చం:తెలుగునె నేర్వకుండ గడు దిట్టెద వేల గవీంద్రు లేలనో సులభముగా రచించ రని? సూరియె సంగనభట్ల,యాతడే దెలుపగ నీకు నన్వయము, తీరుగ నీవును విన్నచో గడున్ సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే (తెలుగు రాక కవులు సులభం గా రాయ లే దని తిడుతున్నావు. సంగనభట్ల నరసయ్య గారి తో అన్వయం చెప్పించుకో .అర్థ మౌతుంది అని సలహా యిచ్చాడు.సంగనభట్ల నరసయ్య గారు మన లో చాలా మందికి తెలిసిన గొప్ప పండితులు. )
తేటగీతి
రిప్లయితొలగించండిరామచరిత పాండవ గాథ రంగరింప
ద్వ్యర్థి కావ్యమ్ము వెలుగొందె! వ్యాకరణము
మేటి పదసంపద గలుగ మీకు సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ
చంపకమాల
తెలియుచు రామగాథ పరిధిన్ మరి పంచమవేద సార మా
వల పదసంపదన్ మిగుల వ్యాకరణాంశపు జ్ఞానదీప్తిమై
గలిమిగ ద్వ్యర్థి కావ్యమదె కల్గఁగ నిష్ఠ తలిర్పఁగన్ గడున్
సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే
మూడవ పాదారంభము కలిమిగ అని చదువుకొన మనవి.
తొలగించండిరక రకముల కవితల రచన జేసి ,
రిప్లయితొలగించండిరాముని కథతోపాటు భారతము గూర్చు
పింగళి విరచిత కవిత బెడగు సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ
రిప్లయితొలగించండికఠిన తరమని పించెడి కావ్యమంచు
పలుక నేలర యిదికాంచ వసుధయందు
సంస్కృతాంధ్ర పండితులకున్ జాల సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ.
లలిత పదమ్ములందు కనరావని చింతయదేల చూడగా
విలసిత మౌ పదమ్ములవి విజ్ఞులు మెచ్చెడి సంస్కృతమ్ముతో
తెలుగున పాటవమ్ముగల ధీమతులే పఠియించినన్ కడున్
సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే.
శ్లేష విశ్లేషకులు విప్పిచెప్పు చుండ
రిప్లయితొలగించండిరెండు రీతుల ధ్వనియించు చుండు గాదె!
వివరణాత్మక ప్రచురణ వెలయ సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ
తెలిసిన రామగాథ మరి తిక్కన భారతమే సదా మనో
ఫలకము పైన నుండుగద పాఠకులెల్ల మహాద్భుతంబనన్
బలువురు పండితోత్తములు భావమునే వివరింపగా కడున్
సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే
తే.గీ:అయ్య!రాఘవ పాండవీ యమ్ము మొదటె
రిప్లయితొలగించండియందుకొన నేల? యమరమ్ము,నాంథ్ర నామ
సంగ్రహము,భారతాదుల జదువ సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ”
(మొదట ఆ పైవి చదివితే రాఘవపాండవీయం సులభ మౌతుంది అని. )
తే॥ శ్లేషనర్థము తెలివిగఁ జేసు కొనెడి
రిప్లయితొలగించండిప్రతిభఁ బడయఁగ భారత, రామ కథల
వివరముల నరియఁగఁ గడు చవిగ సులభ
మగును రాఘవ పాండవీయమ్మఁ జదువ
చం॥ తెలివిగ రామ గాథయును దీటుగ భారత కావ్య సారమున్
మలచఁగ నొక్క కబ్బమున మక్కువ మీరఁగ, భావ యుక్తమై
పలుకుల శ్లేష నిండఁగను బాటవ మొంద గ్రహించఁగన్ గడున్
సులభము గానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే
సమస్య : “సులభ మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ”
రిప్లయితొలగించండిగీ. ద్రాక్షపాకసంకాశమౌ ద్వ్యర్థికావ్య
మతిదురవగాహ మరయగ చదువరులకు
అదియె వ్యాఖ్యానపూర్వకమైన సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ
(ఛందోగోపనము)
చం:తెలుగునె నేర్వకుండ గడు దిట్టెద వేల గవీంద్రు లేలనో
రిప్లయితొలగించండిసులభముగా రచించ రని? సూరియె సంగనభట్ల,యాతడే
దెలుపగ నీకు నన్వయము, తీరుగ నీవును విన్నచో గడున్
సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే
(తెలుగు రాక కవులు సులభం గా రాయ లే దని తిడుతున్నావు. సంగనభట్ల నరసయ్య గారి తో అన్వయం చెప్పించుకో .అర్థ మౌతుంది అని సలహా యిచ్చాడు.సంగనభట్ల నరసయ్య గారు మన లో చాలా మందికి తెలిసిన గొప్ప పండితులు. )
మంచి యవగాహనా శక్తి మహిత మైన
రిప్లయితొలగించండిభావ ముల నెల్ల గ్రహీయించు పట్టు గల్గి
యున్న యెడలను గ్ర o ధాల నన్ని సులభ
మగును రాఘవ పాండవీయ మ్ము చదువ
వింటి శ్లేషార్థ సంయోగ విశ్వ కీర్తి
రిప్లయితొలగించండితాంధ్ర భాషా మహా కావ్య మది యని తగ
నర్థ తాత్పర్యము లిడిన నంత సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ
వెలసిన ద్వర్థి కావ్యము గభీర పదౌఘ విరాజితం బిలన్
సలలిత శబ్ద సంచయ లసన్నుత దేవ గణాంధ్ర భాష లం
దలఘు వివేక వంతులకు నగ్ర మనీషి గణాళికిం గడున్
సులభము గానె యర్థ మగు సూరన రాఘవ పాండవీయమే
పిన్నక నాగేశ్వరరావు.
రిప్లయితొలగించండిహైదరాబాద్.
ద్వ్యర్ధి కావ్యమ్ము సూరన వ్రాసినాడు
రామ చరిత,భారత కథ ప్రతిభ తోడ
శ్లేషఁ తెలివిగా నర్ధము జేసికొనెడు
ప్రతిభ,పాటవ మున్నట్టి వార్కి సులభ
మగును రాఘవ పాండవీయమ్ముఁ జదువ.