22-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీర్ణవయస్కు మనువాడఁ జిన్నది కోరెన్”
(లేదా...)
“జీర్ణవయస్కునిం గనిన చిన్నది కోరె వివాహమాడగన్”
21, నవంబర్ 2024, గురువారం
సమస్య - 4949
20, నవంబర్ 2024, బుధవారం
సమస్య - 4948
21-11-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుష్కృత మొనర్చువాఁడె కీర్తిఁ గనును”
(లేదా...)
“దుష్కృతము నొనర్చువాఁడె ఘనకీర్తినిఁ బొందు వివేకవంతుఁడై”
(ఛందోగోపనము)
19, నవంబర్ 2024, మంగళవారం
సమస్య - 4947
20-11-2024 (వారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వరము లేని పాట శ్రావ్యమయ్యె”
(లేదా...)
“స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
18, నవంబర్ 2024, సోమవారం
సమస్య - 4946
19-11-2024 (వారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్”
(లేదా...)
“క్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్”
(ఛందోగోపన సమస్య. సూరం శ్రీనివాసులు గారి తిరుపతి అష్టావధానంలో బోరెల్లి హర్ష ఇచ్చినది)
17, నవంబర్ 2024, ఆదివారం
సమస్య - 4945
18-11-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గురుసరణిఁ జరించు శిష్యకోటికి వగపౌ”
(లేదా...)
“గురుసరణిన్ జరించు టొనఁగూర్చును దుఃఖము శిష్యకోటికిన్”
16, నవంబర్ 2024, శనివారం
సమస్య - 4944
17-11-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుద్దులం జెప్పు పెద్దలం జూచి నగిరి”
(లేదా...)
“సుద్దులఁ జెప్పు పెద్దలనుఁ జూచి జనుల్ పరిహాసమాడరా”
15, నవంబర్ 2024, శుక్రవారం
సమస్య - 4943
16-11-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే”
(లేదా...)
“చెడుదుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే”
14, నవంబర్ 2024, గురువారం
దత్తపది - 211
15-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
మేడ - మిద్దె - గుడిసె - ఇల్లు
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
13, నవంబర్ 2024, బుధవారం
సమస్య - 4942
14-11-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విభవనాశమునకు విష్ణుపూజ”
(లేదా...)
“విభవధ్వంస మొనర్పఁగా మురహరున్ వేడన్ వలెన్ మానవుల్”
12, నవంబర్ 2024, మంగళవారం
సమస్య - 4941
13-11-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మూసీ జలమ్ములె తగు శివార్చనకును”
(లేదా...)
“శంకరునర్చనకై జలమ్ము మూసీనది నుండి తెమ్ము”
(ఛందో గోపనము - కటకం వేంకటరామ శర్మ గారికి ధన్యవాదాలతో)