20-2-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కవి గాకున్నను మధురముగా రచియించెన్”(లేదా...)“కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్”
కందం:కవి కాడతండు నిరతముకవిసాంగత్యమున మెలఁగు కారణముననేకవిహృదయము నెరుక గలిగికవి గాకున్నను మధురముగా రచియించెన్
మత్తేభము:కవితల్ వ్రాయఁగలేని పామరుఁడు నిష్కామంబుగా నిత్యమున్కవిసాంగత్యమునన్ జరించు కతనన్ గల్గన్ కవిత్వంబునందు విశిష్ఠంబగు నిచ్ఛయున్ మరియు సద్యోజాతమౌ ప్రజ్ఞయున్కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్
ధవళాంగియె కరుణింపగనవిరళ కృషితో నతండు నద్భుతమగు పాటవమును జూపి పురాతనకవి గాకున్నను మధురముగా రచియించెన్.(మరొకటి)దవమున బడితిరుగాడు మృగవధా జీవుడు కన నొక కావ్యము నతడాదివమునె రామాయణమును కవి గాకున్నను మధురముగా రచియించెన్. భువిలో గాంచగ మేటికావ్యమనుచున్ బూజించెడిన్ గ్రంథమున్ దవమందున్ దిరుగాడు వేటకరియే దావంతమున్ జెందుచున్ హవణించెన్ గద రామగాథయని నిధ్యానింప వాల్మీకియే కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్.
అవిరళమైన పురాణపు కవనము లందించి కీర్తి గాంచు విధముగన్ చవినిడు టందున ఘనుడగు కవి గాకున్నను మధురముగా రచియించెన్”
అవిగళమౌ దర్పముతోస్తవనీయపు శిల్పరచన సల్పెడివారల్భువిపై పలువురు జక్కనకవి గాకున్నను మధురముగా రచియించెన్భువిపై పెక్కురు కానవత్తురు గదా పొంగారగా దర్పమేకవులైనన్ మరికాకపోయినఁ సదా కావింతురే యత్నముల్స్తవ నీయంబగు గొప్ప శిల్పరచనన్ జక్కన్న చేబూనెగాకవి గాకున్నను లోకమాన్య రచనా కార్యోన్ముఖుం డయ్యెడున్
కందంఅవగుణ సంయుతుఁడై యనుభవసారమ్ము వడపోసి పద్యములల్లెన్చివరన వేమన, గతమునకవి గాకున్నను మధురముగా రచియించెన్మత్తేభవిక్రీడితమునవలావణ్యము పంచి విశ్వద తుదిన్ జ్ఞానాంబుధిన్ దేల్చఁగన్వివరంబున్ గని నీతి నాటవెలదుల్ విందార నందింపఁగన్స్తవనీయమ్ముగ యోగివేమన ప్రశస్తంబై ప్రబోధింపగన్కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్
నవనీతము తేనియవలె ౘవులూరెడు పద్యమల్లు చతురుండౌ తానవధానము చేయగలుగుకవి గాకున్నను మధురముగా రచియించెన్
(చదివి తెలుసుకున్న దానికంటే పరిశీలనతో మనుజ తత్వము తెలుసుకంటే అదే ఉపయుక్తమండి)కం॥ చవితో మానవ వర్తన వివరముగఁ గనుచు ముదముగ వివరించంగన్ భువిని జనులు విహితమరయఁగవి గాకున్నను మధురముగా రచియించెన్మ॥చవితో మానవ వర్తనా సరళి యిష్టాయిష్ట సంక్లిష్టముల్భవితన్ దీర్చు విధమ్ముఁ గాంచి యటు సద్భాగ్యమ్ము దుర్భాగ్య మొందు వివేకమ్ము గ్రహించి తేటపఱచన్ స్థూలమ్ముగా మోదమైకవి గాకున్నను లోకమాన్య రచనాకార్యోన్ముఖుండయ్యెన్
కవనము లల్లుట నేర్చియు చవి గా పద్యముల నల్లు చాతుర్య ముతో నవతకు నాందీ ప ల్కు చు కవి గా కున్న ను మధురము గా రచియిo చె న్
కవనం బవసర ముండకవివరణ మిసుమంత యే నవిచ్ఛిన్నముగా సువిదిత దోష తురంగమ కవి గా కున్నను మధురముగా రచియించెన్ [కవి = కళ్లెము] భువిలో నెందఱు లేరు సత్కవులు సంపూ ర్ణాఖిల జ్ఞానులై సువివే కాత్ములునై చరించుచును నస్తోకప్రభా యుక్తులై ఛవిమత్కావ్య దురంధరుండు లస దంచన్నన్న యా ద్యాభ తత్కవి గా కున్నను లోక మాన్య రచనా కార్యోన్ముఖుం డయ్యెడున్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కవితలను వ్రాయుచుండునుస్తవనీయపు తీరులోన తరుణులపైనన్అవి చదివిన వారలనిరికవి గాకున్నను మధురముగా రచియించెన్.
(3)కం: కవనములకు యత్నించగనవి తనకున్ బట్టు పడక యాశగ నతడీ నవలలు వ్రాయ దొడంగెనుకవి గాకున్నను మధురముగా రచియించెన్(మథురం గా వ్రాయటానికి కవిత్వమే అవసరం కాదు.నవలలు కూదా వ్రాయ వచ్చు కదా!)
కందం:పవడపు కుంచెను దిప్పుచుయువతుల కనుగవ బయలిడె యువభావుకుడేరవణిల్లు చూడ్కులవి జింకవి గాకున్నను మధురముగా రచియించెన్
కందం:
రిప్లయితొలగించండికవి కాడతండు నిరతము
కవిసాంగత్యమున మెలఁగు కారణముననే
కవిహృదయము నెరుక గలిగి
కవి గాకున్నను మధురముగా రచియించెన్
మత్తేభము:
రిప్లయితొలగించండికవితల్ వ్రాయఁగలేని పామరుఁడు నిష్కామంబుగా నిత్యమున్
కవిసాంగత్యమునన్ జరించు కతనన్ గల్గన్ కవిత్వంబునం
దు విశిష్ఠంబగు నిచ్ఛయున్ మరియు సద్యోజాతమౌ ప్రజ్ఞయున్
కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్
రిప్లయితొలగించండిధవళాంగియె కరుణింపగ
నవిరళ కృషితో నతండు నద్భుతమగు పా
టవమును జూపి పురాతన
కవి గాకున్నను మధురముగా రచియించెన్.
(మరొకటి)
దవమున బడితిరుగాడు మృ
గవధా జీవుడు కన నొక కావ్యము నతడా
దివమునె రామాయణమును
కవి గాకున్నను మధురముగా రచియించెన్.
భువిలో గాంచగ మేటికావ్యమనుచున్ బూజించెడిన్ గ్రంథమున్
దవమందున్ దిరుగాడు వేటకరియే దావంతమున్ జెందుచున్
హవణించెన్ గద రామగాథయని నిధ్యానింప వాల్మీకియే
కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్.
అవిరళమైన పురాణపు
రిప్లయితొలగించండికవనము లందించి కీర్తి గాంచు విధముగన్
చవినిడు టందున ఘనుడగు
కవి గాకున్నను మధురముగా రచియించెన్”
అవిగళమౌ దర్పముతో
రిప్లయితొలగించండిస్తవనీయపు శిల్పరచన సల్పెడివారల్
భువిపై పలువురు జక్కన
కవి గాకున్నను మధురముగా రచియించెన్
భువిపై పెక్కురు కానవత్తురు గదా పొంగారగా దర్పమే
కవులైనన్ మరికాకపోయినఁ సదా కావింతురే యత్నముల్
స్తవ నీయంబగు గొప్ప శిల్పరచనన్ జక్కన్న చేబూనెగా
కవి గాకున్నను లోకమాన్య రచనా కార్యోన్ముఖుం డయ్యెడున్
కందం
రిప్లయితొలగించండిఅవగుణ సంయుతుఁడై యను
భవసారమ్ము వడపోసి పద్యములల్లెన్
చివరన వేమన, గతమున
కవి గాకున్నను మధురముగా రచియించెన్
మత్తేభవిక్రీడితము
నవలావణ్యము పంచి విశ్వద తుదిన్ జ్ఞానాంబుధిన్ దేల్చఁగన్
వివరంబున్ గని నీతి నాటవెలదుల్ విందార నందింపఁగన్
స్తవనీయమ్ముగ యోగివేమన ప్రశస్తంబై ప్రబోధింపగన్
కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్
నవనీతము తేనియవలె
రిప్లయితొలగించండిౘవులూరెడు పద్యమల్లు చతురుండౌ తా
నవధానము చేయగలుగు
కవి గాకున్నను మధురముగా రచియించెన్
(చదివి తెలుసుకున్న దానికంటే పరిశీలనతో మనుజ తత్వము తెలుసుకంటే అదే ఉపయుక్తమండి)
రిప్లయితొలగించండికం॥ చవితో మానవ వర్తన
వివరముగఁ గనుచు ముదముగ వివరించంగన్
భువిని జనులు విహితమరయఁ
గవి గాకున్నను మధురముగా రచియించెన్
మ॥చవితో మానవ వర్తనా సరళి యిష్టాయిష్ట సంక్లిష్టముల్
భవితన్ దీర్చు విధమ్ముఁ గాంచి యటు సద్భాగ్యమ్ము దుర్భాగ్య మొం
దు వివేకమ్ము గ్రహించి తేటపఱచన్ స్థూలమ్ముగా మోదమై
కవి గాకున్నను లోకమాన్య రచనాకార్యోన్ముఖుండయ్యెన్
కవనము లల్లుట నేర్చియు
రిప్లయితొలగించండిచవి గా పద్యముల నల్లు చాతుర్య ముతో
నవతకు నాందీ ప ల్కు చు
కవి గా కున్న ను మధురము గా రచియిo చె న్
కవనం బవసర ముండక
రిప్లయితొలగించండివివరణ మిసుమంత యే నవిచ్ఛిన్నముగా
సువిదిత దోష తురంగమ
కవి గా కున్నను మధురముగా రచియించెన్
[కవి = కళ్లెము]
భువిలో నెందఱు లేరు సత్కవులు సంపూ ర్ణాఖిల జ్ఞానులై
సువివే కాత్ములునై చరించుచును నస్తోకప్రభా యుక్తులై
ఛవిమత్కావ్య దురంధరుండు లస దంచన్నన్న యా ద్యాభ త
త్కవి గా కున్నను లోక మాన్య రచనా కార్యోన్ముఖుం డయ్యెడున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కవితలను వ్రాయుచుండును
స్తవనీయపు తీరులోన తరుణులపైనన్
అవి చదివిన వారలనిరి
కవి గాకున్నను మధురముగా రచియించెన్.
(3)కం: కవనములకు యత్నించగ
రిప్లయితొలగించండినవి తనకున్ బట్టు పడక యాశగ నతడీ
నవలలు వ్రాయ దొడంగెను
కవి గాకున్నను మధురముగా రచియించెన్
(మథురం గా వ్రాయటానికి కవిత్వమే అవసరం కాదు.నవలలు కూదా వ్రాయ వచ్చు కదా!)
కందం:
రిప్లయితొలగించండిపవడపు కుంచెను దిప్పుచు
యువతుల కనుగవ బయలిడె యువభావుకుడే
రవణిల్లు చూడ్కులవి జిం
కవి గాకున్నను మధురముగా రచియించెన్