రామ కథను జదివి రామకీర్తన విని రామ రాజ్యమన్న రమతి యనుచు రామనామ నిర్జర రసమందుగల సా రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును
కమ్మని రామ కీర్తనల గానసుధారసమున్ గ్రహించి మో దమ్మును బొందువారలకు దక్కిన మానవ జన్మమందు తా నమ్మిన దైవ సంస్తవము నాకము జేరుచునన్న భక్తి సా రమ్మునుఁ ద్రాగువారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీభువిన్
ఆ.వె: రమ్ము దెచ్చినాను, రమ్ము రమ్మనుచు గా రమ్ము జేతు వేల? రమ్ము పనికి ఆర్థవర్ష కార్య మైపోగ నాదివా రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును” (బ్యాంకులలో అర్థసంవత్సరపు లెక్కలు పెద్ద పని.ఇప్పుడు పని చేయకుండా రమ్ము తాగుదా మని పిలవకు. ఈ పని ఐపోయాక ఆదివారం పుచ్చుకుంటే సుఖంగా ఉంటుంది. )
ఉదయపు లగనమున నుద్వా మొనరించ
రిప్లయితొలగించండిగాదిలిగ దొలిరెయి కౌగిలి గొని
యాలి పెదవి తాకి యామె యధర నిర్జ
రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ఉదయలగ్నమందు నుద్వాహ మొనరించ గాదిలి తొలిరేయి.." అనండి.
🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిమానసిక సమస్యలే నరులు గుములు
ఖేద కారణమన, కృష్ణ గీత
యా సమస్యలనిల గాసిల జేయు! సా
రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును
ఉత్పలమాల
నమ్ముచు కృష్ణునిన్ నరుఁడు నర్మిలి సాదిగనెంచి మోహమే
క్రమ్మగ విల్లు వీడ దిగి గాసిలె మానసికంపు బాధలన్
గమ్మని గీతనే వినియు కౌరవసేనల గెల్చె! శాస్త్ర సా
రమ్మునుఁ ద్రాగువారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీ భువిన్
రిప్లయితొలగించండిఆకలి యను పేద యన్నార్థులను గాంచి
యన్న మిడుచు వారి నాదు కొనగ
బెగ్గడిల్ల కుండ పృథ్విని ధర్మ సా
రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును.
సొమ్మన మోహమున్, చెనటి స్యోనము లన్నను రోత గించి తా
నిమ్మహి లోన గాంచ పరమేశ్వరు డొక్కడె శాశ్వతమ్మనే
నమ్మిక తోడ గొల్చినననంతము దక్కునటంచు భక్తి సా
రమ్మునుఁ ద్రాగువారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీభువిన్.
రామ కథను జదివి రామకీర్తన విని
రిప్లయితొలగించండిరామ రాజ్యమన్న రమతి యనుచు
రామనామ నిర్జర రసమందుగల సా
రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును
కమ్మని రామ కీర్తనల గానసుధారసమున్ గ్రహించి మో
దమ్మును బొందువారలకు దక్కిన మానవ జన్మమందు తా
నమ్మిన దైవ సంస్తవము నాకము జేరుచునన్న భక్తి సా
రమ్మునుఁ ద్రాగువారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీభువిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఇమ్మహిలోన రోగము లనేకము నీరమునుండి సోకు నీ
రిప్లయితొలగించండిరమ్మున కశ్మలమ్ములు నిరంతర రుగ్మత కారకమ్ములౌ
నిమ్ముగ నెల్ల కాలముల నేమరకన్ పరిశుద్ధమైన నీ
రమ్మునుఁ ద్రాగువారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీభువిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆ.వె: రమ్ము దెచ్చినాను, రమ్ము రమ్మనుచు గా
రిప్లయితొలగించండిరమ్ము జేతు వేల? రమ్ము పనికి
ఆర్థవర్ష కార్య మైపోగ నాదివా
రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును”
(బ్యాంకులలో అర్థసంవత్సరపు లెక్కలు పెద్ద పని.ఇప్పుడు పని చేయకుండా రమ్ము తాగుదా మని పిలవకు. ఈ పని ఐపోయాక ఆదివారం పుచ్చుకుంటే సుఖంగా ఉంటుంది. )
కలుషమైన జలము కలిగించు రుగ్మతల్
రిప్లయితొలగించండిశుద్ధమైన జలము శుభముఁగూర్చు
బద్ధకమ్ము వీడి శుద్ధమైనట్టి నీ
రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:"ఇమ్మహి లోన నున్న బతుకే కడు సత్య" మటంచు నాత్మ త
రిప్లయితొలగించండిత్త్వమ్మును నమ్మనట్టి యొక భౌతికవాది వచించె నిట్లు స్వ
ర్గమ్మును లేదు, లేడు యమ రాజును, నే సుథ లేదు,హాయిగా
రమ్మునుఁ ద్రాగువారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీభువిన్”
ఉ॥ సొమ్ముల నొందు సూత్రములఁ జూచి గణించి విధానమెంచుచున్
రిప్లయితొలగించండినెమ్మది తోడ పద్ధతుల నేర్పును బొంది యధోచితిమ్ముగా
గమ్మున చక్కఁబెట్టు విధిఁ గాంచుచు సంపద లొందు రీతి సా
రమ్మునుఁ ద్రాగు వారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీభువిన్
(ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి)
ఫాల నేత్రు జపము భక్తి గా సల్పుచు
రిప్లయితొలగించండినిత్య నిర్మ లంపు నిష్ఠ తోడ
పర వ శించి చేయు భక్తి పూర్వ క పు సా
రమ్ము గ్రోల సుఖము ప్రాప్త మగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి(3)ఆ.వె:ర మ్మదేల నాకు? రసిక వౌ నీ యథ
రిప్లయితొలగించండిరమ్ము గ్రోల,నీ ముఖమ్ము గనగ,
నీదు స్వరము వినగ, నీదు యౌవనపు భా
రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును”
నమ్మ వమ్మ కొమ్మ! క్రమ్మును మైకమ్ము
రిప్లయితొలగించండిరమ్ము రమ్ము కాదు వమ్ము సొమ్ము
నెమ్మి సొమ్మసిల్ల నిమ్ముగ నెత్తి వా
రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్త మగును
[వారము = కల్లు కుండ]
ఇమ్ముగ రోగ బాధలను నెన్నఁడు నందక యుందు రిష్ట సా
దమ్ములఁ దృప్తి సెందుచు సతమ్ము చరింతురు మేని బల్మినిం
గమ్మగ నుండు నా పొదుఁగు కమ్రపు క్షీరము ప్రీతి తోడఁ దో
రమ్మునుఁ ద్రాగు వారలకె ప్రాప్తము లౌను సుఖమ్ము లీ భువిన్
ఇమ్మహభారతావని ననేకులు
రిప్లయితొలగించండివేల్పుల చిత్తశుద్ధితో
నెమ్మనమందు నమ్మియును
నిత్యము బూజలు సేయుచుంద్రు, లో
కమ్మున భక్త రక్షకుని కమ్మగ
నుండెడు రామ నామ సా
రమ్మును ద్రాగువారలకె ప్రాప్తములౌను
సుఖంబు లీధరన్
కమ్మని పిండి వంటలను కాంతుని రంజిల చేయుచున్ సదా
రిప్లయితొలగించండియిమ్ముగ నత్తమామలకు హెచ్చగు ప్రేమను పంచి, భర్త తా
రమ్మని పిల్చినంత, సతిరాత్రి యొసంగెడు మోవితేనె సా
రమ్మునుఁ ద్రాగువారలకె ప్రాప్తములౌను సుఖమ్ము లీభువిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
( సరదాగా.....)
మొదటి రాత్రి యనుచు ముద్దులు మొదలెట్టి
యూసులాడు చుండి యువిద తోడ
నధరములను కలిపి యధరాల తోడ సా
రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్తమగును.