7, ఫిబ్రవరి 2026, శనివారం

సమస్య - 5375

8-2-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నముం దిన నాఁకలి యధికమయ్యె”
(లేదా...)
“అన్నముఁ దృప్తిగాఁ దినిన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో”

21 కామెంట్‌లు:

  1. అంగద కలిగి నందున , నావకాయ
    యన్నముం దిన నాకలి యధికమయ్యె .
    యేది దిన దగ్గునో మరి యెరుక రాదు ,
    తీపి దినుచు జూడనగును దెలియుటకయి

    రిప్లయితొలగించండి

  2. ఉత్తమ గతులు కోరుచు నుర్వియందు
    సతము పరమాత్ముని గొలుచు సాధకులకు
    భక్తి యను రుచి కరమైన శక్తి నిచ్చె
    డన్నముం దిన నాఁకలి యధికమయ్యె.



    వెన్నుని గొల్చువారికి నివృత్తి లభించుటె కాదు కాంచగన్
    చెన్నగు నామమయ్యదియె చింతలు బాపునటంచు నమ్ముచున్
    మిన్నగ విశ్వసించినను మేదిని భక్తి రసంపు సారమా
    యన్నముఁ దృప్తిగాఁ దినిన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో.

    రిప్లయితొలగించండి
  3. చిన్న నాటి మిత్రుండు కుచేలుడరిగె
    చిపిటముల మూటతో తనస్నేహి గృహము
    మూటవిప్పిన మురవైరి తేటఁజేసె
    నన్నముం దిన నాఁకలి యధికమయ్యె

    చిన్నతనంబునన్ దనకుఁ స్నేహితుడేనని భార్యపంపగా
    మిన్నక చేరవచ్చెనట మిత్రసహాయమునెంచి వెన్నుడా
    చెన్నుడు పల్కినాడట కుచేలుడు తెచ్చిన మూట విప్పి నే
    నన్నముఁ దృప్తిగాఁ దినిన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  4. మందు వాడగ రోగంబు మాసి పోయె
    మేని సత్తువ వింతగా మెరుగు పడెను
    వింత రీతిని జఠరాగ్ని హెచ్చు చుండ
    నన్నముం దిన నాకలి యధిక మయ్యె.

    .
    వైద్యు డిచ్చిన మందులు వాడు చుండ
    మేని సత్తువ వింతగా మెరుగు పడెను
    వింత రీతిని జఠరాగ్ని హెచ్చు చుండ
    నన్నముం దిన నాకలి యధిక మయ్యె.

    .

    రిప్లయితొలగించండి
  5. (అన్నము హెచ్చుగా ఎప్పుడు తినినది తెలుపనందున దానిని ఆధారంగా తీసుకున్నానండి)

    తే॥ అన్నముం దిన నాఁకలి యధికమయ్యె
    నెప్పుడా విధి తింటివో చెప్పఁదగును
    నిన్న నారగించితివన నేఁడు క్షుత్తు
    మిగులు పూట పూటకు తిండి మెసఁగ వలయు

    ఉ॥ అన్నముఁ దృప్తిగాఁ దినన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో
    మిన్నగ నెప్పుడా విధిగ మిక్కిలి హెచ్చుగ నారగించితో?
    నిన్నఁ దినంగఁ జోద్యమొకొ నేఁటికి నుండున జీర్ణమై చనున్
    దిన్నగఁ బూట పూట నిలఁ దిండి భుజించఁగ క్షుత్తు చావదా!

    రిప్లయితొలగించండి
  6. తీరు నాకలి జనులకు దిరము గాను
    నన్న ముం దిన :: నాకలి యది క మ య్యె
    తినుట కేమియు దొరక క దీన ముగ ను
    నుప వ సించు చు మగ్గుచు నున్న యెడల

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:పుణ్య మేదియు జేయవు పుడమి పైన
    మనుజునిగ బుట్టి ,చేయక మానె గాని
    పీడన మొనర్చుచున్ నిరు పేద వారి
    అన్నముం దిన నా కలి యధికమయ్యె”
    (కలి అంటే పాపము అనే అర్థం లో వాడాను.)

    రిప్లయితొలగించండి
  8. ఉ:అన్నము, కూర, పచ్చడులు నన్నియు జేయగ భార్య శ్రద్ధగా
    నెన్నియొ పెట్టి వంక లవి యేవియు మెచ్చను, ప్రక్క యింటి లో
    నన్నముఁ దృప్తిగాఁ దినిన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో”
    యెన్నడు నొక్క తిండి తిన నెట్లు రుచించెడు నెట్టి వారికిన్?

    (ఇంట్లో ఎన్ని తిన్నా పొరుగింటి పుల్ల కూర రుచి.)

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    నమ్మి యధికార మిచ్చిరి నాకు జనులు
    దోచఁగలిగినంతయు దోచి దాచుకొంటి
    నోటమిని రాబడి కొదువై నోటికెంత
    యన్నముం దిన నాఁకలి యధికమయ్యె!

    ఉత్పలమాల
    ఎన్నికలందు గెల్చి ప్రజనేలుచు దోచితి రాజ్యసంపదన్
    మన్నన జూపగన్ ప్రజలు మద్దతు నిత్తురటంచుఁ దల్చితిన్
    నున్నగ గుండుగీచిరన నోటికియందక నే గతమ్మునం
    దన్నముఁ దృప్తిగాఁ దినిన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో!

    రిప్లయితొలగించండి
  10. సమస్య: “అన్నముం దిన నాఁకలి యధికమయ్యె”

    భూరి హర్మ్యము లెనలేని భూములున్న
    ఆశ జావక నొరులవి యాక్రమించు
    కాల‌ నాగుల తీరిట్లు గాన వచ్చె
    అన్నముం దిన నాఁకలి యధికమయ్యె

    భావం: ఎన్ని గొప్ప భవనాలు, భూములు ఉన్నప్పటికీ తనివి తీరక ఇతరుల ఆస్తులను కూడా ఆక్రమించుకోవాలనే కాలసర్పాల వంటి మనుషుల తీరు చూస్తుంటే "అన్నం తింటున్న కొద్దీ ఆకలి తీరాల్సింది పోయి మరింత ఎక్కువవుతోంది" అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  11. అకట యేమని చెప్పుదు నన్న మొకటి
    దక్క రొట్టె లన్నవి లేవు దారుణముగఁ
    గల నయిన నెన్నఁ డేను రొట్టెలను గాని
    యన్నముం దిన నాఁకలి యధిక మయ్యె

    [తినను + ఆఁకలి = తిన నాఁకలి]


    అన్నుల మిన్న వంట పరమాన్నము తోడుత భోజనం బహో
    కన్నుల కింపు గొల్పఁ దమకమ్ము సెలంగ నెడంద నాకునున్
    సన్నగ నుండ మున్ను, సరసం గడుపార నసంశయమ్ము వాఁ
    డన్నముఁ దృప్తిగాఁ దినిన, నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  12. భక్తి పెంపార పఠియింప భాగవతము
    తృప్తి యెంతయు మనసునఁ దీరకుండె
    మరల ముమ్మారు చదివినన్ మదికిఁ దోచె
    నన్నముం దిన నాఁకలి యధికమయ్యె

    ఎన్నియొ మార్లు భాగవత మేకబిగిన్ పఠనంబు సల్పినన్
    వెన్నుని లీలలం దెలియ వేగిరపాటగు మానసంబునన్
    కన్నుల నీరు చిప్పిలగ కమ్మని యూహ జనించునిట్లు నా
    కన్నముఁ దృప్తిగాఁ దినిన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  13. వెక్కుచు నుండు సంతతము పెద్దలు దూఱగ కార్యశాలలో
    పెక్కురు గేలిచేయగ వివేక విహీన యటంచు నిత్యమున్
    మిన్నగ విద్యలో వెలుగ మేవడి బుత్రిక, పల్కి లెల్లరున్
    కుక్కకు బుట్టె నంట యొక కుంజర మేల్లరు జూడ వింతగన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ప్రవచనములను వినుచుండి ప్రతి దినంబు
    కొంత జ్ఞానము నలవర్చు కొనుచు రోజు
    చదువుచున్ కొన్ని గ్రంథాలు,జ్ఞాన మనెడి
    యన్న ముందిన నాకలి యధికమయ్యె.

    రిప్లయితొలగించండి