24, జులై 2026, శుక్రవారం

సమస్య - 5538

25-7-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె”

(లేదా...)

“విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో పి.యెల్. నాగేశ్వరరావు గారి సమస్య)

27 కామెంట్‌లు:

  1. తేటగీతి
    చక్కనైన మిత్రవరులు దక్కినంత
    తల్లిదండ్రి యాశయముల తనయుఁడౌచు
    వమ్ము జేయ కుండ కలల వాంఛదీర
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె!

    శార్దూలవిక్రీడితము
    సద్యస్ఫూర్తిని గల్గు మిత్రులమరన్ సావాస మేపార నై
    వేద్యంబంచును భక్తి వాణి కొసఁగన్ ప్రీతిన్ ప్రసాదంపు వై
    విధ్యంబౌ నిపుణత్వమున్ గురియగన్ విజ్ఞాన భాండమ్ముగన్
    విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో?

    రిప్లయితొలగించండి

  2. పెండ్లి వలదంచు నీవిట్లు పేచి పెట్ట
    నేల లక్షల లంచమ్ము నిచ్చి కాదె
    మంచి నౌకరిన్ గొంటి కుమార వినుము
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె.



    ఉద్యోగంబది లేక నూఢి యదియే యుక్తంబు కాదంచు నా
    డాద్యుల్ చెప్పిన యట్టి మాటలవినేనాలించి లంచంబు తో
    నుద్యోగమ్మును గొంటి గాదె యిక ప్రత్యూహమ్మదే వీడె గా
    విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో.

    రిప్లయితొలగించండి
  3. విద్య తెచ్చునుద్యోగము వేగిరమున
    వరునికుద్యోగ మున్నచో వధువు దక్కు
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె
    యనుచు వచియింత్రు పల్వురు ఘనులు మనకు

    సద్యోజాతుని పైనభక్తి మదిలో సంకల్పమైయుండగా
    నాద్యంతమ్ములు లేని వాని కృపతో నావిశ్వ విఖ్యాతుడౌ
    విద్యారణ్యుని యొద్దచేరి సరియౌ వేదాంత పాఠాలతో
    విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. విద్యాభ్యాసము సేయ వెళ్ళితివహో వేర్వేరు దేశాలకున్
      విద్యా వంతులు సెప్ప నీకు చదువున్ ప్రేమాభిమానాలతో
      సద్య స్ఫూర్తిని జూపుచున్ గురువులన్ సద్భక్తితో కొల్చి పల్
      విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో

      తొలగించండి
  5. ఎంత విత్తముండిన నేమి హితము, , పెండ్లి
    జేసు కొనెదమని దలచ జెలువ దొరక
    కుండె , తగినంతటి గడన కొరత కనుక ,
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె

    రిప్లయితొలగించండి
  6. కొలువులో చేరితిని కొన్ని నెలలమునుపె
    వేచితిని బహుకాల మీవేళ కొరకు
    వేగిరమ్మేలనే యమ్మ వియ్యమునకు
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె ?

    రిప్లయితొలగించండి
  7. విద్య నేర్చిన గల్గును సద్యశమ్ము
    వినయ సంపద యొనగూడు విద్య వలన
    నల్ప బుద్ధులు తలఁతురీ యవనియందు
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె

    రిప్లయితొలగించండి
  8. విద్యార్థీ! యిక చాలు నీ చదువు నీవింకేమి యోచింతువో
    సద్యోజాతముగా లభించె నిపుఁడే శస్తంబుగా కొల్వు, నీ
    వాద్యంతమ్ములు లేని విద్యకొరకై ప్రాయంబు వెచ్చింతువా?
    విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:వంట యింటి కుందేలుగ నుంట కాక
    యామె భావించె నాథునికాంగన యయి
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట, పెండ్లి కొఱకె
    నామె యాశల చదువుకే యడ్డ మగుచు.
    (కొరకె = కొరికి వేసినది.చదివి ఉద్యోగం చెయ్యాలి అనుకుంటే పెండ్లి ఆమె ఆశలని కొరికి వేసింది. )


    రిప్లయితొలగించండి
  10. చిరంజీవి సాకేత్ కు బహుశః 23 సం॥ లోపేనేమో. ఆస్థితిలో నేనుంటే నా సమాధానం ఈ పద్యమండి

    శా॥ విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో
    ఉద్యోగార్థముఁ బెండ్లి యాడుటకహో యుత్కృష్టమౌ రీతిగన్
    విద్యల్ గాంచఁగ నొప్పునే కనుము సద్విద్యానురాగమ్ముతో
    సద్యోజాతపు నిర్మలత్వమున నే శాస్త్రమ్ము శోధించెదన్

    శాస్త్రము Science n Technology
    (IITM విద్యార్థుల మొగ్గు కూడా ఇదేనండి కొంతవరకు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి పూరణ అండి

      విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లి కొఱకె
      యన సమంజసమగునొకో యరయ విద్య
      వేరు పెండ్లి వేరు జనులు విద్య సతము
      జీవనావధి వఱదాకఁ జేయ వలయు

      (అజరా అమరవాత్ ప్రాజ్ఞో విద్యాధనం సముపార్జయేత్ అనుకుంటాను, చిన్నప్పుడు చదివినట్టు గుర్తండి)

      తొలగించండి
  11. శా:"పద్య మ్మం దవధాని వై,మరియు భవ్యమ్మైన శాస్త్రాళి లో
    విద్యల్ నేర్చితివీవు, కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో
    పద్యానందుడ?" యంచు బ్రాశ్నికుడనన్ వాక్రుచ్చె నా సూరి "నే
    బద్య మ్మందు శతావధాని నయియే వాంఛింతు గార్హస్థ్యమున్".
    (చదువు, ఉద్యోగం అవధాన విద్య అన్నీ ఉండి పెళ్లెందుకు చేసుకో లేదు? అని నాగేశ్వర రావు గా రడిగితే శతావధానం కూడా చేసాక అని సాహిత్ అన్నట్లు. )

    రిప్లయితొలగించండి
  12. విద్య నేర్చియు విజ్ఞాన విదులు గాగ
    వెలుగు చుండగ మార్పు తో విదిత మ య్యె
    విద్య నేర్చి కొల్వు గొనుట పెండ్లి కొ ఱ కె
    యనుట సామాన్య మై యొ ప్పె నవని యందు

    రిప్లయితొలగించండి
  13. సంసరమ్ములు చర్విత చర్వణములు
    సాగు చుండును దరములు వేగముగను
    బుట్టి యంచితముగ నింకఁ బుడమిఁ బెరిఁగి
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లి కొఱకె


    విద్యాభ్యాసము చక్కఁ బూర్తి యయినన్ వీక్షింతు నంచంటివే
    యుద్యోగమ్ము లభింప నొప్పు నని నీ వుత్సాహివై పల్కితే
    చోద్యం బిప్పుడు సెప్ప నేమి కలదో శోధింపఁగా నేలయా
    విద్యల్ నేర్చితి వీవు కొల్వు దొరికెన్బెండ్లాడ జాగెందుకో

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    జీవనోపాధి కొఱకైన చేయవలయు
    కొలువు,విద్యావసరమది కొలువు చేయ
    పిదప యోచించగా వలె పెండ్లి గూర్చి
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లి కొఱకె.

    రిప్లయితొలగించండి
  15. సేద్యమ్మున్ గడు నిష్ఠతో సలుపుచున్ జేన్నైన పాఠ్యమ్ములన్
    ఉద్యోగమ్మున జేరినావు పనిలో నొప్పున్ వడిన్ జిక్కెగా
    సద్యస్ఫూర్తి వదానముల్ సలుపుచున్ సాధింతి ఖ్యాతిన్, ధృతిన్
    విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో

    రిప్లయితొలగించండి