26, ఫిబ్రవరి 2026, గురువారం

దత్తపది - 214

 27-2-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
క్రికెట్టు - వాలీబాలు - టెన్నిసు - పోలో
ఈ పదాలతో రామాయణార్థంలో స్వేచ్ఛాఛందంలో
పద్యం వ్రాయండి.

6 కామెంట్‌లు:

  1. రాముడు వాలితో:

    కందం
    మేలౌనె వక్రికెట్టుల?
    వాలీ! బాలుని తెఱఁగున వచియించెదవే!
    పాలకుడటెన్ని సుఖములె
    పో! లోకాననుకొనంగ మూర్ఖత్వమగున్

    రిప్లయితొలగించండి

  2. మాలన్ వేయుచు పిల్చెగాదె యిది నామాటెన్నిసార్లంటినో
    వాలీ బాలుని వంటి చేష్టలివి నీవా పోరునే మానకన్
    పో లోగుట్టునెఱంగుమంటి నిక నీ మూర్ఖత్వమున్ వీడకన్
    కాలున్ దువ్వెడి వక్రికెట్టులిక వక్కాణించుటో తెల్యదే.

    రిప్లయితొలగించండి
  3. క్షీరముఁవిడ గొట్టుట చక్రి కెట్టు లనెడు
    నీ తలపులు వాలీ!బాలుని బడికోలు
    మనకు హనుమ కంటెన్నిసుమంత శక్తి
    మంతులే లేరుపో! లోకమందు వెదుక

    [చక్రి = హంస]

    రిప్లయితొలగించండి
  4. క్రికెట్టు - వాలీబాలు - టెన్నిసు - పోలో
    శా:"వాలీ! బాలుని నంగదున్ సుతుని గా భావించు సుగ్రీవుడున్ ,
    నీ లో దౌష్ట్యము చక్రి కెట్టులయినన్ నీచమ్ముగా దోచు లే
    పో! లోకమ్మును మెచ్చునే!" యనెడు రామున్ జూచుచున్ వాలి "రా
    మా!లాలిత్యాపు టెన్ని సుద్దు లివి? నీమ మ్మేది నీలో ? " ననెన్.
    (వాలికి, రామునికి మధ్య సంవాదం."నీ దౌష్ట్యాన్ని భగవంతుడు మెచ్చడు, లోకమూ మెచ్చదు" అని రాముడంటే "ఇవన్నీ లాలిత్యపు మాటలు రామా!నీవు యుద్ధ నియమం పాటించావా?" అని వాలి ప్రశ్నించాడు.వాలి చివరికి సమాధాన పడి ఉండ వచ్చు కానీ మొదటి సంభాషణ ఇది.)

    రిప్లయితొలగించండి
  5. ఇది వక్రి కెట్టు లర్థ మ
    గు దుర్మతికి రాజనీతి గురువే పో లో
    నద టెన్ని సుఖము లొసఁగిన
    యది వాలీ బాలు ననుజు నాలినిఁ గొంటే

    రిప్లయితొలగించండి
  6. హనుమ కు పరా క్రి కెట్టుల యవని యందు
    జలధి దాటు టె న్ని సులువు లలరు గాదె
    యతడె పో లోక మున నా డ్యు డనుచు పొగడె
    నతని నపుడు వా లీ బాలు నతి శయ ముగ

    రిప్లయితొలగించండి