3, ఫిబ్రవరి 2026, మంగళవారం

సమస్య - 5371

4-2-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివుని నామము నరులకుం జేఁదు సుమ్ము”
(లేదా...)
“శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్”

23 కామెంట్‌లు:

  1. తేటగీతి
    గరళకంఠుని గాధయె స్మరణలేక
    పాపమున్ భిక్షగాగొన భక్తులలర
    మరలమరల స్తవము సేయ మఱువ 'నోరు'
    శివుని నామము, నరులకుం 'జేఁదు సుమ్ము'

    మత్తేభవిక్రీడితము
    స్తవనీయమ్మగు లీలలన్ సలిపి దుస్సాధ్యాలు సాకారమై
    యవనీజాతులు మోదమొందఁగనుచున్ హానిన్ నివారింపగన్
    భవనాశుండగు చంద్రమౌళి మఱువన్ వల్లింప నోరార నా
    శివనామమ్ము, సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్

    రిప్లయితొలగించండి
  2. శివ శబ్దంబు శుభంకరమ్మిలను సు
    శ్రీలన్ ప్రసాదించునే
    భవు నాశీసుల నంద కీ జగతి సం
    భావ్యంబుగాదే సుమా!
    రవళించున్ఘన నామమై సుగతి వి
    భ్రాజిల్లగా నేల నీ
    శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్?!

    రిప్లయితొలగించండి

  3. ఆస్తికత్వము మూర్ఖత్వమనుచు నేడు
    హేతు వాదుల మాటలే యింపటంచు
    తలచినంతట నికపైన ధాత్రియందు
    శివుని నామము నరులకుం జేఁదు సుమ్ము.


    ప్రవయుండొక్కడు బాధతోడ సతితో వాచించె నీరీతిగా
    నవభాసమ్మని క్రొత్త పోకడలవే యావిర్భవించెన్ గదా
    భువిలో దైవపు నామమున్ దలచుటే మూర్ఖత్వ మయ్యెన్ గనన్
    శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్.

    రిప్లయితొలగించండి
  4. మరల మరల పలుకుచుండ మధురమౌను
    శివుని నామము నరులకుం ; జేఁదు సుమ్ము
    ఆశరుల జెవులకు , దాని నాలకించ ,
    పేరొకటె వేరురుచి , జాతి వేరు కనుక

    రిప్లయితొలగించండి
  5. చేఁదు నారగించి జనులన్ జేఁదినావు
    తన్మయత్వము తోడుతన్ దలచినంత
    శివుని నామము నరులకుం 'జేఁదు' సుమ్ము
    స్ఫురణమౌగద హృదయాన గరళకంఠ

    [చేఁదు = తిక్తము; చేఁదు = ఆకర్షించు]

    భవబంధమ్ములఁ వీడి సల్పు తపమున్ భస్మాంగుడే మెచ్చుగా
    శివనామామృతమే నిగుడ్చును గదా శీఘ్రంబుగా మోక్షమున్
    భువిపై భక్తులు పుణ్యకూపము కడన్ బుణ్యార్థులైనిల్వగా
    శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్

    [చేఁద + ఔను = చేఁదౌను; చేఁద = నీళ్లుచేఁదెడు పాత్రము]

    రిప్లయితొలగించండి
  6. సమస్య : "శివుని నామము నరులకుం జేఁదు సుమ్ము”

    తే. ముక్తి నిచ్చునదేది ముముక్షులకును
    సాధ్యమెవరికి సద్గతుల్ సాధనమున
    మోహలోభాదు లెట్టివి మోక్షపథికి
    శివుని నామము, నరులకుం, జేఁదు సుమ్ము
    (క్రమాలంకారం )

    రిప్లయితొలగించండి
  7. అవివేకంబను రోగపీడితులకున్ హాయిన్ ప్రసాదించునా?
    భువిలో నాలుక చేదుకెక్కినపుడున్ పొల్పైన మాధుర్యముల్
    జవికిన్ జేదుగ దోచినట్లుగ భవజ్వాలన్ లయమ్మైన నా
    శివనామమ్ము సమస్త మానవులకుం జేదౌను భావింపగన్

    రిప్లయితొలగించండి
  8. తే.గీ:వీర వైష్ణవు లయ్య యీ యూరి జనులు,
    విష్ణువున్ దప్ప నన్యుల వేడ రయ్య!
    శివునికిన్ గుడి కట్టుట చెల్ల దిచట,
    శివుని నామము నరులకుం జేఁదు సుమ్ము”

    రిప్లయితొలగించండి
  9. తే॥ భవుఁడు భక్తుల పాలిట వరదుఁడు భవ
    బాధలఁ దొలగించు విభుఁడు భార్గవుండు
    నాస్తికత్వమునఁ జనుచు నలుఁగు చుండ
    శివుని నామము నరులకుం జేఁదు సుమ్ము

    మ॥ భవుఁడే భక్త జనాళి రక్షఁగను సంభావించి ప్రార్థించినన్
    భవ బాధాదులఁ దీర్చి ప్రోచు విభుఁడై భద్రంబు నెక్కొల్పఁడే
    భువిలో నమ్ముచు నాస్తికత్వమును బెంపొందించఁగన్ సాగఁగన్
    శివ నామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్

    భార్గవుడు శివుడు

    రిప్లయితొలగించండి
  10. మ:భువికిన్ వెల్గు నొసంగు హిందు మతమున్ బోగొట్టి యన్యమ్ము లౌ
    నవివేకమ్ముల బెంపు జేయుటకు బల్ యత్నమ్ము లౌచుండె నే
    డివి కండ్లన్ గని మౌన ముద్ర నిడగా నీ దేశమం దెన్నడో
    శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్”
    (అన్యమత ప్రచారాలు చూసి ఒక హిందువు ఆవేదన.)

    రిప్లయితొలగించండి
  11. హరుని దలచిన తొలఁగును యఘములెల్ల
    భక్తజనులకా నామము భవహరమ్ము
    భక్తిహీనుల పెదవుల పైన జేరు
    శివుని నామము నరులకుం జేఁదు సుమ్ము

    భవనాశంకరు శంకరున్ గొలిచినన్ బంధమ్ములే వీఁగునా
    శివుఁడే రక్షగ నిల్చి భక్తులకునున్ శ్రేయంబు జేకూర్చు సం
    స్తవనీయుండగు నీశునిన్ మనసునన్ సంసక్తముం జేయకన్
    శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'తొలగును + అఘములు' అన్నపుడు యడాగమం రాదు. "హరుని దలచిననె తొలగు నఘములెల్ల" అనండి.

      తొలగించండి
  12. భక్త జనులను రక్షించు భవుని మరచి
    శివుని నామము నరులకు చేదు సుమ్ము
    యనుట భావ్యమ్ము గాదందు రార్యు లవని
    తెలిసి మసలు ట మంచిది తెలివి గాను

    రిప్లయితొలగించండి
  13. కోరి నంత నొసంగును మేర లేని
    వరముల గరళ కంఠుండు కరుణ తోడఁ
    బలుక కున్న నెవ్వ రయిన భక్తి సాంబ
    శివుని నామము నరులకుం జేఁదు సుమ్ము


    లవలేశమ్ము నసత్యముం గనము సల్లాపమ్ము లిట్లుండ శ
    త్రువులే కాఁగ సమస్త వైష్ణవులు ముల్లోకమ్ములం దౌర పృ
    థ్వి విశేషమ్ముగ స్వప్న మందు నయినన్ విన్నంత నా రావ ణా
    శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్

    [రావణ + అశివ = రావ ణాశివ]

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    శివుని విష్ణు భక్తులును ద్వేషించుచుందు
    రొక్కరే యిద్దరను మాట నొప్పరెప్పు
    డెవరి మతము వారిదె యను నెగసిపాటు
    శివుని నామము నరులకుం జేదు సుమ్ము!

    రిప్లయితొలగించండి