23-2-2026 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్”(లేదా...)“తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్”
నిన్ననె కన్నని గాథను విన్న కొ మరునికి దృఢముగ పెలుచన గలుగన్మన్ను తినునతని బొమ్మనుతన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
కందంఎన్నెన్నో నేర్ప మనకుసున్నితముగ కర్కశముగఁ జుట్టు ననుభవాలెన్నియొ! ముద్దిడిన. ,గురుడుదన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్ఉత్పలమాలఎన్నియొ నేర్పఁగన్ మనకు నిట్లని యట్లని దూరదృష్టితోసున్నిత, కర్కశమ్ములను జుట్టును తానను భుక్తినిచ్చుతన్సన్నుతులందెడున్ గురుఁడు స్వానుభవోక్తుల ముద్దు సేసినన్దన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
ఎన్నో యేండ్లకు పుట్టినికన్నకొడుకు వాడనుచును గారాబముతో మిన్నగ పెంచుకొనెడి చొఱ తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్.చెన్నగు రూపమున్ గలిగి చేష్టల తోడ మనస్సు దోచెడిన్ పిన్న వయస్సు బాలకుడె పెన్నిధి యంటు దలంచి పెద్దలే తిన్నగ పెంచుకొన్న తమ దేహజుడర్మిలి తల్లిదండ్రులన్ తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్.
ఎన్నిక కాగోరినచోక్రన్నన నీలక్షణములు గావలయుగదాసున్నిత మన్నది వీడుచుతన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్ఎన్నికలందు నిల్పుటకు నెవ్విధి సిద్ధము సేయగావలెన్?పన్నుగ మాటలాడి పలు వన్నెలు చిన్నెలు చూపగావలెన్సున్నిత మన్నదే మరచి చోద్యపు పోకడ లుండగావలెన్తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
కం: ని న్నేదొ యాలి తిట్టగ"నున్న పరువు పోయె" నంచు నుడుకకు, సతి చేతన్న బడిన కృష్ణుని వలెతన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
సమస్య : “తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్”ఉ. కన్నుల సోయగమ్ముగని కాముని బాణము తాకి స్రొక్కితిన్వన్నియలున్న చిన్నదని వంచననొంది వివాహమాడి, తానన్నుల మిన్నయంచు శిరమందున నిల్పితి నేమిసేతు, తాఁదన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్మీది మెరుగులు చూసి మనువాడిన ఓ అభాగ్యుని వ్యధ.
ఉ:మున్ను నహింస తో సమరమున్ వివరించుచు గాంధి యిట్లనెన్"మిన్న యహింసయే,పరిథి మీరి చరించిన తెల్ల వారు మీ రెన్నడు చేయ వద్దు ప్రతిహింసను, వారలు మిమ్ము నెంతగా దన్నినఁ, దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్”( గాంధీ గారు అహింసాయుధం తో సమరాన్ని ఇలా వివరించారు. )
కన్న కొడుకుఁ గొని చన నాపన్నుం డివ్వధిఁ దలంచె వసుదేవుఁ డెదన్ నన్నిట నక్కట గాడిద తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్ కన్నని నీతి వాక్యములఁ గాంచినఁ దెల్లము గాదె యివ్విధిం బన్నుగఁ దాను సుస్థితపుఁ బ్రజ్ఞుఁడు గా వలె నన్నఁ జక్కఁగా మన్నన నింపుగా నొసఁగ మాని ముదం బెద నవ్వఁగాఁ దగుం దన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
చెన్నగు విద్యలు నేర్పుచు మిన్నగ శిక్షణ నొసగుచు మేటి గురు o డై వెన్నున దెబ్బలు గొట్టు చు తన్నిన గుందక యె నవ్వ దగు నెల్ల పుడున్
ఎన్ని సుఖమ్ములో దొరకు నిల్లరికంబున నల్లుడైనచోనెన్నఁడు నత్తమామలకు నిమ్ముగ సేవలు చేసి భార్యకున్పన్నుగ దాసుడై మెలఁగు వ్యర్థుఁడు సౌఖ్యఁపు జీవనమ్ముకైతన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
ఎన్నఁగ నిల్లరికమ్మునపన్నుగ దాస్యమును సల్పి భార్యకు పతి తానెన్నఁడు సౌఖ్యములడరఁగతన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కన్న కుమారుని తండ్రియెమిన్నగ నాడించుచుండ మేనున నెక్కన్సున్నిత పాదమ్ములతోతన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్.
కం॥ కన్న యెఱగందు కదులుచుఁగ్రన్నన నటునిటు విరసిన కలకల హసమున్మిన్నగఁ గాంచుచుఁ నాడుచుఁ దన్నినఁ గుందకయె నవ్వగాఁ దగు నెపుడున్ఉ॥ ఎన్నఁగఁ దల్లిదండ్రులిల నెంచుచుఁ బిల్లల వృద్ధి నొక్కటేమిన్నగఁ బెంచు పద్ధతిని మేలిమి ప్రేమను తప్పుఁ జేయగన్ గ్రన్నన సంతు బుద్ధిఁ గనఁ గ్రమ్మిన బాధను సర్ది చెప్పుచున్ దన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్ఎఱగందు శిశువుఉ॥ లో నవ్వగా ను literal గా కాకుండా figurative గా అర్థము చేసుకొని ఆదరించినట్టుగా తీసుకోవాలండి
నిన్ననె కన్నని గాథను
రిప్లయితొలగించండివిన్న కొ మరునికి దృఢముగ పెలుచన గలుగన్
మన్ను తినునతని బొమ్మను
తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
కందం
రిప్లయితొలగించండిఎన్నెన్నో నేర్ప మనకు
సున్నితముగ కర్కశముగఁ జుట్టు ననుభవా
లెన్నియొ! ముద్దిడిన. ,గురుడు
దన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
ఉత్పలమాల
ఎన్నియొ నేర్పఁగన్ మనకు నిట్లని యట్లని దూరదృష్టితో
సున్నిత, కర్కశమ్ములను జుట్టును తానను భుక్తినిచ్చుతన్
సన్నుతులందెడున్ గురుఁడు స్వానుభవోక్తుల ముద్దు సేసినన్
దన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
రిప్లయితొలగించండిఎన్నో యేండ్లకు పుట్టిని
కన్నకొడుకు వాడనుచును గారాబముతో
మిన్నగ పెంచుకొనెడి చొఱ
తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్.
చెన్నగు రూపమున్ గలిగి చేష్టల తోడ మనస్సు దోచెడిన్
పిన్న వయస్సు బాలకుడె పెన్నిధి యంటు దలంచి పెద్దలే
తిన్నగ పెంచుకొన్న తమ దేహజుడర్మిలి తల్లిదండ్రులన్
తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్.
ఎన్నిక కాగోరినచో
రిప్లయితొలగించండిక్రన్నన నీలక్షణములు గావలయుగదా
సున్నిత మన్నది వీడుచు
తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
ఎన్నికలందు నిల్పుటకు నెవ్విధి సిద్ధము సేయగావలెన్?
పన్నుగ మాటలాడి పలు వన్నెలు చిన్నెలు చూపగావలెన్
సున్నిత మన్నదే మరచి చోద్యపు పోకడ లుండగావలెన్
తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
కం: ని న్నేదొ యాలి తిట్టగ
రిప్లయితొలగించండి"నున్న పరువు పోయె" నంచు నుడుకకు, సతి చే
తన్న బడిన కృష్ణుని వలె
తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
సమస్య : “తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్”
రిప్లయితొలగించండిఉ. కన్నుల సోయగమ్ముగని కాముని బాణము తాకి స్రొక్కితిన్
వన్నియలున్న చిన్నదని వంచననొంది వివాహమాడి, తా
నన్నుల మిన్నయంచు శిరమందున నిల్పితి నేమిసేతు, తాఁ
దన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
మీది మెరుగులు చూసి మనువాడిన ఓ అభాగ్యుని వ్యధ.
ఉ:మున్ను నహింస తో సమరమున్ వివరించుచు గాంధి యిట్లనెన్
రిప్లయితొలగించండి"మిన్న యహింసయే,పరిథి మీరి చరించిన తెల్ల వారు మీ
రెన్నడు చేయ వద్దు ప్రతిహింసను, వారలు మిమ్ము నెంతగా
దన్నినఁ, దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్”
( గాంధీ గారు అహింసాయుధం తో సమరాన్ని ఇలా వివరించారు. )
కన్న కొడుకుఁ గొని చన నా
రిప్లయితొలగించండిపన్నుం డివ్వధిఁ దలంచె వసుదేవుఁ డెదన్
నన్నిట నక్కట గాడిద
తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
కన్నని నీతి వాక్యములఁ గాంచినఁ దెల్లము గాదె యివ్విధిం
బన్నుగఁ దాను సుస్థితపుఁ బ్రజ్ఞుఁడు గా వలె నన్నఁ జక్కఁగా
మన్నన నింపుగా నొసఁగ మాని ముదం బెద నవ్వఁగాఁ దగుం
దన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
చెన్నగు విద్యలు నేర్పుచు
రిప్లయితొలగించండిమిన్నగ శిక్షణ నొసగుచు మేటి గురు o డై
వెన్నున దెబ్బలు గొట్టు చు
తన్నిన గుందక యె నవ్వ దగు నెల్ల పుడున్
ఎన్ని సుఖమ్ములో దొరకు నిల్లరికంబున నల్లుడైనచో
రిప్లయితొలగించండినెన్నఁడు నత్తమామలకు నిమ్ముగ సేవలు చేసి భార్యకున్
పన్నుగ దాసుడై మెలఁగు వ్యర్థుఁడు సౌఖ్యఁపు జీవనమ్ముకై
తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
ఎన్నఁగ నిల్లరికమ్మున
రిప్లయితొలగించండిపన్నుగ దాస్యమును సల్పి భార్యకు పతి తా
నెన్నఁడు సౌఖ్యములడరఁగ
తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కన్న కుమారుని తండ్రియె
మిన్నగ నాడించుచుండ మేనున నెక్కన్
సున్నిత పాదమ్ములతో
తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్.
కం॥ కన్న యెఱగందు కదులుచుఁ
రిప్లయితొలగించండిగ్రన్నన నటునిటు విరసిన కలకల హసమున్
మిన్నగఁ గాంచుచుఁ నాడుచుఁ
దన్నినఁ గుందకయె నవ్వగాఁ దగు నెపుడున్
ఉ॥ ఎన్నఁగఁ దల్లిదండ్రులిల నెంచుచుఁ బిల్లల వృద్ధి నొక్కటే
మిన్నగఁ బెంచు పద్ధతిని మేలిమి ప్రేమను తప్పుఁ జేయగన్
గ్రన్నన సంతు బుద్ధిఁ గనఁ గ్రమ్మిన బాధను సర్ది చెప్పుచున్
దన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
ఎఱగందు శిశువు
ఉ॥ లో నవ్వగా ను literal గా కాకుండా figurative గా అర్థము చేసుకొని ఆదరించినట్టుగా తీసుకోవాలండి