కం:కుక్క వలె హరిజనుండగు బక్కయ్య చరించె, నేన్ గు పక్షము వాడై ని క్కెంతొ జూపు కొమరుడు కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా” (ఒక హరిజనుడు పాపం కుక్క లాగా వినయం గా బతికాదు.అతని కొదుకు ఏనుగు పార్టీలో అనగా బహుజన సమాజ్ పార్టీలో చేరి నిక్కు పోతున్నాడు.ఆ కుక్కకి ఈ ఏనుగు పుట్టింది అని ఊళ్లో పెత్తందార్లు బాధ పడుతున్నారు. )
పద్మవ్యూహములో పాల్గొన్న కౌరవ సైన్యములో గుసగుసలు....
రిప్లయితొలగించండికందం
ఎక్కడి యభిమన్యుఁడితఁడు!
త్రొక్కెను కరివోలె కదను త్రుంచె శిరములన్!
మ్రొక్కి హరిఁ జెలఁగు నరుఁడన్
గుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా!
ఉత్పలమాల
మ్రక్కిడ సేనలెల్ల నభిమన్యుఁడొకండె మహోధృతమ్ముగన్
ద్రొక్కెఁ గరేణువై కదను త్రుంచె శిరమ్ముల భీకరమ్ముగన్!
మ్రొక్కుచు కృష్ణునిన్ జెలఁగఁ బూనెడు బంటుగ నొప్పు క్రీడియన్
గుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్!
నొక్కిన తెరచుకొను బొమల
రిప్లయితొలగించండిడొక్కల నుండి పతిమలు పడునటుల జేయన్
మక్కువగ నొకటి నదుమగ
కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా
రిప్లయితొలగించండిచక్కని దినగుణముతో
మిక్కిలి కీర్తిని గడింప మేదిని యందున్
పెక్కురనిరి సూతుడనే
కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా.
ఒక్కడు వాడు గాంచగ మహోన్నత దానగుణమ్ముచే గదా
మిక్కిలి పేరుగాంచెనని మెచ్చి నుతించిరి నాడు శిష్టులౌ
పెక్కురులివ్విధిన్ గనగ పేదనిషంగద సూతుడైన యా
కుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్.
అక్కజములెన్నొ కలిలో
రిప్లయితొలగించండిమిక్కుటముగ సంభవించు మేదిని యందున్
చొక్కవరము గ్రామములో
కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా
చక్కని కూనలు నాలుగు
రిప్లయితొలగించండికుక్కకు జన్మించె; నొక్క కుంజర మహహా
టక్కున బంతిని దన్నుచు
మక్కువతో నాడెనచటి మైదానములో
పక్కన నున్న బాలకుడు పల్కెను నాకడ నివ్విధంబునన్
మిక్కిలి చక్కనైనవని మెచ్చెడు ముచ్చటగొల్పు కూనలే
కుక్కకుఁ బుట్టెనంట; యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్
జక్కని నాట్యమాడెనట సందడి గొల్పుచు జంతుశాలలో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య : “కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా”
రిప్లయితొలగించండికం. పిక్కబలమున్న వానికి
జక్కని వీరుండు బుట్ట జనపదమెల్లన్
మక్కువతో కొనియాడెను
కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా
చక్కని రంగులన్ మెరయు జాలము నొక్కటి గీసెనెవ్వడో
రిప్లయితొలగించండినెక్కడలేని వింతగను నింపుగ జూపెను జూడగా నహో!
నక్కజమొందనబ్రముగ నయ్యెడ జూపిన చిత్రమందునన్
కుక్కకు బుట్టెనంట యొక కుంజర మెల్లరు జూడవింతగన్
కం॥ చక్కగ నసత్యముఁ బలుకఁ
రిప్లయితొలగించండిబెక్కులు స్పర్ధఁ గన నొకడు విరియఁగ హసమే
టక్కున నుడివెనఁట నిటులఁ
గుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా
ఉ॥ పెక్కులు స్పర్ధఁ గాంచిరఁట వెంటనె పల్కఁగ నమ్మఁ జాలకన్
మిక్కిలి హస్యమొందు గతి మేటి యసత్యమటంచు మెచ్చఁగన్
టక్కున పల్కెనొక్కడిటు డాంబిక మొప్పెడు రీతి గట్టిగాఁ
గుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతఁగన్
మక్కువ తో సైనికుడై
రిప్లయితొలగించండిపెక్కురు వైరులను జంపి వీరు o డ గు చున్
నిక్కగ వాని న ని రిలను
కుక్కకు జన్మించె నొక్క కుంజర మ హ హా!
లక్కవరంబు నందు నొక రావికి పాలు స్రవించె నెల్లవా
రిప్లయితొలగించండిరక్కజమొంది రన్నవర మందున మావికి పూలు పూయగన్
చొక్కవరంపు గ్రామమున చోద్యముగా నొకరింటి యందునన్
కుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్
అక్కట కన్నది గజమే
రిప్లయితొలగించండికుక్కుట శాబమ్ము కాదు కుమతీ కనుమా
మిక్కుటపు టాస నొడిలోఁ
గుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా
[కుక్కు= దూర్చు]
చిక్కెను రాక్ష సాధముఁడు శ్రీపతి మాయఁ బరోక్ష భంగినిం
జక్కని విష్ణు భక్తునకు జన్మ నొసంగె హిరణ్య భోజనుం
డొక్కఁడు పద్మనాభునకు నుగ్ర విరోధి నిరంతరమ్మునుం
గుక్కకుఁ బుట్టె నంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
చక్కని కూనలు నాలుగు
కుక్కకు జన్మించె; నొక్క కుంజర మహహా
తిక్కగ వర్తించి తిరిగి
త్రొక్కుచు నాశనము చేసె తోటలనెల్లన్
కం:కుక్క వలె హరిజనుండగు
రిప్లయితొలగించండిబక్కయ్య చరించె, నేన్ గు పక్షము వాడై
ని క్కెంతొ జూపు కొమరుడు
కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా”
(ఒక హరిజనుడు పాపం కుక్క లాగా వినయం గా బతికాదు.అతని కొదుకు ఏనుగు పార్టీలో అనగా బహుజన సమాజ్ పార్టీలో చేరి నిక్కు పోతున్నాడు.ఆ కుక్కకి ఈ ఏనుగు పుట్టింది అని ఊళ్లో పెత్తందార్లు బాధ పడుతున్నారు. )
ఉ:కుక్కను వోలె నేల పయి గూర్చొను బక్కయ, యెంతగా నహం
రిప్లయితొలగించండిబెక్కెను వాని పుత్రునకు! నేనుగు పక్షము నందు జేరి వా
డెక్కెను గద్దె, నింక మన నింతయు నాతడు లెక్క జేయునే
కుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్
వెక్కుచు నుండు సంతతము పెద్దలు దూఱగ కార్యశాలలో
రిప్లయితొలగించండిపెక్కురు గేలిచేయగ వివేక విహీన యటంచు నిత్యమున్
మిన్నగ విద్యలో వెలుగ మేవడి బుత్రిక, పల్కి లెల్లరున్
కుక్కకు బుట్టె నంట యొక కుంజర మేల్లరు జూడ వింతగన్