కం:తలచక తమ స్వార్థమ్ముల, బలముల ధర్మజుని పైని భక్తి విడక యే పలు కష్టమ్ముల సైచిరి నలువురు పాండవు లటన్న నమ్మిరి జనులే” (ధర్మ రాజు పై భక్తిని నలుగురు పాండవులు వదలక కష్తాలు పడ్డా రంటే జనులు నమ్మారు. )
చం:నలువురు హేతువాదులు ఘనమ్ముగ వేదిక నిల్చి "తెల్పుడీ తలచగ పాపు లెవ్వ?" రన ధార్మికు లెల్లరు "ధార్తరాష్ట్రులే తెలిసిన మాట యిద్ది" యన,దీటుగ దర్కము జేసి జేసి యా నలువురె పంచపాండవు లనన్ జనులెల్లరు నమ్మినారు పో” (హేతువాదులు కౌరవ పాండవులలో ఎవరు పాపులు? అని అడిగితే సంప్రదాయవాదులు కౌరవులు పాపులు అన్నారు.కానీ ఆ నలుగురు పంచపాండవులే పాపులు అని తర్కం చేస్తే జనం ఆ నలుగురినే నమ్మారు. )
చం:సులువుగనే సమస్య నిడె సూరి వధానికి నిట్లు బ్రేమతో "నలువురె పంచపాండవులనన్ జను లెల్లరు నవ్వినారు పో" తలచుచు నొక్క యక్షరము తప్పుగ నిట్లు వధాని చింతిలెన్ నలువురె పంచపాండవు లనన్ జనులెల్లరు నమ్మినారు పో” (అవధాని మీద సానుభూతి తో పండితుడు ఇచ్చిన సమస్య లో నవ్వినారు పో అనే ఇచ్చాడు.అది చాలా తేలిక సమస్య.కానీ ఈ పిచ్చి అవధాని గారు సరిగా వినక " నమ్మినారు పో " అని తీసుకొని క్లిష్టం చేసుకొని అవస్థ పడ్డాడు. )
ఇలలో తెలియుదు రందరు
రిప్లయితొలగించండినల పాండవులనగ నెపుడు నైదుగురె కదా!
తలపోయ నెటుల ధర్మము?
నలువురు పాండవులటన్న నమ్మిరిజనులే?!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండితొలి సుతుడవన్న కుంతికిఁ
గలతను తొలగింప వరము కర్ణుఁడొసంగన్
నులుమునని నరుని మిగిలిన
నలువురు పాండవు లటన్న నమ్మిరి జనులే?
చంపకమాల
తొలిసుతుఁడీవనన్ జనని తోషమునింపగ కుంతిమాతకున్
గలతను బాపెడున్ వరము కర్ణుడొసంగ నధర్మపక్షమై
బలమును గల్గినన్ నరుని వంకన గృష్ణుని జూచి, యెక్కడన్
నలువురె పంచపాండవు లనన్ జనులెల్లరు నమ్మినారు పో?
కలహము నందున పాల్గొని
రిప్లయితొలగించండితలపడు వీరులెవరనిన ధర్మేంద్రుడు ను
జ్వలమైన వాని సహజులు
నలువురు పాండవు లటన్న నమ్మిరి జనులే
పలువురి యంతరంగముల వచ్చిన సంశయ మిద్ది శీఘ్రమే
కలహము తప్పకున్నయెడ కౌరవ సేననెదిర్చి గట్టిగా
తలపడు వీరులెవ్వరన ధర్మజుడున్ మరి వాని సోదరుల్
నలువురె పంచపాండవు లనన్ జనులెల్లరు నమ్మినారు పో
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఇల ధర్మము తప్పని వా
రలెవరని యడిగిన యట్టి రమణికి వడిగన్
తెలిపిరి యటగల విజ్ఞులు
నలువురు పాండవు లటన్న , నమ్మిరి జనులే.
అలుగుటయే యెఱుంగని మహామహితాత్ముడు ధర్మజుండు, తా
బలికిన చాలు భూరి గరవమ్మును జూపు విధేయులైన త
మ్ములు కడు శక్తివంతులె యపూర్వ సహోదరు లైన వారలా
నలువురె, పంచపాండవు లనన్ జనులెల్లరు నమ్మినారు పో.
పలుసందర్భము లందున
రిప్లయితొలగించండిఫలితమునకు జంకకుండ ; భ్రాత నుడువునా
పలుకుల నొనర్చె మిగిలిన
నలువురు పాండవు లటన్న నమ్మిరి జనులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిలుకాడర్జునుడు, నమిత
రిప్లయితొలగించండిబలవంతుడు వాతసుతుడు, ప్రాజ్ఞులు మాద్రే
యులు, ధర్మజు సోదరులా
నలువురు, పాండవు లటన్న నమ్మిరి జనులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిలువిద్యా పారంగతు
రిప్లయితొలగించండిలిలలో పాండవులు వారలెల్లరియందున్
విలుఁబట్టని గుణుడు వినా
నలువురు పాండవు లటన్న నమ్మిరి జనులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:తలచక తమ స్వార్థమ్ముల,
రిప్లయితొలగించండిబలముల ధర్మజుని పైని భక్తి విడక యే
పలు కష్టమ్ముల సైచిరి
నలువురు పాండవు లటన్న నమ్మిరి జనులే”
(ధర్మ రాజు పై భక్తిని నలుగురు పాండవులు వదలక కష్తాలు పడ్డా రంటే జనులు నమ్మారు. )
(అరణ్యవాసములో చాలా కాలము అర్జునుడు పాశుపతము మొదలైనవి కూర్చుకొనుటకు వెడలగ మిగిలినది నలుగరని అండి)
రిప్లయితొలగించండికం॥ అలుగులఁ బొందఁగఁ బార్థుఁడు
తొలఁగుచు నితరుల విడువఁగ దూరము చనఁగన్
దెలుపఁగ నచ్చట మిగిలిరి
నలువురు పాండవు లటన్న నమ్మిరి జనులే!
చం॥ అలుగులఁ బొంద నర్జునుఁడు నత్తఱి వీడుచు నెల్ల వారలన్
దొలఁగ నరణ్యవాసమున దూరము ధర్మజుఁడాదిగా నటన్
గలవర మొందకుండఁ దమ కార్యము లెన్నుచు నుండి పోయిరే
నలువురె పంచ పాండవులనన్ జనులెల్లరు నమ్మినారు పో
చం:నలువురు హేతువాదులు ఘనమ్ముగ వేదిక నిల్చి "తెల్పుడీ
రిప్లయితొలగించండితలచగ పాపు లెవ్వ?" రన ధార్మికు లెల్లరు "ధార్తరాష్ట్రులే
తెలిసిన మాట యిద్ది" యన,దీటుగ దర్కము జేసి జేసి యా
నలువురె పంచపాండవు లనన్ జనులెల్లరు నమ్మినారు పో”
(హేతువాదులు కౌరవ పాండవులలో ఎవరు పాపులు? అని అడిగితే సంప్రదాయవాదులు కౌరవులు పాపులు అన్నారు.కానీ ఆ నలుగురు పంచపాండవులే పాపులు అని తర్కం చేస్తే జనం ఆ నలుగురినే నమ్మారు. )
కల రెందరనుచు నడు గ గ
రిప్లయితొలగించండిపలికె నొక o డి టుల తాను పాండవు లందు న్
తొలి ధర్మ జుండు మినహా
నలుగురు పాండవు లట న్న నమ్మిరి జనులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం:సులువుగనే సమస్య నిడె సూరి వధానికి నిట్లు బ్రేమతో
రిప్లయితొలగించండి"నలువురె పంచపాండవులనన్ జను లెల్లరు నవ్వినారు పో"
తలచుచు నొక్క యక్షరము తప్పుగ నిట్లు వధాని చింతిలెన్
నలువురె పంచపాండవు లనన్ జనులెల్లరు నమ్మినారు పో”
(అవధాని మీద సానుభూతి తో పండితుడు ఇచ్చిన సమస్య లో నవ్వినారు పో అనే ఇచ్చాడు.అది చాలా తేలిక సమస్య.కానీ ఈ పిచ్చి అవధాని గారు సరిగా వినక " నమ్మినారు పో " అని తీసుకొని క్లిష్టం చేసుకొని అవస్థ పడ్డాడు. )
తెలియకయే సత్యము య
రిప్లయితొలగించండిగ్గలముగ నిద్రింప నగ్ని కాలిరి యకటా
సలసల యెల్లరు, పలుకిరి
నలువురు, పాండవు లటన్న నమ్మిరి జనులే
[అటు + అన్న= అటన్న, ఆ ప్రకార మన్న]
కలుగ నుదర్చ్యనుగ్రహము కయ్యము నందు జయమ్ము సాధ్య మ
న్యుల నెదిరింప నేఁగఁగ ధనుర్ధరుఁ డర్జునుఁ డుత్సహించుచుం
దొలఁగక నిల్వ సైంధవుఁడు దుర్జయుఁడై యనిఁ జేరి రత్తఱిన్
నలువురె పంచ, పాండవు లనన్ జను లెల్లరు నమ్మినారు పో
[పంచ = సమీపము]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పలువురి యిడుములఁ దీర్చ వె
డలగ బకాసురుని భీముడంతము చేయన్
నిలిచిరి మిగిలిన వారలు
నలువురు పాండవు లటన్న నమ్మిరి జనులే!