17, ఏప్రిల్ 2023, సోమవారం

సమస్య - 4398

18-4-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భీరువును జంపి శంభుఁడు ప్రేమఁ జూపె”
(లేదా...)
“భీరువుఁ జంపి శంకరుఁడు ప్రేమను జూపెను లోకరక్షకై”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

15 కామెంట్‌లు:

  1. పాంచభౌతికదేహమ్ముబాసినరుఁడు
    కాటికేగినక్షణమునకాపరగుచు
    ధైర్యమిచ్చుగజీవికితట్టిభుజము
    భీరువునుజంపిశంభుడుప్రేమజూపె

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    తారకాసురు నణచెడు తనయునిడగ
    శివుఁడు పార్వతీ సతిఁబొంద శీఘ్రగతిని
    బూన పూబాణముల, జరాపూర్వకమగు
    భీరువును జంపి శంభుఁడు ప్రేమఁ జూపె

    ఉత్పలమాల
    మీరఁగ తారకాసురుఁడు, మిత్తిని జూపు కుమారసంభవ
    మ్మారసి యయ్యపర్ణగని యంబరకేశుఁడు మోహమందెడున్
    గోరిక పుష్పబాణముల గ్రుచ్చగ నెంచఁగఁ గ్రుద్ధుడై జరా
    భీరువుఁ జంపి శంకరుఁడు ప్రేమను జూపెను లోకరక్షకై

    జరాభీరువు: మన్మథుడు

    రిప్లయితొలగించండి
  3. కారకుడయ్యెకాపరియుగాయముమాన్చగజీవకోటికిన్
    పేరునపేరునన్బిలిచిపేర్చునుమంటనుకాటిలోపలన్
    మీరకధర్మమార్గమునుమేకొనినిల్చిననంతలోననా
    భీరువుజంపిశంకరుడుప్రేమనుజూపెనులోకరక్షకై

    రిప్లయితొలగించండి
  4. పోరున గెల్వ పాశుపతముందయచేయు మటంచు భక్తితో
    భారత యుద్ధ వీరుడగు పార్థుడు సల్పె‌తపంబు శంభుకై
    చేరి తపఃపరీక్షకును, చిందులు త్రొక్కుచు పర్వుతీయు నా
    భీరువుఁ జంపి శంకరుఁడు ప్రేమను జూపెను లోకరక్షకై

    భీరువు = శివుని చేత చంపబడిన ఆ వరాహము

    రిప్లయితొలగించండి
  5. సురల పనుపున వెడలిన మరుడు వేసె
    విరుల శరములు శివుని పై విధి గ నపుడు
    కంటి మంటల కెర యయ్యు గన లి పోయె
    భీరువు ను జంపి శంభు డు ప్రేమ జూపె

    రిప్లయితొలగించండి
  6. క్రూరుడు సావునొల్లకను ఘోర
    తపస్సును జేసె నోర్పుతో
    భూరి పరాక్రమాసురుడు బూనిక
    తోడ వరంబు బొందె హాం
    కారుడు మృత్యువంటె నతిగా భీ
    తిలుచున్న యట్టి
    భీరువు జంపి శంకరుడు ప్రేమను
    బంచెను లోకరక్షుడై

    రిప్లయితొలగించండి

  7. పాలనేత్రమున్ దెరచిన భర్గుని గని
    వణికి పోయెను గద పంచబాణు డట్టి
    భీరువును జంపి, శంభుఁడు ప్రేమఁ జూపె
    తనను గోరిన పార్వతిన్ మనువునాడి


    క్రూరుడు తారకాసురుని గూల్చెడు ధీరుని కోసమై జటా
    చీరుని గోరుచున్ నగజ చేయుతపమ్మును గాంచి శూలికా
    భీరువు పైన మోహమును పెంచగ నెంచిన వాడెయౌ జరా
    భీరువుఁ జంపి , శంకరుఁడు ప్రేమను జూపెను లోకరక్షకై.

    రిప్లయితొలగించండి
  8. భైరవు దపము నాపగ బంచశరుడు
    ధీరునివలె నరుగుదెంచి దిటవు జూపి,
    దాను దలచిన దానికి దలపడగ , న
    భీరువును జంపి శంభుఁడు ప్రేమఁ జూపె

    రిప్లయితొలగించండి
  9. కోరుచు నీలకంధరుని కోమలి పార్వతి దీక్షబూనగా
    ఘోరతపస్సునందుగల గుబ్బలి విల్తుని క్షోభపెట్టగా
    మారుడు బాణముల్ విడువ మానసమందున కింకతో జరా
    భీరువుఁ జంపి శంకరుఁడు ప్రేమను జూపెను లోకరక్షకై

    రిప్లయితొలగించండి
  10. తారకాసురుఁ జంపఁగ ద్వాదశాక్షు
    సంభవమునకు మారుఁడు శర్వు పైన
    పూలబాణము సంధింపఁ బోవ ముదిమి
    భీరువును జంపి శంభుఁడు ప్రేమఁ జూపె

    రిప్లయితొలగించండి
  11. క్రూరుఁడు తారకాసురుని గూల్చగ శైలజపైన శర్వుకున్
    కూరిమి గూర్చిరమ్మనుచు కోరిరి వేల్పులు పచ్చవిల్తునిన్
    మారుడు పూశరమ్ముగొని మార్కొనబోవగనల్గి విస్రసా
    భీరువుఁ జంపి శంకరుఁడు ప్రేమను జూపెను లోకరక్షకై

    (విస్రసాభీరువు = మన్మథుడు)

    రిప్లయితొలగించండి
  12. తే.గీ.
    తారకుని హింసనాపంగ దారివెదకి
    మారుడు విడిన శరముల మారినంత,
    ముజ్జగమ్ముల మనముల ముప్పిరిగొను
    *భీరువును జంపి, శంభుఁడు ప్రేమఁ జూపె*

    ఉ.మా.
    దారిని గన్గొనంగ నిక తారకునడ్డగ, వేసినట్టి యా
    గారడి చేయు బాణములు ఘాతము సేయగ డెందమందునన్,
    గ్రూరము సూపు కన్నులను గ్రోథము మీరగ గాల్చగన్జరా
    *భీరువుఁ జంపి, శంకరుఁడు ప్రేమను జూపెను లోకరక్షకై*

    *అపర్ణ గాడేపల్లి*🙏

    రిప్లయితొలగించండి
  13. తే॥ పార్వతి శివుని ప్రేమకై పరితపించ
    తారకాసురుఁ గూల్చఁగఁ దగిన సుతుని
    కనుచు సురలు గోరఁగఁ గాముఁడనప శరము
    భీరువును జంపి శంభుఁడు ప్రేమఁ జూపె

    ఉ॥ భీరువుఁ జేయునే భయము ప్రేరణఁ ద్రుంచును మానసమ్మునన్
    భారము మోయఁగన్ భయము ప్రక్కకు లాగఁగ భీతిచెందకన్
    గోరుము ధైర్యమున్ భవుని గొల్చిన వారలఁ బ్రోవ నెల్లరున్
    భీరువుఁ జంపి శంకరుఁడు ప్రేమను జూపెను లోక రక్షకై

    (మనిషిని భీరువును చేసే భయమును చంపి దైవ ప్రార్థన కర్తవ్యోన్ముఖలను చేయగలదని)


    రిప్లయితొలగించండి
  14. తారకుఁ జంపు నిక్కముగ త్ర్యక్షునికిన్ శివకున్ జనించు సద్
    వీరు డటంచు వేయ సుమవీరతరమ్ముల నడ్డ మౌనమున్
    మారుడు, వానిపై కనలి మండెడి మూడవ కన్నుతో జరా
    భీరువుఁ జంపి శంకరుఁడు ప్రేమను జూపెను లోకరక్షకై

    రిప్లయితొలగించండి