28, ఫిబ్రవరి 2026, శనివారం

సమస్య - 5394

1-3-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు”
(లేదా...)
“హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే”

13 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      అతిథి జంగమదేవర యడిగినంత
      వారి సాక్షాత్తు హరునిగన్ భక్తిఁ దలఁచి
      వండి వడ్డించె సుతుఁజంపి బంతిలోన!
      హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు?

      తొలగించండి
    2. చంపకమాల
      సరగున వచ్చి తా నతిథి జంగమదేవర కోరినంతటన్
      సరెయని పుత్రునిన్ దునిమి సాంబునికర్పణ జేసినట్లుగన్
      వెరువక విందుఁజేసెకద! విజ్ఞత వీడియు పల్కు వ్యాఖ్యయే,
      "హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే"

      తొలగించండి
  2. “హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు"
    తలచకుమటుల శివునికై తన కొమరుని
    వండి వడ్డించుటెరుగవో ! పరమ భాగ
    వతుడతడని దెలుసుకొని వక్కణించు

    రిప్లయితొలగించండి

  3. అతిథి దేవుడె పరమేశు డంచు నమ్మి
    యతడు కోరిన రీతిని యంగభవుని
    వండి వడ్డించెకద కడు భక్తితోడ
    హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు?


    అరయగ ప్రాఘుణుండనగ నాపరమేశ్వర తుల్యుడంచు నా
    పురరిపు వేను కోరెనని పుత్రుడటంచు దలంచకుండనే
    పొరిగొని వండెగాదె మరి మూర్ఖుడ యెట్లు వచింతు వెప్పుడా
    హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు, పుత్రునిఁ జంప నొప్పఁడే?

    రిప్లయితొలగించండి
  4. కోరెఁ బ్రాణముల్ గాపాడు కొమ్మటంచు
    నాగహారుడా భక్తునిఁ నంబి సుతుడు
    హరుని లెక్క సేయఁడు; సిరియాళుఁ డెపుడు
    గుండె నిబ్బరమొప్పగ నుండువాడు

    గురుని గృహంబునన్ జదువు గొప్ప మనస్కుని హెచ్చరించెనా
    హరకుడు మాయరూపమునఁ హాయిగ ప్రాణము నిల్చునట్లుగా
    హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు; పుత్రునిఁ జంప నొప్పఁడే
    నరుఁడయినన్ మహామహులు నమ్మిన సత్యము నాలకింపుమా

    రిప్లయితొలగించండి
  5. హర హర శంకరాయని యహర్నిశమున్ శివనామ కీర్తనా
    పరుడయి భక్తితత్పరత ప్రబ్బికొనంగ మహేశుఁగొల్చి భీ
    కరముగ పుత్రు మాంసమును కల్మషకంఠునకీయ నెవ్విధిన్
    హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు? పుత్రునిఁ జంప నొప్పఁడే?

    రిప్లయితొలగించండి
  6. హరుని భక్తిగా గొల్చుచు నహరహమ్ము
    సుతుని సైతము బువ్వగా శూలికిడఁగ
    హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు
    ననుచు బల్కుట భావ్యమా యనఘ మీకు?

    రిప్లయితొలగించండి
  7. సర్వ జీవుల యందున శంభు గాంచు
    భక్తు డొనరించె నతి థి కి భుక్తి గాను
    హరుని లెక్క సేయ డు సిరియా ళు డెపుడు?
    మహిత శివ భక్తుడాత డు మహిని గాదె

    రిప్లయితొలగించండి
  8. నమ్ము వారున్న వచియింత్రు నెమ్మి నెన్నొ
    మున్ను జరగనివి జరగె నన్న విధము
    పుక్కిటి పురాణములు నమ్మఁ బోకు దీని
    హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు


    హరుఁ డరుదెంచి యన్నమును యాచన సేయుట కల్ల సుమ్ము నా
    రి ఋషి కుమారు మాంసము వరించుట కల్లల కెల్లఁ గల్లయౌ
    నరులకు నమ్మకమ్ములు ఘనమ్మన వచ్చును గాంచ నీ కథన్
    హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే

    [తృణీకరించె = చిన్నఁబుచ్చె; ఒప్పఁడే = ఒప్పును]

    రిప్లయితొలగించండి
  9. చం॥ సరి చిరుతొండనంబి యటు చక్కగ పుత్రుని వండి పెట్టుటన్
    హరునకు భక్తి తోడ విని యార్ద్రత నిండఁగ నిద్ర యందునన్
    హరుని దృణీకరించె సిరియాళుఁడు, పుత్రునిఁ జంప నొప్పఁడే
    కరుణను దండ్రియైన కలఁ గాంచితి నీవిధి మెచ్చెనుగ్రుఁడే

    (కలలు సామాన్యంగా ఇలా ఉంటాయండి)

    రిప్లయితొలగించండి

  10. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    దక్షుడున్ మాటలాడుచు దారుణముగ
    హరుని లెక్క సేయడు; సిరియాళు డెపుడు
    చిత్తశుద్ధితో శివపూజ చేయుచుండి
    తండ్రి యాజ్ఞను మీరక తలను వంచె.

    రిప్లయితొలగించండి