8, ఫిబ్రవరి 2026, ఆదివారం

సమస్య - 5376

9-2-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతి యడలఁగ నన్యోన్యదాంపత్య మగును”
(లేదా...)
“ఆలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ”

12 కామెంట్‌లు:

  1. కాంత సంతసించు దనను గాంచినంత
    పతి యడలఁగ ; నన్యోన్యదాంపత్య మగును
    భర్త యెల్లవేళల దన భార్యయనిన
    జంకు చుండినట్లు నటన సలుప జాలు

    రిప్లయితొలగించండి
  2. సతి పతికినర్థ భాగమై సతతముండ
    సతి కుతిలపాటు గణుతింపఁ బతిది కాదె
    పతివతీ ప్రసవంబున బాధఁ గాంచి
    పతి యడలఁగ నన్యోన్యదాంపత్య మగును

    నాలోనీవగు నర్ధభాగమని తానర్ధాంగితోఁ బల్కి తా
    నేలోకంబుఁ నపూర్వమై నిలిచి ప్రాణేశాగ్రభాగంబునన్
    గాలాతీతపు కాన్పులోన వధువాక్రందించు వైళంబునా
    యాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ

    రిప్లయితొలగించండి

  3. భార్య యన తనలో సగ భాగ మంచు
    దలచి చరియించ నేమిరా తమ్మికంటి
    వలదను పని చేయ వలసి వచ్చిన తరి
    పతి యడల నన్యోన్యదాంపత్య మగును.


    స్త్రీలే మూలము ధాత్రి కంచు సతి వ్యక్తిత్వమ్ము మన్నించు చున్
    పాలాకుండ్రులు వారు కాదనుచు సంభావించెడిన్ వారలే
    చాలింకన్ వలదన్న కార్యము నటన్ సంపూర్తిగా చేయ నా
    యాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ.

    రిప్లయితొలగించండి
  4. తే.గీ:అంద మగు కాంత యింటికి నరుగు దెంచ
    "నామె బాగున్న" దను భావ మంద నీక
    తలను ద్రిప్పుక సిగ్గుల నొలక బోసి
    పతి యడలఁగ నన్యోన్యదాంపత్య మగును”
    (భార్య ప్రక్కన ఉండగా మరొక అందగత్తె కనిపిస్తే బాగున్న దనే ఫీలింగ్ కనపడకుండా సిగ్గు, భయము నటిస్తే భార్య మెచ్చుకుంటుంది.)

    రిప్లయితొలగించండి
  5. 2)శా:ఆలిన్ మెచ్చుచు, నామె యెవ్వరెడ నీర్ష్యన్ బొందునో యట్టి యి
    ల్లాలిన్ మెచ్చక, యన్య కాంత తనకే యడ్డమ్ముగా రాగ దా
    శీల మ్మెంతొ వహించి దారి నిడి, యా స్త్రీ వంకనే చూచు ని
    ల్లాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ”

    రిప్లయితొలగించండి
  6. సతికి నచ్చని పనులే వి సల్ప కుండ
    దుష్ట సహవాస ముల కెల్ల దూర ముండి
    మాట జవదాట కుండ దా మసలి సతికి
    పతి యడ లగ నన్యోన్య దాంపత్య మగును

    రిప్లయితొలగించండి
  7. కాలంబందున మార్పువచ్చె, కనగా కాంతామణుల్ పృథ్వి ను
    ద్వేలమ్మైన ధనంపు శక్తి గొని యుద్దీపించుచున్ నిల్చి హే
    రాళమ్మైన మదమ్ము జూప, నిశి స్వర్గమ్మున్ గొనన్ దల్చుచున్
    ఆలింగాంచిన భర్త భీతిలుటయే యన్యోన్య దాంపత్యమౌ

    రిప్లయితొలగించండి
  8. ఎన్నఁ డేని వీక్షించిన నిర్వురు నిల
    నొక్క విషయమ్ము నారసి వెక్కసముగ
    సంతసించిన నవ్విధి సతియు నింకఁ
    బతి యడలఁగ నన్యోన్య దాంపత్య మగును


    ఆ లీలన్ సతి కూడ భీతిలిన నయ్యావేళలం దాత్మలో
    లీలా లోల విలాస వేళలను నుల్లేఖమ్ము లందైన హా
    స్యాలాపమ్ముల నైన నేమి నిజ భార్యా వక్త్ర సంతప్త భా
    వాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్య దాంపత్యమౌ

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    మమత చూపించి జీవితమర్మమెఱిఁగి
    నిత్య షట్కర్మల మనము నిల్పుసతియె
    పతిని దూషించు వారల నుతుకనెంచఁ
    బతి యడలఁగ! నన్యోన్యదాంపత్య మగును!

    శార్దూలవిక్రీడితము
    పాలింపన్ బతిదేవునిన్ సతము సేవాభావనన్ జూచు స
    చ్ఛీలాంభోనిధిఁ బోలెడున్ వధువదే శ్రేయంబుగన్ బొందుచున్
    గేలిన్జేయఁగ జూడ నన్యులు పతిన్ గింకన్ సతాయించు న
    య్యాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ!

    రిప్లయితొలగించండి

  10. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    తప్పులను చేసి తన పతి దారి తప్ప
    సక్రమమగు మార్గమునందు చక్కబెట్ట
    పతిపయి నటించి సతియు దుర్భాషలాడ
    పతి యడలగ నన్యోన్య దాంపత్య మగును.

    రిప్లయితొలగించండి