19-2-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శబరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును”(లేదా...)“శబరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాతబాణమున్”
తండ్రి మాట నిలుపుటకై తల్కమునకు జేర , నచట నొక సివంగి చేతబడిన శబరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమునుజంతువు పయికి, దానిని జంపగోరి
తేటగీతిమౌనియజ్ఞమ్ము గావఁగన్ పూని విధినినసుర కాంతయనెడు శంక యంతరింపతాటకన్ యజ్ఞవేదిపై దాటెడు వివశ బరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమునుచంపకమాలప్రబలుచు యజ్ఞవాటికను రాక్షసమూకలు విజ్ఞమెంచఁగన్విబుధ మునీశ్వరుండు సభ వేడగ రక్షకు రామలక్ష్మణుల్కబలిత తాటకన్ దునుమ గాంచియు వీడఁగ శంకయున్ నివేశ బరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాతబాణమున్
రామభద్రుడు సీతతో రహిని గూడివిపినమందున జేయుచు విహరణమ్ముభోలమొక్కటి కబళింప బోవునంతశబరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును
రాక్షసుల బాధ భరియింప రాక మునులురామ చంద్రుని వేడిరి రక్షణమ్ముసచ్చరితు నెదిరింపగ వచ్చె దుర్దశ బరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమునుప్రబలిన రాక్షసాధములు బాధలు వెట్ట భరింపజాలకా తబిసి సమాశ్రయమ్మడుగ తానట కేగెను రామచంద్రుడేప్రబలుడు రామునిన్ గనిన రక్కసి దద్దఱి చెందగా నిరాశ బరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాతబాణమున్
విభవముఁ బాసి రాఘవుఁడు భీరుకమందున సంచరించుచున్శబరుల స్థావరంబునకు సాగెను గాంచక జానకీ సతిన్ప్రబలఁపు భీలమంతటను పైబడిదూకి వధించ బోవగాశబరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాతబాణమున్(శబరి=బోయజాతి స్త్రీ)
చం॥ అబలయు వృద్ధురాలు నటులాదర మొప్పఁగ రామ చంద్రునిన్ బ్రబల ముదావహమ్ముఁ గని భక్తినిఁ గొల్చునటంచుఁ దెల్పఁగన్సబల విరాజమానవిధి సన్నతి పాదము చెంతఁ జేరఁగన్శబరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాతబాణమున్సన్నతి నమస్కారము. పాదము వద్ద చేరేట్టుగా నమస్కార బాణము వేసినాడని అండి
భక్తి పూర్వ క ము గ దాను పండు కొరికి యివ్వ రాముడు దిని యె తా ని చ్ఛ తోడ శబరి గాంచి :: రాముడు వే సె సాయ కమును చంప నసురుని యుగ్రు డై సత్వ రముగ
రాఘవునిఁ గన్ను లార నరయఁ దలంచి పెక్కు దినములు ముదుసలి వేచి నట్టి కష్ట ముపశమింపఁ గరుణా దృష్టి నంత శబరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును అబలను గూడి దాశరథి సానుజుఁ డుండఁగ దండకా వనిన్ గుబు లొక యింత లేక మదిఁ గోపము గర్వము పిక్కటిల్ల మూరఁ బగయె తన్ను మార్కొనఁగ రాఁగ వెసం దన కంత దక్షి ణాశ బరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాత బాణమున్ [బరి = శత్రువు]
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.తనదు రాకకై చూచుచు తపనచెందిభక్తి తోడను మ్రొక్కగ ముక్తి నొసగెశబరి గాంచి రాముడు; వేసె సాయకమునుపసిడి లేడిపై, కోరగ పడతి సీత.
తండ్రి మాట నిలుపుటకై తల్కమునకు
రిప్లయితొలగించండిజేర , నచట నొక సివంగి చేతబడిన
శబరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును
జంతువు పయికి, దానిని జంపగోరి
తేటగీతి
రిప్లయితొలగించండిమౌనియజ్ఞమ్ము గావఁగన్ పూని విధిని
నసుర కాంతయనెడు శంక యంతరింప
తాటకన్ యజ్ఞవేదిపై దాటెడు వివ
శ బరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును
చంపకమాల
ప్రబలుచు యజ్ఞవాటికను రాక్షసమూకలు విజ్ఞమెంచఁగన్
విబుధ మునీశ్వరుండు సభ వేడగ రక్షకు రామలక్ష్మణుల్
కబలిత తాటకన్ దునుమ గాంచియు వీడఁగ శంకయున్ నివే
శ బరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాతబాణమున్
రామభద్రుడు సీతతో రహిని గూడి
రిప్లయితొలగించండివిపినమందున జేయుచు విహరణమ్ము
భోలమొక్కటి కబళింప బోవునంత
శబరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును
రాక్షసుల బాధ భరియింప రాక మునులు
రిప్లయితొలగించండిరామ చంద్రుని వేడిరి రక్షణమ్ము
సచ్చరితు నెదిరింపగ వచ్చె దుర్ద
శ బరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును
ప్రబలిన రాక్షసాధములు బాధలు వెట్ట భరింపజాలకా
తబిసి సమాశ్రయమ్మడుగ తానట కేగెను రామచంద్రుడే
ప్రబలుడు రామునిన్ గనిన రక్కసి దద్దఱి చెందగా నిరా
శ బరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాతబాణమున్
విభవముఁ బాసి రాఘవుఁడు భీరుకమందున సంచరించుచున్
రిప్లయితొలగించండిశబరుల స్థావరంబునకు సాగెను గాంచక జానకీ సతిన్
ప్రబలఁపు భీలమంతటను పైబడిదూకి వధించ బోవగా
శబరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాతబాణమున్
(శబరి=బోయజాతి స్త్రీ)
చం॥ అబలయు వృద్ధురాలు నటులాదర మొప్పఁగ రామ చంద్రునిన్
రిప్లయితొలగించండిబ్రబల ముదావహమ్ముఁ గని భక్తినిఁ గొల్చునటంచుఁ దెల్పఁగన్
సబల విరాజమానవిధి సన్నతి పాదము చెంతఁ జేరఁగన్
శబరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాతబాణమున్
సన్నతి నమస్కారము. పాదము వద్ద చేరేట్టుగా నమస్కార బాణము వేసినాడని అండి
భక్తి పూర్వ క ము గ దాను పండు కొరికి
రిప్లయితొలగించండియివ్వ రాముడు దిని యె తా ని చ్ఛ తోడ
శబరి గాంచి :: రాముడు వే సె సాయ కమును
చంప నసురుని యుగ్రు డై సత్వ రముగ
రాఘవునిఁ గన్ను లార నరయఁ దలంచి
రిప్లయితొలగించండిపెక్కు దినములు ముదుసలి వేచి నట్టి
కష్ట ముపశమింపఁ గరుణా దృష్టి నంత
శబరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును
అబలను గూడి దాశరథి సానుజుఁ డుండఁగ దండకా వనిన్
గుబు లొక యింత లేక మదిఁ గోపము గర్వము పిక్కటిల్ల మూ
రఁ బగయె తన్ను మార్కొనఁగ రాఁగ వెసం దన కంత దక్షి ణా
శ బరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాత బాణమున్
[బరి = శత్రువు]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తనదు రాకకై చూచుచు తపనచెంది
భక్తి తోడను మ్రొక్కగ ముక్తి నొసగె
శబరి గాంచి రాముడు; వేసె సాయకమును
పసిడి లేడిపై, కోరగ పడతి సీత.