4, ఏప్రిల్ 2023, మంగళవారం

సమస్య - 4386

5-4-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చచ్చిన భుజగమును మరలఁ జంపుటె తగవౌ”
(లేదా...)
“చచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

26 కామెంట్‌లు:

  1. మ్రుచ్చుగద్రోణునివధకై
    మచ్చరమందుచునధిపతిమైకముతోడన్
    వచ్చెనుద్రౌపదియనుజుడు
    చచ్చినభుజగమునుమరలజంపుటెతగవౌ

    రిప్లయితొలగించండి
  2. పితామహులు భీష్మాచార్యులు నేలగూలిన క్షణాన రారాజు పాండవుల నుద్దేశించి...

    కందం
    తెచ్చి నిలుపగ శిఖండిని
    హెచ్చిన తాతయ్య ముందు హీనులనఁగ ని
    క్కచ్చిగ విలువీడె, తమకుఁ
    జచ్చిన భుజగమును మరలఁ జంపుటె తగవౌ

    ఉత్పలమాల
    తెచ్చి శిఖండినిన్ నిలుప ధీరతనిండిన తాతముందు ని
    క్కచ్చిగ మాటతప్పకయె కార్ముకమున్ విడి వాల్చె శీర్షమున్
    గ్రుచ్చితె బాణముల్ వడెను, క్రూరులు మీరన హవ్వ! చేవయే
    జచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్!

    రిప్లయితొలగించండి
  3. ఉ.

    నచ్చినవాడు మన్మథుడు నాకము నొందుట తప్పుగాదనెన్
    రెచ్చిన కామపీడితయె, రెల్లు వనంబున భర్తకందగా
    గ్రుచ్చుచు కత్తిచేఁ బతితఁ గోపముతోఁ బ్రతిఘాత వాక్కుగా
    *చచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్.*

    రిప్లయితొలగించండి
  4. పొచ్చము తోనే జేసిన
    కుచ్చితములనెఱగి మిగుల కుమిలిన నాడే
    చచ్చితి, కఠినోక్తులతో
    చచ్చిన భుజగమును మరలఁ జంపుటె తగవౌ?

    పొచ్చము లెన్నొ జేసితిని మూఢుడనై క్షమియించు మంచు తా
    హెచ్చుగ నంబరీషమున నేడ్చెడు వాడిని చిల్లకోలతో
    గ్రుచ్చిన భంగినీవిటుల కుత్సన మందున పల్కుటొప్పునే
    చచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్?

    రిప్లయితొలగించండి

  5. చచ్చిన మన్మథున్ గనుచు జాని శుభాంగినతింప శంభునిన్
    మెచ్చి వరంబొసంగెనట మేదిని యందశరీరుడై మనన్
    నెచ్చెలి, కామవాంఛలను నిగ్రహ పర్చుట కోసమై యికన్
    చచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్.

    రిప్లయితొలగించండి
  6. చొచ్చె సుయోధను డు మడుగు
    వచ్చె ను భీముం డ చ టికి వధి యింప గన్
    హెచ్చి న నావే శంబున
    చచ్చి న భుజగ మును మరల చంపుట తగ వవ్

    రిప్లయితొలగించండి
  7. కచ్చితముగ బిరికి గుణము
    చచ్చిన భుజగమును మరలఁ జంపుటె ; తగవౌ
    వచ్చి నలుగురిని కుట్టగ
    దచ్చాడెడు దాని జంప దట్టుడు గాదే

    రిప్లయితొలగించండి
  8. వచ్చిన పదవిని నిక్కుచు
    కచ్చితముగ జనులదోచు కాలాంతకులన్
    రచ్చకుఁదీయగ సిగ్గిలి
    చచ్చిన భుజగమును మరలఁ జంపుటె తగవౌ

    నచ్చిన రాజకీయమున నాయక పాత్రలభించినంతటన్
    వచ్చిన ప్రాతినిధ్యమున వాస్తవ రూపును దాచిపెట్టి తా
    పచ్చిగ కుంభకోణముల పాల్పడి పట్టుబడంగ సిగ్గుతో
    చచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్

    రిప్లయితొలగించండి
  9. ఇచ్చిన మాట నిల్పుటకు నిక్కటులెన్నియొ సైచి పుత్రునిన్
    సచ్చరితన్ సతిన్ విడచి సర్వముఁ గోల్పడి సత్యసంధుడై
    పొచ్చఁపు కాటికాపరిగ ప్రొద్దునుఁ బుచ్చె త్రిశంకుఁ బుత్రుడే
    చచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్

    రిప్లయితొలగించండి
  10. విచ్చలవిడి దానములన్
    సచ్చరితుండొకఁడు సకల సంపదలుడుగన్
    బిచ్చపుజోగిగ మారెను
    చచ్చిన భుజగమును మరలఁ జంపుటె తగవౌ

    రిప్లయితొలగించండి
  11. కం॥ హెచ్చుగ సిపాయి కాల్చఁగ
    నచ్చద యెల్లరకు శత్రు నాశము నకటుల్
    మెచ్చఁగఁ గొన్ని సమయములఁ
    జచ్చిన భుజగమును మరలఁ జంపుట తగవౌ

    ఉ॥ కచ్చిత రీతిగన్ గనుట కష్టము చచ్చిన శత్రుసైన్యమున్
    హెచ్చుగఁ గాల్చఁ దప్పగున! హేయము కాదది సత్యశోధనే
    మెచ్చిన రీతి యుద్ధమును మేటిగ సేయఁగ నెల్లవేళలన్
    జచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్

    రిప్లయితొలగించండి
  12. హెచ్చిననిగ్రహంబుననుహింసనువీడుచుసచ్చరిత్రుడై
    రచ్చనుజేయకేమనసురంథినిగూల్చుచుసాధనంబునన్
    మచ్చరమాదిశత్రువులమట్టునుబెట్టుచుపారమార్థుడై
    చచ్చినపామునేమరలచంపుటన్యాయముసత్యశోధనన్

    రిప్లయితొలగించండి
  13. పచ్చి నిజమ్ములన్ బ్రజకు పంచగ సక్రమ పాలనమ్మనన్
    యచ్చెరువంద సంవదన మబ్దములన్ గొన సాగుచుండగా
    మచ్చలు లేని బాధితుల మానము సైతము రచ్చ కెక్కినన్
    జచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్య శోధనన్.

    రిప్లయితొలగించండి
  14. గిచ్చుచురక్కుచుపడతిని
    హెచ్చుగబాధించినట్టిహీనునివిడకన్
    గుచ్చుచు శూలముతోడను
    చచ్చిన భుజగమునుమరలచంపుట తగవౌ

    రిప్లయితొలగించండి