20, ఫిబ్రవరి 2026, శుక్రవారం

సమస్య - 5387

21-2-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్”
(లేదా...)
“అండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్”

15 కామెంట్‌లు:

  1. కందం
    దండమువెట్టుచుఁ బూజలు
    గండడు సంక్రాంతి కెంచ కరివరదునకున్
    పండుగ దినమంచున్ గూ
    ష్మాండమ్మను నైష్ఠికునకు నంగన వండెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      దండము వెట్టుచున్ మిగుల దానవవైరికి భక్తినిష్ఠలన్
      గండడు నర్చనంబిడుచు గానము సేయఁగ సంకురాత్రికిన్
      పండుగ వేడుకౌ కతన పద్ధతి మీరక యాలియౌచుఁ గూ
      ష్మాండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్

      తొలగించండి
  2. పండుగ దినమని భర్తకు
    నిండైన మనంబుతోడ నిర్మల మతితో
    కొండంత ప్రేమతో కు
    ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్.

    రిప్లయితొలగించండి

  3. ఎండాకాలంబు ధరలు
    దండిగ గలవంచు మిగుల దావంతముతో
    భాండము దాచుకొనిన కూ
    ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్.


    ఎండలు మెండుగా కురియ నెక్కడ గాంచిన గూరగాయలే
    దండి నిమానమంచు కొన తాహతు లేక విచారమందుచున్
    బండము లుంచినట్టి యొక భాండము నందు లభించినట్టి కూ
    ష్మాండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్.

    రిప్లయితొలగించండి
  4. పండుగ నాడరుదెంచగ
    నఃడమ్మును నైష్ఠికునకు నంగన వండెన్ ,
    మెండగు నాకలినొందగ
    దండిగ దానిని భుజించె దనివోవంగా

    రిప్లయితొలగించండి
  5. మెండుగ శ్రమపడి చేరఁగ
    దండిగ రూప్యములనుగొని తన గీమునకున్
    పండుగ దినమున నొక కూ
    ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్

    రిప్లయితొలగించండి
  6. కొండొక దినమునఁ బతి బ్ర
    హ్మాండమ్మనెను పరిగృహ్య వంటకములనే
    మెండుగఁ బతి తలపుల బ్ర
    హ్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్

    పండుగ నాడు సేసెదను వాసన బియ్యపు వంటకంబునే
    దిండికి సాటిరానిదగు దివ్యమనోహర పక్వ మంచు తాఁ
    బండని గాయలెంచి తన వల్లభుడే రుచి చూచి తెల్ప 'బ్ర
    హ్మాండము!' వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్

    రిప్లయితొలగించండి
  7. యథాతథం గా పూరణ

    కం:అండము, మాంసము ముట్టక
    యుండు ద్విజుని నిష్ఠ మాన్ పు నుద్దేశ్యము తో
    నిండగు ద్వేష మ్మూనుచు
    నండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్
    (బ్రాహ్మణుల నిష్ఠ చూస్తే కొందరికి ద్వేషం కలుగుతుంది. ఆ ద్వేషం తో ఒకామె బ్రాహ్మణుని భోజనానికి గ్రుడ్డు వడ్డింది. వాడు తింటాడా? అంటే తిను, తప్పు లేదు అని నచ్చ జెప్పి దారి తప్పిస్తుంది)

    రిప్లయితొలగించండి
  8. 2)ఉ:"వండగ కమ్మనౌ రుచుల భర్తకు మక్కువ హెచ్చు" నంచు దా
    మెండగు నుప్పు కారముల మేళన తో,తగు పోపు జేసి "బ్ర
    హ్మాండము నీదు వంట" యని యాతడు మెచ్చగ దొడ్డి లోని కూ
    ష్మాండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్”

    రిప్లయితొలగించండి
  9. కం॥ మెండుగ నాఁకలి యనఁగను
    నిండగు భోజనము వెట్ట నియతిని రుచిగాఁ
    బండిన కాయలఁ గని కూ
    శ్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్

    ఉ॥ మెండుగ వేయ నాఁకలియు మెల్లఁగఁ దెల్ప మగండు సుద్దినిన్
    నిండగు భోజనమ్ము నిడ నెమ్మిని హెచ్చుగఁ బిండివంటలున్
    బండిన కాయగూరలను పత్ని గణించుచుఁ బ్రీతి మీర కూ
    శ్మాండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్

    రిప్లయితొలగించండి
  10. మెండగు నాకలి యనగా
    కొండంత మమత గలిగియు కూరిమి తోడ న్
    నిందగు మనమున తా కూ
    ష్మా o డమ్ము ను నై ష్టి కునకు నంగన వండె న్

    రిప్లయితొలగించండి
  11. మెండుగ కాయకష్టమొనరించి ధనమ్మును గూడబెట్టియున్
    పండుగనాఁడు చేరుకొనె బ్రాహ్మణుఁడొక్కఁడు స్వస్థలమ్ముకున్
    దండిగ విత్తమార్జనము తానొనరింపఁగ సంతసించి కూ
    ష్మాండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్

    రిప్లయితొలగించండి
  12. మెండుగ నామెఁ బొగడ నఖి
    లాండము పాక నిపుణతకు నబ్జ వదన భూ
    మండల మందు వెదకి కూ
    ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్


    మెండుగ నుద్ధరింపఁ దగు మేటి కులమ్ము సరోరుహాక్షి యే
    గండము లేక నిష్ఠకును గమ్మగ నత్తఱి చేసి స్నాన ము
    ద్ధండము శాక సంయుతము దప్పళ మంచిత భోజనమ్ము హీ
    నాండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁ డైన భర్తకున్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఎండల కాలము మంచిది
    పండినదిది పెరటియందు బహు పెద్దదిగా
    దండిగ ముక్కలతో కూ
    ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్.

    రిప్లయితొలగించండి