7-7-2026 (మంగళవారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఆవకాయను రోసెద రాంధ్రజనులు”(లేదా...)“ఆవకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్”
తేటగీతిఅమృతమునకంటె ముందుగ నబ్ధిఁబుట్టిదేవవైద్యుడె జాడిలో తీర్చిపంచదివ్యమైనవె కోరెడున్ దృష్టిఁగలుగనావకాయను రోసెద రాంధ్రజనులుమత్తకోకిలజీవగర్రగ మెచ్చ వేల్పులు సృష్టి కర్త సమేతమైయావకాయ సుధాదియౌచును నద్భుతమ్ముగ నబ్ధిపైదేవవైద్యుఁడె జాడిలోనిడ, దివ్యమైనవె యెంచు వారావకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్
వేసవిని తినుచుండగ వేడిమియని నావకాయను రోసెద రాంధ్రజనులు ,మిగిలిన వరుసమంతయు మెచ్చుకొనుచు పెరుగు యన్నముతోడుత విడువరెపుడు
షడ్రుచుల భోజనమ్ము చేచాచు వారు కారముప్పులు కలిగిన కబళ మందు లేశమైనను ఖజపము లేని వేళ నావకాయను రోసెద రాంధ్రజనులు.చేవగల్గిన బోనమయ్యదె జీవితమ్మును పెంచునం చావకాయయె లేని బోనము నాంధ్రు డెవ్వడు మెచ్చ డే యావురావురు తిన్న నేమిర యాజ్య మించుక లేనిదే యావకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్.
ఆవకాయనాశించని యాంధ్రుడెవడు?అద్భుతంబని మెచ్చని యాంధ్రుడెవడు?మిన్నయగునట్టి భక్ష్యములెన్నియున్ననావకాయను రోసెద రాంధ్రజనులు!ఆవకాయ మహాద్భుతంబని యాంధ్రు లెల్లరుమెత్తురే!ఆవకాయరుచించలేదను యాంధ్రుడే కనరాడులే!జీవితాంతము వూరుగాయికి సిద్ధమయ్యెడి వారలే!ఆవకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్[ రోయు = వెదకు ]
ఆవకాయకు సరిసాటి యావకాయస్త్యానమయినను దానికి సాటి రాదుకల్లమాటలు పలుక నేనొల్ల, నెటులఆవకాయను రోసెద రాంధ్రజనులు?ఆవకాయను కోరి యాంధ్రులు యావగా భుజియింతురేజీవనౌషధమంచు భావన జేతురెల్లరు దీనినిన్దేవదానవు లావకాయను తృప్తిగా గొన నెట్టులీయావకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్?
సమస్య : "ఆవకాయను రోసెద రాంధ్రజనులు"గీ. ఆవకాయ సద్యోఘృతమన్నమునను గలపి సేవించి యమృతమున్గన్నడించు నట్టి తెలుగువారలనిట్టు లనగఁ దగునె "యావకాయను రోసెద రాంధ్రజనులు"
మత్త॥ ఆవకాయకు నోటి పూఁతల నాంధ్రుఁ డైనను దూరమైసేవకై పరదేశమేఁగఁగఁ జిత్ర మంచును మిత్రుఁడే యీవిధమ్ముగ హాస్య మాడఁగఁ నెంచి యచ్చట పల్కెనేఆవకాయను రోయు వారలె యాంధ్రులంచు గణించెదన్(నోటి పూత ఉంటే ఆవకాయ తినలేము కారము తినలేమండి)
తే.గీ: చిన్న రసము, తెల్ల గులాబి,శ్రేష్ఠ మైన నాటు కాయ,జలాలును నచ్చు గాని"యేదొ యొక కాయ లే!" యని యింత కలుపనావకాయను రోసెద రాంధ్రజనులు”(ఆవకాయ పెట్టటానికి కొన్ని రకాల మామిడి రుచిగా ఉంటాయి. ఏదో ఒకటి.అని పెడితే ఆంధ్రులకి నచ్చదు.)
మ.కో:ఆవకాయకు నిల్వ యుండెడు నట్టి కాయయు,పచ్చిగాచేవ గల్గియు,పీచు గల్గియు చేరగా వలె,శ్రేష్ఠమౌనావ , కారము లుండగా వలె నట్టి వేవియు లేని యాయావకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్”
కారము పయిఁ గరము మమకార ముండుఁ దెనుఁగు వారికిఁ బరికింపఁ దెల్లముగను గీ డొసంగును మితి మీఱ వీడుఁ డన్న నావకాయను రోసెద రాంధ్ర జనులు పోవ రెన్నఁడు సుంత యైనను ముట్టకుండఁగ భక్ష్యముం ద్రోవ లందును గార్య శాలలఁ దోఁట లందును వీడులన్ రేవు లందును గీము లందును రేపు మాపులు ప్రీతిమై యావకాయను రోయు వారలె యాంధ్రు లంచు గణించెదన్ [రోయు = వెదకు]
విశ్వ విఖ్యాత మై యొ ప్పి విమల మైన చవులు నూరించు నట్టిదై సకల జనుల మెప్పు నొందు పదార్థము న్ని ప్పు డె టుల నావకాయను రోసె ద రాంధ్ర జనులు?
కావలెన్ పెను విత్త మంచును కష్టముల్ బడి నిష్ఠతో పావనమ్మగు పేరు పొందిన భారతమ్మును వీడుచున్ వావిరంచు విదేశ వంటల భ్రాతి తో దిని దివ్యమౌఆవకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.పెండ్లి భోజనముల లోన పెట్టినారుముద్ద పప్పును కొద్దిగా ముందుగానెఆవకాయను నడుగగా నందులోకివేరు పచ్చడి తెచ్చిరి;వేయకున్ననావకాయను,రోసెద రాంధ్ర జనులు.
తేటగీతి
రిప్లయితొలగించండిఅమృతమునకంటె ముందుగ నబ్ధిఁబుట్టి
దేవవైద్యుడె జాడిలో తీర్చిపంచ
దివ్యమైనవె కోరెడున్ దృష్టిఁగలుగ
నావకాయను రోసెద రాంధ్రజనులు
మత్తకోకిల
జీవగర్రగ మెచ్చ వేల్పులు సృష్టి కర్త సమేతమై
యావకాయ సుధాదియౌచును నద్భుతమ్ముగ నబ్ధిపై
దేవవైద్యుఁడె జాడిలోనిడ, దివ్యమైనవె యెంచు వా
రావకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్
వేసవిని తినుచుండగ వేడిమియని
రిప్లయితొలగించండినావకాయను రోసెద రాంధ్రజనులు ,
మిగిలిన వరుసమంతయు మెచ్చుకొనుచు
పెరుగు యన్నముతోడుత విడువరెపుడు
రిప్లయితొలగించండిషడ్రుచుల భోజనమ్ము చేచాచు వారు
కారముప్పులు కలిగిన కబళ మందు
లేశమైనను ఖజపము లేని వేళ
నావకాయను రోసెద రాంధ్రజనులు.
చేవగల్గిన బోనమయ్యదె జీవితమ్మును పెంచునం
చావకాయయె లేని బోనము నాంధ్రు డెవ్వడు మెచ్చ డే
యావురావురు తిన్న నేమిర యాజ్య మించుక లేనిదే
యావకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్.
ఆవకాయనాశించని యాంధ్రుడెవడు?
రిప్లయితొలగించండిఅద్భుతంబని మెచ్చని యాంధ్రుడెవడు?
మిన్నయగునట్టి భక్ష్యములెన్నియున్న
నావకాయను రోసెద రాంధ్రజనులు!
ఆవకాయ మహాద్భుతంబని యాంధ్రు లెల్లరుమెత్తురే!
ఆవకాయరుచించలేదను యాంధ్రుడే కనరాడులే!
జీవితాంతము వూరుగాయికి సిద్ధమయ్యెడి వారలే!
ఆవకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్
[ రోయు = వెదకు ]
ఆవకాయకు సరిసాటి యావకాయ
రిప్లయితొలగించండిస్త్యానమయినను దానికి సాటి రాదు
కల్లమాటలు పలుక నేనొల్ల, నెటుల
ఆవకాయను రోసెద రాంధ్రజనులు?
ఆవకాయను కోరి యాంధ్రులు యావగా భుజియింతురే
జీవనౌషధమంచు భావన జేతురెల్లరు దీనినిన్
దేవదానవు లావకాయను తృప్తిగా గొన నెట్టులీ
యావకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్?
సమస్య : "ఆవకాయను రోసెద రాంధ్రజనులు"
రిప్లయితొలగించండిగీ. ఆవకాయ సద్యోఘృతమన్నమునను
గలపి సేవించి యమృతమున్గన్నడించు
నట్టి తెలుగువారలనిట్టు లనగఁ దగునె
"యావకాయను రోసెద రాంధ్రజనులు"
మత్త॥ ఆవకాయకు నోటి పూఁతల నాంధ్రుఁ డైనను దూరమై
రిప్లయితొలగించండిసేవకై పరదేశమేఁగఁగఁ జిత్ర మంచును మిత్రుఁడే
యీవిధమ్ముగ హాస్య మాడఁగఁ నెంచి యచ్చట పల్కెనే
ఆవకాయను రోయు వారలె యాంధ్రులంచు గణించెదన్
(నోటి పూత ఉంటే ఆవకాయ తినలేము కారము తినలేమండి)
తే.గీ: చిన్న రసము, తెల్ల గులాబి,శ్రేష్ఠ మైన
రిప్లయితొలగించండినాటు కాయ,జలాలును నచ్చు గాని
"యేదొ యొక కాయ లే!" యని యింత కలుప
నావకాయను రోసెద రాంధ్రజనులు”
(ఆవకాయ పెట్టటానికి కొన్ని రకాల మామిడి రుచిగా ఉంటాయి. ఏదో ఒకటి.అని పెడితే ఆంధ్రులకి నచ్చదు.)
మ.కో:ఆవకాయకు నిల్వ యుండెడు నట్టి కాయయు,పచ్చిగా
రిప్లయితొలగించండిచేవ గల్గియు,పీచు గల్గియు చేరగా వలె,శ్రేష్ఠమౌ
నావ , కారము లుండగా వలె నట్టి వేవియు లేని యా
యావకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్”
కారము పయిఁ గరము మమకార ముండుఁ
రిప్లయితొలగించండిదెనుఁగు వారికిఁ బరికింపఁ దెల్లముగను
గీ డొసంగును మితి మీఱ వీడుఁ డన్న
నావకాయను రోసెద రాంధ్ర జనులు
పోవ రెన్నఁడు సుంత యైనను ముట్టకుండఁగ భక్ష్యముం
ద్రోవ లందును గార్య శాలలఁ దోఁట లందును వీడులన్
రేవు లందును గీము లందును రేపు మాపులు ప్రీతిమై
యావకాయను రోయు వారలె యాంధ్రు లంచు గణించెదన్
[రోయు = వెదకు]
విశ్వ విఖ్యాత మై యొ ప్పి విమల మైన
రిప్లయితొలగించండిచవులు నూరించు నట్టిదై సకల జనుల
మెప్పు నొందు పదార్థము న్ని ప్పు డె టుల
నావకాయను రోసె ద రాంధ్ర జనులు?
కావలెన్ పెను విత్త మంచును కష్టముల్ బడి నిష్ఠతో
రిప్లయితొలగించండిపావనమ్మగు పేరు పొందిన భారతమ్మును వీడుచున్
వావిరంచు విదేశ వంటల భ్రాతి తో దిని దివ్యమౌ
ఆవకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పెండ్లి భోజనముల లోన పెట్టినారు
ముద్ద పప్పును కొద్దిగా ముందుగానె
ఆవకాయను నడుగగా నందులోకి
వేరు పచ్చడి తెచ్చిరి;వేయకున్న
నావకాయను,రోసెద రాంధ్ర జనులు.