8-4-2023 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ”(లేదా...)“నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్”(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)
వశ్యముగాగనుశత్రువుకశ్యపిఖండమువెలుగునుఘనముననహహాపశ్యమునగువీరులవౌనశ్యముగొనుమనుజునివదనముసురభిళమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాశ్యపిఖండమీయదియుగాంచెనువీరరసావతారులన్పశ్యమునయ్యెజాతులకుభాసురశక్తిగలోకమందునన్వశ్యమునయ్యెయోగులకువారథిదాటినపారమార్థమీహ
నశ్యమువాడువానివదనమ్మువచ్చెమనోజ్ఞగంధముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంసస్యము నయనోపశమముదాస్యముతో నార్తి బాప తనరఁ దలచి తాపస్యుడిల సౌమ పూర్వకనస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌఉత్పలమాలసస్యము సూడ కన్నులకు శ్రాంతి లభించు నటంద్రు కోవిదుల్దాస్యము తోడి మానవుని దారుణవేదన బాపనెంచుచున్హాస్యము వత్తిడిన్ జెడుపు నాయుధమంచును 'సౌమ' పూర్వమౌనస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్
కందంవశ్యము గాక యిహమున, కవశ్యమన పరోపకార వాక్సుధ లొలుకన్,కాశ్యపిఁ దలంచి దేహపునశ్యముఁ, గొను మనుజుని వదనము సురభిళమౌఉత్పలమాలవశ్యము గాక లోకమున వాంఛలు రేపెడు సౌఖ్య రాశి, కావశ్య పరోపకారమున వాక్సుధ లొల్కుచుఁ బూనఁ గర్మలన్,కాశ్యపి నందశాశ్వతముగన్ మదిలోనఁ దలంచ దేహపున్నశ్యము వాడు, వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్( నశ్యము: నశింపదగినది)
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
లాస్యయె భర్తను జేరుచుహాస్యముతో పలికె నిటుల యబ్బురమనుచున్ కాస్యపము లమ్ము వీధియునస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ.హాస్యములాడుచున్ బలికె నాసవమున్ గొనుచున్న భర్తతో లాస్యయె హారహూరమును త్రాగెడి వాని సమీపమందునన్ గాస్యపముల్ క్రయించెడి దుకాణము నందున గాని గాంచగన్ నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నస్యము వశ్యకరంబదియాస్యమునన్ నవవిలాసమమరగ జేయున్కస్యపముల గంధమువలెనస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ
దస్యుడపహరించెనచటనస్యపుపొడినుంచిన కడు నాణ్యపు భరిణన్హాస్యములాడుచు తెలిపెనునస్యము గొను మనుజుని వదనము సురభిళమౌ
లాస్యా ప్రియుడుగు నాతడునష్యమునకు వశ్యు దైన నవ్యు o డొకడున్హాస్య o బుగ ని ట్టు లనియె"నస్య ము గొను. మనుజుని వదనము సుర భి ళ మౌ"
నస్యముఁ గొన్నవాని నయనంబులనార్ద్రత గోచరించు నాయాస్యమునందు గాననగు నద్భుతమైన వికాస సంపదల్వశ్యముగాఁగ మానవులవశ్యము నస్యముఁ వీడరెన్నడున్నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞగంధముల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సస్యము లింటికి రాగనెనస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ ,హాస్యముకాదీ రీతినికాస్యపములు వండు వేళ గాంచెదమెపుడున్
ఉ.దాస్యముగా, పొగాకు పొడి, దంచిన గాలిత ధూమ్రపత్రముల్సస్యముగా దలంచి విరజాజి సుమాల రసమ్ము మిశ్రమున్ లాస్యము జేసి పీల్చి కడు లావణి నివ్వగ వేడ్కయే సుధీ*నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్.*
నస్యము రుచిగా నుండుత నస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ నస్యం బలవా టగుచో వశ్యముఁ గాదింక మాన వలదుర నరుఁడా!
నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్ నస్యముఁ బీల్చు వారలకు నాసిక మంతయుఁ గారుచుండుటన్ లాస్య! గనంగనాయె?గను లౌకిక ఙ్ఞానము లేని వారలై వశ్యులు లైమునుంగుదురు వాటికి లోబడి పెద్ద వారలున్
కం॥హాస్యపు పలుకులు చాలును!నస్యముఁ గొనుట వ్యసనమని నలుగురుఁ దెలుపన్హాస్యమగుఁ బలుక నిటుల్నస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌఉ॥ నస్యము వాడుటొక్క వ్యసనమ్మగు నంతియె గాని యెచ్చటన్నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్హాస్యపు పల్కులన్ వినఁగ నచ్చెరు వొందితిఁ దెల్ప సత్యమున్నస్యము వాడరాదు వ్యసనమ్మది నమ్ముము నాదు వాక్కులన్(మేము చిన్నపిల్లలప్పుడు నస్యము కొంతముంది పీల్చుట చూసాము. ఇప్పుడీ అలవాటు లేదండి)
సస్యములన్ భుజించు కడు సౌమ్యుడు, కార్యములన్ రహించు నా లస్యము నొందనీయక, విలాసపు జీవిత మెంచ డెప్పుడున్ లాస్యము చేయవాణి మది, రాజిలు కైతల లోనఁ, బీల్చడా నస్యము వాడు, వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్ ---
ఓల్డ్ పీపుల్స్ రాంబ్లింగ్స్ :)అందరికీ శుభోదయం అనుకోకుండా కలిసాచిననాటి హితుని; జడి తెరిచి యతడు డబ్బాయనెనాతో "నస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌను వయస్యా!"జిలేబి
వశ్యముగాగనుశత్రువు
రిప్లయితొలగించండికశ్యపిఖండమువెలుగునుఘనముననహహా
పశ్యమునగువీరులవౌ
నశ్యముగొనుమనుజునివదనముసురభిళమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాశ్యపిఖండమీయదియుగాంచెనువీరరసావతారులన్
రిప్లయితొలగించండిపశ్యమునయ్యెజాతులకుభాసురశక్తిగలోకమందునన్
వశ్యమునయ్యెయోగులకువారథిదాటినపారమార్థమీ
హ
నశ్యమువాడువానివదనమ్మువచ్చెమనోజ్ఞగంధముల్
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిసస్యము నయనోపశమము
దాస్యముతో నార్తి బాప తనరఁ దలచి తా
పస్యుడిల సౌమ పూర్వక
నస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ
ఉత్పలమాల
సస్యము సూడ కన్నులకు శ్రాంతి లభించు నటంద్రు కోవిదుల్
దాస్యము తోడి మానవుని దారుణవేదన బాపనెంచుచున్
హాస్యము వత్తిడిన్ జెడుపు నాయుధమంచును 'సౌమ' పూర్వమౌ
నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్
కందం
తొలగించండివశ్యము గాక యిహమున, క
వశ్యమన పరోపకార వాక్సుధ లొలుకన్,
కాశ్యపిఁ దలంచి దేహపు
నశ్యముఁ, గొను మనుజుని వదనము సురభిళమౌ
ఉత్పలమాల
వశ్యము గాక లోకమున వాంఛలు రేపెడు సౌఖ్య రాశి, కా
వశ్య పరోపకారమున వాక్సుధ లొల్కుచుఁ బూనఁ గర్మలన్,
కాశ్యపి నందశాశ్వతముగన్ మదిలోనఁ దలంచ దేహపున్
నశ్యము వాడు, వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్
( నశ్యము: నశింపదగినది)
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిలాస్యయె భర్తను జేరుచు
హాస్యముతో పలికె నిటుల యబ్బురమనుచున్
కాస్యపము లమ్ము వీధియు
నస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ.
హాస్యములాడుచున్ బలికె నాసవమున్ గొనుచున్న భర్తతో
లాస్యయె హారహూరమును త్రాగెడి వాని సమీపమందునన్
గాస్యపముల్ క్రయించెడి దుకాణము నందున గాని గాంచగన్
నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండినస్యము వశ్యకరంబది
రిప్లయితొలగించండియాస్యమునన్ నవవిలాసమమరగ జేయున్
కస్యపముల గంధమువలె
నస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదస్యుడపహరించెనచట
రిప్లయితొలగించండినస్యపుపొడినుంచిన కడు నాణ్యపు భరిణన్
హాస్యములాడుచు తెలిపెను
నస్యము గొను మనుజుని వదనము సురభిళమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలాస్యా ప్రియుడుగు నాతడు
రిప్లయితొలగించండినష్యమునకు వశ్యు దైన నవ్యు o డొకడున్
హాస్య o బుగ ని ట్టు లనియె
"నస్య ము గొను. మనుజుని వదనము సుర భి ళ మౌ"
నస్యముఁ గొన్నవాని నయనంబులనార్ద్రత గోచరించు నా
రిప్లయితొలగించండియాస్యమునందు గాననగు నద్భుతమైన వికాస సంపదల్
వశ్యముగాఁగ మానవులవశ్యము నస్యముఁ వీడరెన్నడున్
నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞగంధముల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసస్యము లింటికి రాగనె
రిప్లయితొలగించండినస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ ,
హాస్యముకాదీ రీతిని
కాస్యపములు వండు వేళ గాంచెదమెపుడున్
ఉ.
రిప్లయితొలగించండిదాస్యముగా, పొగాకు పొడి, దంచిన గాలిత ధూమ్రపత్రముల్
సస్యముగా దలంచి విరజాజి సుమాల రసమ్ము మిశ్రమున్
లాస్యము జేసి పీల్చి కడు లావణి నివ్వగ వేడ్కయే సుధీ
*నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్.*
నస్యము రుచిగా నుండుత
రిప్లయితొలగించండినస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ
నస్యం బలవా టగుచో
వశ్యముఁ గాదింక మాన వలదుర నరుఁడా!
నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్
రిప్లయితొలగించండినస్యముఁ బీల్చు వారలకు నాసిక మంతయుఁ గారుచుండుటన్
లాస్య! గనంగనాయె?గను లౌకిక ఙ్ఞానము లేని వారలై
వశ్యులు లైమునుంగుదురు వాటికి లోబడి పెద్ద వారలున్
కం॥హాస్యపు పలుకులు చాలును!
రిప్లయితొలగించండినస్యముఁ గొనుట వ్యసనమని నలుగురుఁ దెలుపన్
హాస్యమగుఁ బలుక నిటుల్
నస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ
ఉ॥ నస్యము వాడుటొక్క వ్యసనమ్మగు నంతియె గాని యెచ్చటన్
నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్
హాస్యపు పల్కులన్ వినఁగ నచ్చెరు వొందితిఁ దెల్ప సత్యమున్
నస్యము వాడరాదు వ్యసనమ్మది నమ్ముము నాదు వాక్కులన్
(మేము చిన్నపిల్లలప్పుడు నస్యము కొంతముంది పీల్చుట చూసాము. ఇప్పుడీ అలవాటు లేదండి)
సస్యములన్ భుజించు కడు సౌమ్యుడు, కార్యములన్ రహించు నా
రిప్లయితొలగించండిలస్యము నొందనీయక, విలాసపు జీవిత మెంచ డెప్పుడున్
లాస్యము చేయవాణి మది, రాజిలు కైతల లోనఁ, బీల్చడా
నస్యము వాడు, వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్ ---
ఓల్డ్ పీపుల్స్ రాంబ్లింగ్స్ :)
రిప్లయితొలగించండిఅందరికీ శుభోదయం
అనుకోకుండా కలిసా
చిననాటి హితుని; జడి తెరిచి యతడు డబ్బా
యనెనాతో "నస్యముఁ గొను
మనుజుని వదనము సురభిళమౌను వయస్యా!"
జిలేబి