24, ఏప్రిల్ 2023, సోమవారం

సమస్య - 4404

25-4-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సన్యాసమె భోగములను సంధానించున్”
(లేదా...)
“సన్యాసంబె సమస్తభోగముల సంధానించు మార్గం బగున్”
(వృత్త సమస్యలో యతిని గమనించండి)
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

39 కామెంట్‌లు:

  1. ధన్యాత్ములుకాగోరిన
    సన్యాసులుతపముసేయ చప్పున వచ్చున్
    విన్యాసముతోనప్సర
    సన్యాసమె భోగములను సంధానించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కన్యాలోలతతో తపించి కసిగా కామించి సంప్రీతితో
      ధన్యంబౌగద జీవనంబని సదా తర్కించు సన్యాసులే
      విన్యాసంబులుసేయుచుండఁ గనరో విజ్ఞానులజ్ఞానులై
      సన్యాసంబె సమస్తభోగముల సంధానించు మార్గం బగున్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. కందం
    పుణ్యోక్తుల ప్రవచించిన
    నన్యాసక్తుడనటంచు, నాశ్రమ విభవాల్
    మాన్యత వాహన సేవల
    సన్యాసమె భోగములను సంధానించున్

    శార్దూలవిక్రీడితము
    పుణ్యోక్తుల్ ప్రవచింప నేర్చి భవిలో పోకార్తు శోకమ్ము నే
    నన్యాసక్తుడనంచు భక్తులను శిష్యాళిన్ భజింపంగఁ దా
    మాన్యుండన్ బగిదిన్ సమీకరణ సంపాదించి శ్రీలందినన్
    సన్యాసంబె సమస్తభోగముల సంధానించు మార్గం బగున్

    రిప్లయితొలగించండి

  3. మాన్యులమనుచు జనాళికి
    ధన్యత జేకూర్చునట్టి తపసిని యని మా
    లిన్య కృతులొనర్చు కపట
    సన్యాసమె భోగములను సంధానించున్.

    రిప్లయితొలగించండి
  4. అన్యాక్రాంతముగాకను
    మాన్యంబగుతలపులందుమానిసియుండన్
    పుణ్యంబాయదిసెప్పగ
    సన్యాసమెభోగములనుసంధానించున్

    రిప్లయితొలగించండి

  5. మాన్యుండంచు దలంచుచున్ జనులు సన్మార్గంబు నే జూపుచున్
    దైన్యంబున్ దొలగించు వాడనుచు భక్తాగ్రేసరుల్ జేరగా
    నన్యాలోచన లేక వారినట తా నంకించెడిన్ ద్రాబకున్
    సన్యాసంబె సమస్తభోగముల సంధానించు మార్గం బగున్.

    రిప్లయితొలగించండి
  6. కన్యాలోలుడుగాకకామితములన్కాదంచుమోక్షేచ్ఛతో
    అన్యంబేయదిచింతసేయకనునాయాసంబువీడన్జనిన్
    ధన్యుండాతడుపారమార్థికమునౌదారుల్గనన్జాలులే
    సన్యాసంబెసమస్తభోగములతాసంధించుమార్గంబగున్

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ధన్యతనిడు పాలకడలి
    కన్యను నిచ్చలు కొలుచుచు గావించినదౌ
    హైన్యపు విద్వేష విషయ
    సన్యాసమె భోగములను సంధానించున్.

    రిప్లయితొలగించండి
  8. అన్యాయంబులుచేయక
    మాన్యుండగుచుసతతమ్ముమంచిగపనులన్
    గణ్యముగాచేయ విషయ
    *“సన్యాసమె భోగములను సంధానించున్”*

    రిప్లయితొలగించండి
  9. అన్యాయా ర్జి త ములతో
    ధన్యా త్ముo డై వెలుగుచు ధన సంపద కై
    మున్యా శ్రమ o బును గపట
    సన్యా స మె భో గము లను సంధా నించు న్

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ధన్యత్వంబును గూర్చు శౌరి మహిమల్ దాఖ్యమ్ముతో పల్కుచు
    న్నన్యాలోచనముల్ త్యజించి సతతమ్మా పుండరీకాక్షునిన్
    పుణ్యోపేతములైన మంత్రములతో పూజించి వెల్గొందు స
    త్సన్యాసంబె సమస్త భోగముల సంధానించు మార్గంబగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యత్వంబును గూర్చు శౌరి మహిమల్ తాదాత్మ్యమున్ బల్కుచు
      న్నన్యాలోచనముల్ త్యజించి సతతమ్మా పుండరీకాక్షునిన్
      పుణ్యోపేతములైన మంత్రములతో పూజించి వెల్గొందు స
      త్సన్యాసంబె సమస్త భోగముల సంధానించు మార్గంబగున్.

      తొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ధన్యత్వంబును నిలిపెడు
    మాన్యుడు శౌరిని పొవడెడు మంత్రములనుచున్
    గణ్యపు నిమ్ముల గొను స
    త్సన్యాసమె భోగములను సంధానించున్.

    రిప్లయితొలగించండి
  12. జన్యువుల మార్పిడి సలుప
    నన్యాయముగనె నిలిపిరి యమపుర మందున్
    పుణ్యము విడి పాపభయపు
    సన్యాసమె భోగములను సంధానించున్

    రిప్లయితొలగించండి
  13. ధన్యాత్ముండైహికముల
    సన్యాసముఁ జేయు నరుఁడు, సకలార్థములన్
    మాన్యతగానొందు కపట
    సన్యాసమె భోగములను సంధానించున్

    రిప్లయితొలగించండి
  14. ధన్యాత్ముండిల నైహికమ్ములను బంధమ్ముల్ నిరాసక్తుడై
    సన్యాసంబొనరించి ముక్తిపదమున్ సాధింపనాసక్తుడే
    విన్యాసంబులు వేషధారణలతో పెక్కండ్రు శిష్యాళితో
    సన్యాసంబె సమస్తభోగములనున్ సాధించు మార్గం బగున్

    రిప్లయితొలగించండి
  15. అన్యాయమ్ములు చేయకుండఁ బ్రజకున్నాత్మీయతన్ బంచుచున్
    మన్యమందున నిష్ఠతో తపములో మౌనమ్ముగా నిల్చుచున్
    గణ్యమ్మైన దారి నచ్చరల సాంగత్యమ్ము కాంచన్ దివిన్,
    సన్యాసంబె, సమస్తభోగములనున్ సాధించు మార్గం బగున్

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. (మన్నన పొందుచు కైవల్య పదము జేర్చే దానికంటే భోగమేముంటుందని నా భావనండి)

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. కం॥ మాన్యుఁడు దేవుని చేరుచు
      ధన్యత నొందగ ధరణిని దారులఁ బఱచున్
      మాన్యత నొసఁగును జగమున
      సన్యాసమె భోగములను సంధానించున్

      శా॥ అన్యాయార్జన సేసి హీనతను దుష్టాత్ముండు గానేలనో
      ధన్యాత్ముండుగ ధర్మ మార్గమున నీధాత్రిన్ జరించంగనౌ
      మాన్యుండై యిటు సన్యసించఁగను సన్మానమ్ము తోడన్ గనన్
      సన్యాసంబె సమస్త భోగముల సంధానించు మార్గంబగున్

      తొలగించండి
    4. క్షమించాలి చివరలో "సంధానించు మార్గంబగున్" తప్పు వ్రాసినందున తొలగించి సవరించి పెట్టానండి.

      తొలగించండి
  17. దైన్యంబైన‌ వికారమేది దరిదా‌పుల్లోకి‌ రాకుండఁగా‌
    సన్యసించిన గాని‌‌ మెచ్చి జన బాహుళ్య‌ంబు చిత్రంబుగా‌
    మాన్య దైవసమా‌నుడంచు‌ ఘనమౌ‌ సత్కార‌మే చేసిరే‌
    సన్యాసంబె సమస్తభోగముల సంధానించు మార్గంబగున్”

    రిప్లయితొలగించండి
  18. మరొక పూరణ

    అన్యంబుల దరి జేరక
    నన్యాయ పథంబు వీడి యమరిక తోడన్
    మాన్యత నొందగను విషయ
    సన్యాసమె భోగములను సంధానించున్!

    రిప్లయితొలగించండి