ఉత్పలమాల వ్రాయుదురెవ్వరైన తమ భావన స్ఫూర్తిగ పక్షపాతమై దాయక భక్తి భావనలు తారక రాముని దైవమంచనన్ బాయక భారతీయులిల, బాధను మ్రింగిన లంక దృష్టిలో "చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పఙ్తికంఠుఁడౌ"
కం:కౌరవులు ద్రౌపదీ సతి చీర పయిన జేయి వేసి చెంద మరణముల్ దూరము గ నుండి సీతకు నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్” (కౌరవులు కనీసం ద్రౌపది చీర మీద చెయ్యి వేసి యుద్ధం లో చచ్చారు. కానీ రావణుడు అలా కూడా ముట్టుకోకుండానే చచ్చాడు. )
ఆ రాజపుత్రి సీతా
రిప్లయితొలగించండిచోరుడ యిన లంకఱేడు సుగుణుడగుటచే
నా రమణిననుభవించెడి
నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్
కందం
రిప్లయితొలగించండిచేరియు విభీషణాఖ్యుఁడు
శ్రీరాముని బ్రతికె, 'కుండచెవుల ననుజుఁడున్
దీరెరిగియు నొప్పింపగ' ,
నేరము దశముఖుఁడు సేయ, 'నేరక మడిసెన్'
ఉత్పలమాల
తొలగించండివ్రాయుదురెవ్వరైన తమ భావన స్ఫూర్తిగ పక్షపాతమై
దాయక భక్తి భావనలు తారక రాముని దైవమంచనన్
బాయక భారతీయులిల, బాధను మ్రింగిన లంక దృష్టిలో
"చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పఙ్తికంఠుఁడౌ"
రిప్లయితొలగించండికోరికచే బంధించిన
నోరిమి జూపించి గడువు నొసగెను గాదే
భీరువు స్పర్షించు టనెడి
నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్.
తోయలి పైన మోహమది తొందర పెట్టగ పట్టి తెచ్చి దై
తేయుడు వాంఛ దీర్చమని తీక్ష్ణత నించుక చూపకుండ నా
ప్యాయత తోడ వేచెదనటంచు వచించెను కాదె కాంచగన్
చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పఙ్తికంఠుఁడౌ.
కోరిక జయింప లేక ప్ర
రిప్లయితొలగించండితారముతో నపహరించి తానా కుజపై
గౌరవ భంగంబనియెడి
నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్
తోయజనేత్రుడా బలినిఁ ద్రొక్కెనధోభువనమ్ము నాతడే
చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు; పఙ్తికంఠుఁడౌ
మాయల మాటునన్ కుజను మార్గణుడై గిలుబాడి నాడనన్
హేయపు కార్యభూషణుడు హీనగుణాత్ముడు రావణుండనన్
కం:కౌరవులు ద్రౌపదీ సతి
రిప్లయితొలగించండిచీర పయిన జేయి వేసి చెంద మరణముల్
దూరము గ నుండి సీతకు
నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్”
(కౌరవులు కనీసం ద్రౌపది చీర మీద చెయ్యి వేసి యుద్ధం లో చచ్చారు. కానీ రావణుడు అలా కూడా ముట్టుకోకుండానే చచ్చాడు. )
ఉ:చేయగ సాగె నొక్కడు విచిత్రపు తర్కము నిట్లు" సీత పై
రిప్లయితొలగించండిచేయియు వేయ లేదు కద!చెల్లెలి పై తన జాలి జూపి యే
చేయ బ్రతిక్రియన్ తరుణి సీతను దెచ్చెను,మానభంగమే
చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పఙ్తికంఠుఁడౌ”
(రావణుడు సీతని ఊరికే తెచ్చాడా? తన చెల్లెలికి అవమానం జరిగితే ప్రతీకారానికి తెచ్చాడు. ఐనా అతనేమన్నా ఆమెని మానభంగం చేసాడా? అని ఒకదు వాదించాడు.)
(విభీషణుని రాముని వద్దకు చేరనీయక బంధించి లేక చంపియుంటే కథ వేరుగా ఉండేది అనే భావంతో)
రిప్లయితొలగించండికం॥ దూరుచు భ్రాత తిరగబడ
దూరపు టాలోచనఁగని దుగ్ధననుజునున్
వీరుఁడు కరుణను తునుమెడి
నేరము దశముఖుఁడు సేయనేరక మడిసెన్
ఉ॥ న్యాయము నెంచి భీతిఁగని నారిని వీడు మటంచుఁ దెల్పుచున్
సాయము మాని సోదరుఁడు సాగుచు నిందలు వేయుచుండినన్
దాయముఁ గాంచకుండ దయఁ దల్చుచుఁ దమ్ముని చంపకుండుటే
చేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పంఙ్తికంఠుడౌ
దాయము విపత్తు
తోరపుఁ బ్రాయశ్చిత్తము
రిప్లయితొలగించండినా రావణఁ డత్యధిక మదాంధుం డకటా
కారణము మేము సుంతయు
నేరము దశముఖుఁడు సేయ నేరక మడిసెన్
ఆ యనుమయ్యనుం గని కటా కపిఁ జంపుట రాజ నీతి కా
దే యని సమ్మతించి వెస నించుక తోఁకకు, శిక్ష నన్యమున్
వేయక యుంట నిప్పు నిడి వెఱ్ఱి తనమ్మున దూత యౌటఁ దాఁ
జేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పఙ్తికంఠుఁడౌ
పోరున రాముడు దునిమెను
రిప్లయితొలగించండినేరము దశ ముఖుడు సేయ :: నేరక మడి సె న్వీరుడగు కుంభ కర్ణుడు
పోరాటము నందు తాను పోరుచు గాదే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కోరి చెఱపట్టి సీతను
నేరము దశముఖుడు సేయ; నేరక మడిసెన్
మారీచుడు లేడిగ తా
మారియు రఘురాముని కరమందు
శరమునన్.