1-3-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు”(లేదా...)“హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిఅతిథి జంగమదేవర యడిగినంతవారి సాక్షాత్తు హరునిగన్ భక్తిఁ దలఁచివండి వడ్డించె సుతుఁజంపి బంతిలోన!హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు?
చంపకమాలసరగున వచ్చి తా నతిథి జంగమదేవర కోరినంతటన్ సరెయని పుత్రునిన్ దునిమి సాంబునికర్పణ జేసినట్లుగన్ వెరువక విందుఁజేసెకద! విజ్ఞత వీడియు పల్కు వ్యాఖ్యయే,"హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే"
“హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు"తలచకుమటుల శివునికై తన కొమరునివండి వడ్డించుటెరుగవో ! పరమ భాగ వతుడతడని దెలుసుకొని వక్కణించు
మీ పూరణ బాగుంది. అభినందనలు
అతిథి దేవుడె పరమేశు డంచు నమ్మియతడు కోరిన రీతిని యంగభవునివండి వడ్డించెకద కడు భక్తితోడహరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు? అరయగ ప్రాఘుణుండనగ నాపరమేశ్వర తుల్యుడంచు నాపురరిపు వేను కోరెనని పుత్రుడటంచు దలంచకుండనే పొరిగొని వండెగాదె మరి మూర్ఖుడ యెట్లు వచింతు వెప్పుడాహరునిఁ దృణీకరించె సిరియాళుఁడు, పుత్రునిఁ జంప నొప్పఁడే?
కోరెఁ బ్రాణముల్ గాపాడు కొమ్మటంచు నాగహారుడా భక్తునిఁ నంబి సుతుడుహరుని లెక్క సేయఁడు; సిరియాళుఁ డెపుడుగుండె నిబ్బరమొప్పగ నుండువాడుగురుని గృహంబునన్ జదువు గొప్ప మనస్కుని హెచ్చరించెనాహరకుడు మాయరూపమునఁ హాయిగ ప్రాణము నిల్చునట్లుగాహరునిఁ దృణీకరించె సిరియాళుఁడు; పుత్రునిఁ జంప నొప్పఁడేనరుఁడయినన్ మహామహులు నమ్మిన సత్యము నాలకింపుమా
హర హర శంకరాయని యహర్నిశమున్ శివనామ కీర్తనాపరుడయి భక్తితత్పరత ప్రబ్బికొనంగ మహేశుఁగొల్చి భీకరముగ పుత్రు మాంసమును కల్మషకంఠునకీయ నెవ్విధిన్హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు? పుత్రునిఁ జంప నొప్పఁడే?
హరుని భక్తిగా గొల్చుచు నహరహమ్ముసుతుని సైతము బువ్వగా శూలికిడఁగహరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడుననుచు బల్కుట భావ్యమా యనఘ మీకు?
సర్వ జీవుల యందున శంభు గాంచు భక్తు డొనరించె నతి థి కి భుక్తి గాను హరుని లెక్క సేయ డు సిరియా ళు డెపుడు?మహిత శివ భక్తుడాత డు మహిని గాదె
నమ్ము వారున్న వచియింత్రు నెమ్మి నెన్నొ మున్ను జరగనివి జరగె నన్న విధము పుక్కిటి పురాణములు నమ్మఁ బోకు దీని హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు హరుఁ డరుదెంచి యన్నమును యాచన సేయుట కల్ల సుమ్ము నారి ఋషి కుమారు మాంసము వరించుట కల్లల కెల్లఁ గల్లయౌ నరులకు నమ్మకమ్ములు ఘనమ్మన వచ్చును గాంచ నీ కథన్ హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే [తృణీకరించె = చిన్నఁబుచ్చె; ఒప్పఁడే = ఒప్పును]
చం॥ సరి చిరుతొండనంబి యటు చక్కగ పుత్రుని వండి పెట్టుటన్ హరునకు భక్తి తోడ విని యార్ద్రత నిండఁగ నిద్ర యందునన్ హరుని దృణీకరించె సిరియాళుఁడు, పుత్రునిఁ జంప నొప్పఁడేకరుణను దండ్రియైన కలఁ గాంచితి నీవిధి మెచ్చెనుగ్రుఁడే(కలలు సామాన్యంగా ఇలా ఉంటాయండి)
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.దక్షుడున్ మాటలాడుచు దారుణముగహరుని లెక్క సేయడు; సిరియాళు డెపుడుచిత్తశుద్ధితో శివపూజ చేయుచుండితండ్రి యాజ్ఞను మీరక తలను వంచె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిఅతిథి జంగమదేవర యడిగినంత
వారి సాక్షాత్తు హరునిగన్ భక్తిఁ దలఁచి
వండి వడ్డించె సుతుఁజంపి బంతిలోన!
హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు?
చంపకమాల
తొలగించండిసరగున వచ్చి తా నతిథి జంగమదేవర కోరినంతటన్
సరెయని పుత్రునిన్ దునిమి సాంబునికర్పణ జేసినట్లుగన్
వెరువక విందుఁజేసెకద! విజ్ఞత వీడియు పల్కు వ్యాఖ్యయే,
"హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే"
“హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు"
రిప్లయితొలగించండితలచకుమటుల శివునికై తన కొమరుని
వండి వడ్డించుటెరుగవో ! పరమ భాగ
వతుడతడని దెలుసుకొని వక్కణించు
మీ పూరణ బాగుంది. అభినందనలు
తొలగించండి
రిప్లయితొలగించండిఅతిథి దేవుడె పరమేశు డంచు నమ్మి
యతడు కోరిన రీతిని యంగభవుని
వండి వడ్డించెకద కడు భక్తితోడ
హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు?
అరయగ ప్రాఘుణుండనగ నాపరమేశ్వర తుల్యుడంచు నా
పురరిపు వేను కోరెనని పుత్రుడటంచు దలంచకుండనే
పొరిగొని వండెగాదె మరి మూర్ఖుడ యెట్లు వచింతు వెప్పుడా
హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు, పుత్రునిఁ జంప నొప్పఁడే?
కోరెఁ బ్రాణముల్ గాపాడు కొమ్మటంచు
రిప్లయితొలగించండినాగహారుడా భక్తునిఁ నంబి సుతుడు
హరుని లెక్క సేయఁడు; సిరియాళుఁ డెపుడు
గుండె నిబ్బరమొప్పగ నుండువాడు
గురుని గృహంబునన్ జదువు గొప్ప మనస్కుని హెచ్చరించెనా
హరకుడు మాయరూపమునఁ హాయిగ ప్రాణము నిల్చునట్లుగా
హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు; పుత్రునిఁ జంప నొప్పఁడే
నరుఁడయినన్ మహామహులు నమ్మిన సత్యము నాలకింపుమా
హర హర శంకరాయని యహర్నిశమున్ శివనామ కీర్తనా
రిప్లయితొలగించండిపరుడయి భక్తితత్పరత ప్రబ్బికొనంగ మహేశుఁగొల్చి భీ
కరముగ పుత్రు మాంసమును కల్మషకంఠునకీయ నెవ్విధిన్
హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు? పుత్రునిఁ జంప నొప్పఁడే?
హరుని భక్తిగా గొల్చుచు నహరహమ్ము
రిప్లయితొలగించండిసుతుని సైతము బువ్వగా శూలికిడఁగ
హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు
ననుచు బల్కుట భావ్యమా యనఘ మీకు?
సర్వ జీవుల యందున శంభు గాంచు
రిప్లయితొలగించండిభక్తు డొనరించె నతి థి కి భుక్తి గాను
హరుని లెక్క సేయ డు సిరియా ళు డెపుడు?
మహిత శివ భక్తుడాత డు మహిని గాదె
నమ్ము వారున్న వచియింత్రు నెమ్మి నెన్నొ
రిప్లయితొలగించండిమున్ను జరగనివి జరగె నన్న విధము
పుక్కిటి పురాణములు నమ్మఁ బోకు దీని
హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు
హరుఁ డరుదెంచి యన్నమును యాచన సేయుట కల్ల సుమ్ము నా
రి ఋషి కుమారు మాంసము వరించుట కల్లల కెల్లఁ గల్లయౌ
నరులకు నమ్మకమ్ములు ఘనమ్మన వచ్చును గాంచ నీ కథన్
హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే
[తృణీకరించె = చిన్నఁబుచ్చె; ఒప్పఁడే = ఒప్పును]
చం॥ సరి చిరుతొండనంబి యటు చక్కగ పుత్రుని వండి పెట్టుటన్
రిప్లయితొలగించండిహరునకు భక్తి తోడ విని యార్ద్రత నిండఁగ నిద్ర యందునన్
హరుని దృణీకరించె సిరియాళుఁడు, పుత్రునిఁ జంప నొప్పఁడే
కరుణను దండ్రియైన కలఁ గాంచితి నీవిధి మెచ్చెనుగ్రుఁడే
(కలలు సామాన్యంగా ఇలా ఉంటాయండి)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
దక్షుడున్ మాటలాడుచు దారుణముగ
హరుని లెక్క సేయడు; సిరియాళు డెపుడు
చిత్తశుద్ధితో శివపూజ చేయుచుండి
తండ్రి యాజ్ఞను మీరక తలను వంచె.