25, జులై 2026, శనివారం

సమస్య - 5539

26-7-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జలమున మండి యనలమున శైత్యమునందెన్”

(లేదా...)

“జలమున మండి యగ్నిఁ బడి శైత్యమునందెఁ బయోరుహద్యుతుల్”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో జంధ్యాల సుబ్బలక్ష్మి గారి సమస్య)

13 కామెంట్‌లు:

  1. చిలిపిగ బాలుని బిలుచుచు
    విలక్షణపు వాక్యమొకటి వినిపించుమనన్
    తెలివిగ నెరిగించె నిటుల
    "జలమున మండి యనలమున శైత్యమునందెన్”

    రిప్లయితొలగించండి
  2. కలగని బాలుడు గాంచెను
    పలువురి తో పయన మైన పడవ కు కదలి న్
    కలిగి గిన ప్రమాదమున ను
    జలమున మండి యనలము న శైత్యము నం దె న్

    రిప్లయితొలగించండి

  3. లలనను వాలి చెఱగొనగ
    విలపించిన భానుజుండు పృథ్వీపతి యై
    వలకాడై చెలగె కనగ
    జలమున మండి యనలమున శైత్యమునందెన్.


    బలమది త్రగ్గె నంచు ప్రతి పక్షము జేరిన యట్టి నేతయే
    పలువిధ మైన నిందలను పాలక పక్షము పైన వేసి తా
    ఖలుడయి మారి పక్షమును కంటులనెన్ బ్రతి పక్షమున్ గనన్
    జలమున మండి యగ్నిఁ బడి శైత్యమునందెఁ బయోరుహద్యుతుల్.

    రిప్లయితొలగించండి
  4. చెలువము నారబోసితిని చెంతకు రమ్మిటు సుందరాంగ నీ
    తలపులు నిండె నామదిని తాపము నోపగ లేను మారునిన్
    ములుకు సుమాస్త్ర ఘాతములు ముప్పిరిగొన్నవి నేడదేలనో
    జలమున మండి యగ్నిఁ బడి శైత్యమునందెఁ బయోరుహద్యుతుల్

    రిప్లయితొలగించండి
  5. లలనను నినుఁ గోరితి నీ
    తలఁపులతో నా మనసున తాపము హెచ్చెన్
    కలిలము విరహము నోపక
    జలమున మండి యనలమున శైత్యమునందెన్

    రిప్లయితొలగించండి
  6. చం:కలచుచు చెర్వు నెల్ల వడగండ్లను రాల్చెను వాన, గొప్ప య
    గ్గుల గురిపించుచున్ పిడుగు కూడ బడెన్,గగనమ్మె కప్పుగా
    గల స్వనివాస మందె తమ కాలము చెల్లుట వర్ష మందునన్
    జలమున మండి యగ్నిఁ బడి శైత్యమునందెఁ బయోరుహద్యుతుల్”
    (కమలాలు జనం లోనే ఉన్నా వాటికి పైకప్పు అనే రక్షణ లేదు. ఆ జలం లోనే అవి పిడుగు మంటలు భరించాయి.జలం లో చల్లబడ్డాయి కూడా. )


    రిప్లయితొలగించండి
  7. చం॥ తొలకరి జల్లు తాకిడికి తూఁగఁగ నట్టుల డస్సి యుండఁగన్
    గలఁత గుడాక వేళ నిల గాసిలిఁ హెచ్చిన గ్రీష్మమందునన్
    దలఁపుల బాధ పొంగు తఱి తథ్యము కాంచితి స్వప్న మీవిధిన్
    జలమున మండి యగ్నిఁ బడి శైత్యమునందెఁ బయోరుహద్యుతుల్

    గుడాక నిద్ర

    (నిజంగా స్వప్నములో ఇలా చూసాను అని అండి. ఇలా కష్టపడి ఎండవేడికి తాళలేక చిన్న జల్లు పడినపుడు నిద్రలో కలలు రావడం సహజమేనండి)

    రిప్లయితొలగించండి
  8. కం:కలచగ బడబానలమే
    జలమున, మండి యనలమున, శైత్యమునందెన్”
    పలు సొగసుల దివి సీమయె
    కలుగగ నుప్పెనయు వర్షకాలము వరుసన్.
    (దివిసీమ ఉప్పెన మే నెల లో వచ్చింది. బడబానలం కూడా వచ్చింది. ఆ పిమ్నట వర్షకాలం వచ్చి చల్లదనం కూడా పొందింది.)



    రిప్లయితొలగించండి
  9. కందం
    పిలువని పేరంటమునకు
    వలదనఁ బతి వెడలి పత్ని భంగపడి వడిన్
    నిలువక పొగిలి నయన క
    జ్జలమున మండి యనలమున శైత్యమునందెన్

    చంపకమాల
    పిలువని పేరఁటమ్మనుచు విజ్ఞత నిల్పియు భర్త శూలి పో
    వలదన పుట్టినింటికది వర్తిలదంచును సాగి తండ్రి నిం
    దలను సహింపకే వడిగ తామరసాక్షియె కుంది నేత్ర క
    జ్జలమున మండి యగ్నిఁ బడి శైత్యమునందెఁ బయోరుహద్యుతుల్

    రిప్లయితొలగించండి
  10. అలవోక సేయ దృఢముగ
    సలసల కాఁగంగ నాయసపు గొడ్డలినిన్
    సలిలమ్మున వెస ముంచిన
    జలమున, మండి యనలమున, శైత్యము నందెన్


    కలువల మిత్రుఁ డైన నిసి కాంతుఁడు మెల్లగ నస్తమింపఁగా
    వలవల యేడ్వ ముడ్చికొని వాడఁగ రమ్యత రోత్పలమ్ములే
    చలనము లేక సుంత దివసమ్మున భాస్కరుఁ డంతఁ దోఁపఁగాఁ
    జలమున మండి యగ్నిఁ బడి, శైత్యము నందెఁ బయోరుహద్యుతుల్

    [తోఁపఁగాన్ + చలమున = తోఁపఁగాఁ జలమున; కలువలు యేడ్చుచుండ వాని (పయోరుహపు) వెలుగులు చల్లఁబడినవి] ]

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిలువని దక్ష హవనమునఁ
      గలిగిన హేళనమున సతి క్రందుచుఁ బడెనిం
      గిలమున దేహము విడువన్
      జలమున మండి యనలమున శైత్యమునందెన్

      [విడువన్ + చలమున = విడువన్ జలమున; చలము = పరితాపము]


      పిలువక పోయినన్ వెడలె వేడ్కను జూడదలంచుచున్ ననం
      తలయుని ధర్మపత్ని సతి దక్షుని సద్మము యజ్ఞవాటిలో
      కలిగిన భంగపాటునకుఁ గ్రందుచు దూకెను కుండమందునన్
      జలమున మండి యగ్నిఁ బడి శైత్యమునందెఁ బయోరుహద్యుతుల్

      [కుండమందునన్ + చలమున = కుండమందునన్ జలమున]

      తొలగించండి
  12. విలయము సంభవ మొందిన
    జలమంతయు వేడియగుచుఁజదలన్ దాకన్
    బలుచని వాయువు సోకగ
    జలమున మండి యనలమున శైత్యమునందెన్”

    రిప్లయితొలగించండి