3-7-2026 (శుక్రవారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శవసాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ”(లేదా...)“శవసాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యంబగున్ పెన్నిధుల్”
కందంజవసత్త్వమ్ములుడుగ మాధవ! శరణంచును దపించ దంతినె కాచెన్స్తవనీయుండనగన్ గేశవసాన్నిధ్యము నరులకు సంపత్కరమౌమత్తేభవిక్రీడితముజవసత్త్వమ్ములు సన్నగిల్లెననుచున్ సంరక్ష భారమ్ము మాధవ నీదేనని వేడగన్ శరణమున్ దంతిన్ వడిన్ గాచెనేస్తవముల్ జేయుచు నార్తితోఁ బిలువఁగన్ దాక్షిణ్యమున్ జూపు కేశవసాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యంబగున్ పెన్నిధుల్!
వివరించెద నిపుడు వినుము !ఎవరికయిన బ్రతుకు నడిమి యిబ్బంది యగున్అవిధిని బాయుటకయి కేశవసాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ
భువిపై ప్రధానమేదనఁభవితవ్యంబనుచు జనులు భావింతురుగాకువలేశయుండయిన కే శవసాన్నిధ్యము నరులకు సంపత్కరమౌభువిపైకోరుచునుంద్రు సర్వజనులున్ భోగాదులన్ మెండుగాభవితవ్యంబును చక్కఁజేయుమనుచున్ బ్రార్థింతురే నిండుగానవనీతాత్ముడు శేషతల్పగతుడున్ నారాయణుండైన కేశవసాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యంబగున్ పెన్నిధుల్
ద్రవిణము నకు బానిసలై యవగడముల నెన్నొ జేసి యకముల పాలౌ చు వనరుట కంటె నిల కే శవసాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ.భువిలో సంపద శాశ్వతమ్మనుకొనే మూర్ఖత్వమున్ వీడుచున్ భవ బంధమ్ముల బంధియైన నరుడైశ్వర్యమ్మునే పొందగన్ నెవముల్ సల్పుట మానుచున్ ప్రణవమున్ నిత్యమ్ము పూజించు, కే శవసాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యంబగున్ పెన్నిధుల్.
శివనామము స్మరియించుముభవనాశము కొరకు భక్తి భావముతోడన్భువిలో శుభకరమగు కేశవసాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ
భవనాశంకరుడైన శంకరుని సంభావించుచున్ నిచ్చలున్శివనామమ్ము స్మరించు భక్తులకు నిశ్శేషమ్మగున్ పాపముల్భువిలో శ్రీహరి పాదపంకజములే పోరాములన్ బాపు కేశవసాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యంబగున్ పెన్నిధుల్
మ॥ భవమున్ బాపుచుఁ బ్రోచి రక్షఁగన సంభావించి విద్వత్తుతోఁగవులే తెల్పిరి స్పష్టతన్ గనుచు సంస్కారమ్ము నేపారఁగన్భువిలో నేమము భక్తి తత్పరత సంపూర్ణమ్ముగాఁ గాంచి కేశవసాన్నిధ్యముఁ గోరు కొమ్ము నరుఁడా సాధ్యంబగున్ బెన్నిధుల్సంభావించు చక్కగా ఆలోచించు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సవనాచరణము మర్త్యుల కవశ్యమౌ నని వచింపఁ గాదనఁ గలమే వ్యవసాయార్థం బా పాశవ సాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ [పాశవము = పశువులకు సంబంధించినది] అవనీ లోకము వెల్గు చున్న దొకటై న్యాయార్జనార్థమ్మునై భువనవ్రాత విహారమే తనర సంపూర్ణమ్ము విశ్వాగ్ర్య భూధవ సాన్నిధ్యము లబ్ధమై వఱలఁ దథ్యం బెన్న వ్యాపార సాశవ సాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యం బగుం బెన్నిధుల్ [స+ఆశవ సాన్నిధ్యము = సాశవ సాన్నిధ్యము; ఆశవము = శీఘ్రత]
ప్రవిమల భక్తి ప్ర పత్తి గ సువిధపు రీతిగను హరిని స్తుతి రూప మునన్ దవి లియు జపి o చుచు ను కే శవ సాన్ని ధ్య మె నరులకు సంపత్కర మౌ
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.అవకాశము కలిగెను గదనవిరళముగ సేవచేయ నా భగవంతునికిన్స్తవనీయుండగు నా కేశవ సాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ.
రిప్లయితొలగించండికందం
జవసత్త్వమ్ములుడుగ మా
ధవ! శరణంచును దపించ దంతినె కాచెన్
స్తవనీయుండనగన్ గే
శవసాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ
మత్తేభవిక్రీడితము
జవసత్త్వమ్ములు సన్నగిల్లెననుచున్ సంరక్ష భారమ్ము మా
ధవ నీదేనని వేడగన్ శరణమున్ దంతిన్ వడిన్ గాచెనే
స్తవముల్ జేయుచు నార్తితోఁ బిలువఁగన్ దాక్షిణ్యమున్ జూపు కే
శవసాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యంబగున్ పెన్నిధుల్!
వివరించెద నిపుడు వినుము !
రిప్లయితొలగించండిఎవరికయిన బ్రతుకు నడిమి యిబ్బంది యగున్
అవిధిని బాయుటకయి కే
శవసాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ
భువిపై ప్రధానమేదనఁ
రిప్లయితొలగించండిభవితవ్యంబనుచు జనులు భావింతురుగా
కువలేశయుండయిన కే
శవసాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ
భువిపైకోరుచునుంద్రు సర్వజనులున్ భోగాదులన్ మెండుగా
భవితవ్యంబును చక్కఁజేయుమనుచున్ బ్రార్థింతురే నిండుగా
నవనీతాత్ముడు శేషతల్పగతుడున్ నారాయణుండైన కే
శవసాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యంబగున్ పెన్నిధుల్
రిప్లయితొలగించండిద్రవిణము నకు బానిసలై
యవగడముల నెన్నొ జేసి యకముల పాలౌ
చు వనరుట కంటె నిల కే
శవసాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ.
భువిలో సంపద శాశ్వతమ్మనుకొనే మూర్ఖత్వమున్ వీడుచున్
భవ బంధమ్ముల బంధియైన నరుడైశ్వర్యమ్మునే పొందగన్
నెవముల్ సల్పుట మానుచున్ ప్రణవమున్ నిత్యమ్ము పూజించు, కే
శవసాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యంబగున్ పెన్నిధుల్.
శివనామము స్మరియించుము
రిప్లయితొలగించండిభవనాశము కొరకు భక్తి భావముతోడన్
భువిలో శుభకరమగు కే
శవసాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ
భవనాశంకరుడైన శంకరుని సంభావించుచున్ నిచ్చలున్
రిప్లయితొలగించండిశివనామమ్ము స్మరించు భక్తులకు నిశ్శేషమ్మగున్ పాపముల్
భువిలో శ్రీహరి పాదపంకజములే పోరాములన్ బాపు కే
శవసాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యంబగున్ పెన్నిధుల్
మ॥ భవమున్ బాపుచుఁ బ్రోచి రక్షఁగన సంభావించి విద్వత్తుతోఁ
రిప్లయితొలగించండిగవులే తెల్పిరి స్పష్టతన్ గనుచు సంస్కారమ్ము నేపారఁగన్
భువిలో నేమము భక్తి తత్పరత సంపూర్ణమ్ముగాఁ గాంచి కే
శవసాన్నిధ్యముఁ గోరు కొమ్ము నరుఁడా సాధ్యంబగున్ బెన్నిధుల్
సంభావించు చక్కగా ఆలోచించు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసవనాచరణము మర్త్యుల
రిప్లయితొలగించండికవశ్యమౌ నని వచింపఁ గాదనఁ గలమే
వ్యవసాయార్థం బా పా
శవ సాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ
[పాశవము = పశువులకు సంబంధించినది]
అవనీ లోకము వెల్గు చున్న దొకటై న్యాయార్జనార్థమ్మునై
భువనవ్రాత విహారమే తనర సంపూర్ణమ్ము విశ్వాగ్ర్య భూ
ధవ సాన్నిధ్యము లబ్ధమై వఱలఁ దథ్యం బెన్న వ్యాపార సా
శవ సాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యం బగుం బెన్నిధుల్
[స+ఆశవ సాన్నిధ్యము = సాశవ సాన్నిధ్యము; ఆశవము = శీఘ్రత]
ప్రవిమల భక్తి ప్ర పత్తి గ
రిప్లయితొలగించండిసువిధపు రీతిగను హరిని స్తుతి రూప మునన్
దవి లియు జపి o చుచు ను కే
శవ సాన్ని ధ్య మె నరులకు సంపత్కర మౌ
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అవకాశము కలిగెను గద
నవిరళముగ సేవచేయ నా భగవంతునికిన్
స్తవనీయుండగు నా కే
శవ సాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ.