపాటి పూరించిన సమస్య)