3, ఏప్రిల్ 2023, సోమవారం

దత్తపది - 193

4-4-2023 (మంగళవారం)
"మూడు - ఆరు - ఏడు - పది"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
(అన్నమరాజు ప్రభాకర రావు గారికి ధన్యవాదాలతో...)

22 కామెంట్‌లు:


  1. *(రావణునితో హనుమంతుని మాటలు)*

    గోపతిని పదింబదిగను కొల్చునట్టి
    యేడుగడవిట్లు సేయుట పాడి యౌనె
    రామ పత్నియౌ యా రుచిరాంగి నిట్లు
    మ్రుచ్చ లించితివికనీకు మూడు నిజము.

    రిప్లయితొలగించండి
  2. కా లముమూడుచునుండెను
    ఆలముసేసిననసువులునారునురామా
    మూలముసోదరియేడుపు
    చాలమపనీకునుపదిలముజానకినాథా
    రావణునిపలుకులు

    రిప్లయితొలగించండి
  3. రావణునితో అంగదుడు:

    ఆటవెలది
    నాతి వీడవేని జాతికి మూడు, పెం
    పారుటన్నదొప్ప నేరదయ్య!
    జానకి నొసగంగ జగతి కేడుగడకు
    లంక పదిలముండు రావణార్య!

    రిప్లయితొలగించండి
  4. హనుమ. రావణుని తో --=
    నీదు జాతికి మూడును నిశ్చ యముగ
    జానకి నా రుచి రాంగిని కాన నుండి
    యేడు గడ నీవు దెచ్చి తీ విటుల హాని
    కలుగు పదిలమౌరాజ్యమ్ము కాడు యగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "జానకిని రుచిరాంగిని..." అనండి.

      తొలగించండి
    2. రెండవ పాదంలో సీత నా రుచి రాంగిని చేటు గూర్ప అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  5. తే. గీ.

    మూడునసురులకు హనుమ మొట్టు విధిని
    ఆరుచునశోక వనమున నడ్డగించె
    ఏడుగడ రావణుడు పంపె నింద్రజిత్తు
    పదికుల వలన కోతిని బందిపెట్ట.

    రిప్లయితొలగించండి
  6. ఆటవెలది:
    రామ బాణ హతికి రావణునకు *మూఁడు*
    *నారు* సీత కంటి నీరు తుదకు
    *యేడు*గడయె రాముఁడెల్లరకు, నతని
    పాలనమున బ్రతుకు *పది*లమగును

    రిప్లయితొలగించండి
  7. ‘ఆ రు’చిరమైన యడవుల నభిచరించి
    దశరధునికి ‘యేడు’డిలను దారవోసి
    పత్ని తోడుగ రఘుపతి ‘పది’లముగనె
    నొనర జేసెను బాధ్యత్వ’మూడు’నటుల

    ఏఢుడి = ఆబ్దికము

    రిప్లయితొలగించండి
  8. ముప్పుతప్పదు లంకకు *మూడు*నిపుడు
    *ఆరు*నాలంకకంటిన యగ్నిశిఖలు
    *యేడు*పుల్ పెడబొబ్బలే యెల్లరకును
    *పది*లమేగద శ్రీరామపత్ని సీత

    రిప్లయితొలగించండి
  9. తే॥ రావణునికి మూడు నిపుడు రాముడరిగెఁ
    గొనుచు నూరారు సైన్యము, గోడు మిగల
    యేఁడుపులు పెడబొబ్బలు యెగయు నచట
    పదిలముగను సీతను గొని ప్రభువు వెడల

    రిప్లయితొలగించండి
  10. కొనింటి. రమేశ్

    తే.గీ
    మూడు కాలము వచ్చెను ముదిత వలన
    ఆరు నూరైన వదలడా మేరు నగవు
    ఏడుపే దిక్కగును రాక్షసేంద్రునకును
    పదితలలు నేలపైతెగి పడుట నిజము !

    రిప్లయితొలగించండి
  11. మూడు నింక నీకు ముప్పది రావణా
    ఆరు నింటి దీప మంచునెరిగి
    పదిల పరుచుకొనుము ప్రాణము లింక నీ
    కిన కుల తిలకుండె నేడు గడయు.

    మరొక పూరణ


    మరొక పూరణ
    డా బల్లూరి ఉమాదేవి

    మూడును రావణా పడతి మోహము నిన్నిక శీఘ్రమే యిలన్
    కూడవు శాంతి సౌఖ్యములు కోరిన ప్రాణమె నారు శీఘ్రమే
    వీడుము పట్టు నింక పయి వీడక యున్నను నీకునేడుపే
    మూఢత వీడియిమ్మికను భూతనయన్ పదిలమ్మనీక గున్

    రిప్లయితొలగించండి
  12. మూడునునీకు నివ్విధిని మూర్ఖుడవై చరియించ, నన్యమౌ
    యాడుది ముద్దటంచు, మనసార తలంచుము దేశరక్ష, స్త్రీ
    యేడుపు లంక నాశమొనరించునటంచు నెరింగి భక్తితో
    పాడుచు రామనామమును పాలనమున్ పదిలమ్ము గాంచుమా

    రిప్లయితొలగించండి