21, ఫిబ్రవరి 2026, శనివారం

సమస్య - 5388

22-2-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్”
(లేదా...)
“చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పఙ్తికంఠుఁడౌ”

11 కామెంట్‌లు:

  1. ఆ రాజపుత్రి సీతా
    చోరుడ యిన లంకఱేడు సుగుణుడగుటచే
    నా రమణిననుభవించెడి
    నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    చేరియు విభీషణాఖ్యుఁడు
    శ్రీరాముని బ్రతికె, 'కుండచెవుల ననుజుఁడున్
    దీరెరిగియు నొప్పింపగ' ,
    నేరము దశముఖుఁడు సేయ, 'నేరక మడిసెన్'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      వ్రాయుదురెవ్వరైన తమ భావన స్ఫూర్తిగ పక్షపాతమై
      దాయక భక్తి భావనలు తారక రాముని దైవమంచనన్
      బాయక భారతీయులిల, బాధను మ్రింగిన లంక దృష్టిలో
      "చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పఙ్తికంఠుఁడౌ"

      తొలగించండి

  3. కోరికచే బంధించిన
    నోరిమి జూపించి గడువు నొసగెను గాదే
    భీరువు స్పర్షించు టనెడి
    నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్.


    తోయలి పైన మోహమది తొందర పెట్టగ పట్టి తెచ్చి దై
    తేయుడు వాంఛ దీర్చమని తీక్ష్ణత నించుక చూపకుండ నా
    ప్యాయత తోడ వేచెదనటంచు వచించెను కాదె కాంచగన్
    చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పఙ్తికంఠుఁడౌ.

    రిప్లయితొలగించండి
  4. కోరిక జయింప లేక ప్ర
    తారముతో నపహరించి తానా కుజపై
    గౌరవ భంగంబనియెడి
    నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్

    తోయజనేత్రుడా బలినిఁ ద్రొక్కెనధోభువనమ్ము నాతడే
    చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు; పఙ్తికంఠుఁడౌ
    మాయల మాటునన్ కుజను మార్గణుడై గిలుబాడి నాడనన్
    హేయపు కార్యభూషణుడు హీనగుణాత్ముడు రావణుండనన్

    రిప్లయితొలగించండి
  5. కం:కౌరవులు ద్రౌపదీ సతి
    చీర పయిన జేయి వేసి చెంద మరణముల్
    దూరము గ నుండి సీతకు
    నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్”
    (కౌరవులు కనీసం ద్రౌపది చీర మీద చెయ్యి వేసి యుద్ధం లో చచ్చారు. కానీ రావణుడు అలా కూడా ముట్టుకోకుండానే చచ్చాడు. )

    రిప్లయితొలగించండి
  6. ఉ:చేయగ సాగె నొక్కడు విచిత్రపు తర్కము నిట్లు" సీత పై
    చేయియు వేయ లేదు కద!చెల్లెలి పై తన జాలి జూపి యే
    చేయ బ్రతిక్రియన్ తరుణి సీతను దెచ్చెను,మానభంగమే
    చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పఙ్తికంఠుఁడౌ”
    (రావణుడు సీతని ఊరికే తెచ్చాడా? తన చెల్లెలికి అవమానం జరిగితే ప్రతీకారానికి తెచ్చాడు. ఐనా అతనేమన్నా ఆమెని మానభంగం చేసాడా? అని ఒకదు వాదించాడు.)

    రిప్లయితొలగించండి
  7. (విభీషణుని రాముని వద్దకు చేరనీయక బంధించి లేక చంపియుంటే కథ వేరుగా ఉండేది అనే భావంతో)

    కం॥ దూరుచు భ్రాత తిరగబడ
    దూరపు టాలోచనఁగని దుగ్ధననుజునున్
    వీరుఁడు కరుణను తునుమెడి
    నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్

    ఉ॥ న్యాయము నెంచి భీతిఁగని నారిని వీడు మటంచుఁ దెల్పుచున్
    సాయము మాని సోదరుఁడు సాగుచు నిందలు వేయుచుండినన్
    దాయముఁ గాంచకుండ దయఁ దల్చుచుఁ దమ్ముని చంపకుండుటే
    చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పంఙ్తికంఠుడౌ

    దాయము విపత్తు

    రిప్లయితొలగించండి
  8. తోరపుఁ బ్రాయశ్చిత్తము
    నా రావణఁ డత్యధిక మదాంధుం డకటా
    కారణము మేము సుంతయు
    నేరము దశముఖుఁడు సేయ నేరక మడిసెన్


    ఆ యనుమయ్యనుం గని కటా కపిఁ జంపుట రాజ నీతి కా
    దే యని సమ్మతించి వెస నించుక తోఁకకు, శిక్ష నన్యమున్
    వేయక యుంట నిప్పు నిడి వెఱ్ఱి తనమ్మున దూత యౌటఁ దాఁ
    జేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పఙ్తికంఠుఁడౌ

    రిప్లయితొలగించండి
  9. పోరున రాముడు దునిమెను
    నేరము దశ ముఖుడు సేయ :: నేరక మడి సె న్వీరుడగు కుంభ కర్ణుడు
    పోరాటము నందు తాను పోరుచు గాదే

    రిప్లయితొలగించండి

  10. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కోరి చెఱపట్టి సీతను
    నేరము దశముఖుడు సేయ; నేరక మడిసెన్
    మారీచుడు లేడిగ తా
    మారియు రఘురాముని కరమందు
    శరమునన్.

    రిప్లయితొలగించండి