2-2-2026 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్”(లేదా...)“సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్”
కందందంపతులు సుగుణముల మదినింప సదాచారములకు నెలవను రీతిన్సొంపుగ సంతుకు సుకృతపుసంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్ఉత్పలమాలదంపతులైన వారు మదిఁ దప్పక సద్గుణ సంప్రదాయముల్నింపగ సత్ప్రవర్తనలు నెక్కొను ధామమనంగ సర్వులున్సొంపుగ సంతుయున్ సుకృతశోభితులౌచును సాగ పుణ్యపున్సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
సంపదల గోరి పాపపుకుంపటి మోయంగనేల గూఢాత్మునిదౌ యింపగు సత్కృప యనెడిన్ సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్.సంపద లన్న జూడ నఘ సాగరమందున ముంచునట్టి యా సంపదలేల చేతనుని సత్కృప యున్నను చాలు నయ్యదే యింపును గూర్చునంచు పరమేశుని పైగల నమ్మకమ్మనేసంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్.
చెంపలు పగులు నధర్మపు సంపద లధికమ్ము గాఁగ ; సద్గతి దక్కున్ఇంపుగ నెల్లసమయముల నింపుగ నజుని పయి దృష్టి నిలిపిన యెడలన్
వంపులు లేని వర్తనయు వంకలు జూపని కార్యదక్షతన్బెంపు వహింప నేర్పున ల భించిన దానిని గాచువైనమున్ నింపి మనమ్ము నందు కమ నీయత నెక్కొన రమ్య సౌహృదీసంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్!
-సంపాద్యమెల్లపుడొదవ పెంపొందింపంగ కట్టు ప్రేయస్సులకైకొంపల గూల్చక చేర్చినసంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
ఇంపుగ భక్తిని గుండెలనింపిన మనుజుండు మున్గు నిశ్చల భక్తిన్బెంపొందు పారమార్థికసంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్ఇంపుగ చిత్తమందు పరమేశునిపై తగు భక్తితో తపోసంపద లభ్యమౌ నటుల చక్కని యత్నము తోడ జ్ఞానమున్బెంపు వహించు మార్గమున వేదము యోగములట్టి షట్క్రియాసంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
పంపెడు దాత దైవమని భావన జేయుచు, రాగ ద్వేషముల్చంపగ నేర్చి, డెందమున నిచ్చలు నప్పరేశునిన్నింపగ భక్తితో, నమిత నిర్మల ధర్మ గుణ ప్రసిద్ధమౌసంపదలెక్కువైనపుడె సద్గతినందెదరెల్ల మానవుల్.
కం॥ ఇంపగు భక్తి నెద నిలిపిసొంపుగ మానవ హితమునె స్ఫూర్తినిఁ గనుచున్నింపగు సద్గుణములనెడుసంపదలధికమ్ము గాఁగ సద్గతి దక్కున్ఉ॥ ఇంపగు భక్తి భావమున నీశ్వరుఁ గొల్చుచుఁ దత్పరాదులన్సొంపుగ సర్వదా చనుచు స్ఫూర్తిని మానవ సేయఁ జేయుచున్గంపన మేది కాంచక వికాశముఁ బొందిన సద్గుణోచ్చమౌసంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్(భక్తితో పాటు సద్గుణములు సద్వర్తన ముఖ్యమని అండి)
సమస్య : సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్కం. పెంపారిన లౌల్యమ్మునవెంపరలాడంగనేల?, విశ్రావముగన్ ఇంపైన పారమార్థిక సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్భావం : అమితమైన లోభంతో/చంచల స్వభావంతో అనవసరంగా పాకులాడటం ఎందులకు? "ఆధ్యాత్మిక సంపదనుపెంపొందించుకుంటే మానవునికి ఉత్తమ గతి లభిస్తుంది" అనేది లోక ప్రసిద్ధము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కెంపుల బోలిన గీతములింపుగ భావంబు బల్కు రీతిన బాడన్ మంపుల ద్రుంచెడు కీర్తన సంపదలధికమ్ము గాగ సద్గతి దక్కున్మంపు అనగా బద్ధకము
కంపము నొందక మనుజులు నింపొ ద వెడు భక్తి తోడ నీ శుని చింత న్ సొంపగు సత్కర్మ లనెడు సంపద లధి కమ్ము కాగ సద్గతి దక్కు న్
కంప మెఱుంగక సతము తలంపుల వైరాగ్యమే యలవడ భృశముగా నింపార నాత్మ నైతిక సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్ కొంపలు రాజ భోగములు కొల్లలుగా లభియించు నింపుగా గుంపులు గుంపులై వఱలుఁ గోరిన బట్టలు వాహనమ్ములుం బంపు నొసంగు స్థానములు పన్నుగ దక్కును గోరి నంతనే సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.పెంపు వహించగ భక్తియుసొంపుగ దేవునికి పూజ శుద్ధిగ చేయన్ఇంపొసగెడు నాధ్యాత్మికసంపద లధికమ్ము గాగ సద్గతి దక్కున్.
కందం
రిప్లయితొలగించండిదంపతులు సుగుణముల మది
నింప సదాచారములకు నెలవను రీతిన్
సొంపుగ సంతుకు సుకృతపు
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
ఉత్పలమాల
దంపతులైన వారు మదిఁ దప్పక సద్గుణ సంప్రదాయముల్
నింపగ సత్ప్రవర్తనలు నెక్కొను ధామమనంగ సర్వులున్
సొంపుగ సంతుయున్ సుకృతశోభితులౌచును సాగ పుణ్యపున్
సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
రిప్లయితొలగించండిసంపదల గోరి పాపపు
కుంపటి మోయంగనేల గూఢాత్మునిదౌ
యింపగు సత్కృప యనెడిన్
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్.
సంపద లన్న జూడ నఘ సాగరమందున ముంచునట్టి యా
సంపదలేల చేతనుని సత్కృప యున్నను చాలు నయ్యదే
యింపును గూర్చునంచు పరమేశుని పైగల నమ్మకమ్మనే
సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్.
చెంపలు పగులు నధర్మపు
రిప్లయితొలగించండిసంపద లధికమ్ము గాఁగ ; సద్గతి దక్కున్
ఇంపుగ నెల్లసమయముల
నింపుగ నజుని పయి దృష్టి నిలిపిన యెడలన్
వంపులు లేని వర్తనయు
రిప్లయితొలగించండివంకలు జూపని కార్యదక్షతన్
బెంపు వహింప నేర్పున ల
భించిన దానిని గాచువైనమున్
నింపి మనమ్ము నందు కమ
నీయత నెక్కొన రమ్య సౌహృదీ
సంపద లెక్కువైనపుడె
సద్గతి నందెద రెల్ల మానవుల్!
-
రిప్లయితొలగించండిసంపాద్యమెల్లపుడొదవ
పెంపొందింపంగ కట్టు ప్రేయస్సులకై
కొంపల గూల్చక చేర్చిన
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
ఇంపుగ భక్తిని గుండెల
రిప్లయితొలగించండినింపిన మనుజుండు మున్గు నిశ్చల భక్తిన్
బెంపొందు పారమార్థిక
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
ఇంపుగ చిత్తమందు పరమేశునిపై తగు భక్తితో తపో
సంపద లభ్యమౌ నటుల చక్కని యత్నము తోడ జ్ఞానమున్
బెంపు వహించు మార్గమున వేదము యోగములట్టి షట్క్రియా
సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
పంపెడు దాత దైవమని భావన జేయుచు, రాగ ద్వేషముల్
రిప్లయితొలగించండిచంపగ నేర్చి, డెందమున నిచ్చలు నప్పరేశునిన్
నింపగ భక్తితో, నమిత నిర్మల ధర్మ గుణ ప్రసిద్ధమౌ
సంపదలెక్కువైనపుడె సద్గతినందెదరెల్ల మానవుల్.
కం॥ ఇంపగు భక్తి నెద నిలిపి
రిప్లయితొలగించండిసొంపుగ మానవ హితమునె స్ఫూర్తినిఁ గనుచున్
నింపగు సద్గుణములనెడు
సంపదలధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
ఉ॥ ఇంపగు భక్తి భావమున నీశ్వరుఁ గొల్చుచుఁ దత్పరాదులన్
సొంపుగ సర్వదా చనుచు స్ఫూర్తిని మానవ సేయఁ జేయుచున్
గంపన మేది కాంచక వికాశముఁ బొందిన సద్గుణోచ్చమౌ
సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
(భక్తితో పాటు సద్గుణములు సద్వర్తన ముఖ్యమని అండి)
సమస్య : సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
రిప్లయితొలగించండికం. పెంపారిన లౌల్యమ్మున
వెంపరలాడంగనేల?, విశ్రావముగన్
ఇంపైన పారమార్థిక
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
భావం : అమితమైన లోభంతో/చంచల స్వభావంతో అనవసరంగా పాకులాడటం ఎందులకు? "ఆధ్యాత్మిక సంపదనుపెంపొందించుకుంటే మానవునికి ఉత్తమ గతి లభిస్తుంది" అనేది లోక ప్రసిద్ధము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికెంపుల బోలిన గీతము
రిప్లయితొలగించండిలింపుగ భావంబు బల్కు రీతిన బాడన్
మంపుల ద్రుంచెడు కీర్తన
సంపదలధికమ్ము గాగ సద్గతి దక్కున్
మంపు అనగా బద్ధకము
కంపము నొందక మనుజులు
రిప్లయితొలగించండినింపొ ద వెడు భక్తి తోడ నీ శుని చింత న్
సొంపగు సత్కర్మ లనెడు
సంపద లధి కమ్ము కాగ సద్గతి దక్కు న్
కంప మెఱుంగక సతము త
రిప్లయితొలగించండిలంపుల వైరాగ్యమే యలవడ భృశముగా
నింపార నాత్మ నైతిక
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
కొంపలు రాజ భోగములు కొల్లలుగా లభియించు నింపుగా
గుంపులు గుంపులై వఱలుఁ గోరిన బట్టలు వాహనమ్ములుం
బంపు నొసంగు స్థానములు పన్నుగ దక్కును గోరి నంతనే
సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పెంపు వహించగ భక్తియు
సొంపుగ దేవునికి పూజ శుద్ధిగ చేయన్
ఇంపొసగెడు నాధ్యాత్మిక
సంపద లధికమ్ము గాగ సద్గతి దక్కున్.