4, జులై 2026, శనివారం

సమస్య - 5518

5-7-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యమల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు”
(లేదా...)
“పద్యంబల్లుట రానివాఁడె సుకవిత్వంబల్లు మెచ్చన్ జనుల్”

12 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వ్యాకరణశుద్ధి మెరిసెడు పాటవమ్ము
    దైవకృప వల్ల నమరిన దక్షుఁడతడు
    ప్రీతిఁ గూర్చెడు వాడనఁ, బేలవముగఁ
    బద్యమల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు

    శార్దూలవిక్రీడితము
    ఖాద్యమ్మన్నది సాత్వికమ్మనఁగఁ దాఁ గన్పించి శాంతమ్ముగన్
    విద్యన్నేరిచి భావజాలములతో వేనోళ్లు కీర్తింపఁగన్
    హృద్యమ్మై కవిపండితుల్ మిగుల మన్నింపంగ నిస్సారమౌ
    పద్యంబల్లుట రానివాఁడె సుకవిత్వంబల్లు మెచ్చన్ జనుల్

    రిప్లయితొలగించండి
  2. ఛందమును నేర్వ కుండిన చందమందు
    గాన రూపము నొందిన కణినొసగెడు
    పద్యముల రుచి మరగిన బాలుడొకడు
    పద్యమల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు

    రిప్లయితొలగించండి

  3. అన్నమయ్య సంకీర్తన లద్భుతమ్ము
    లంచు పొగుడుచుందురు గదా యవని జనులు
    కాంచ జనవంద్యు డైన యా కవిని చూడ
    పద్యమల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు.


    గద్యం బైనను వ్రాయలేని కడు మూర్ఖాగ్రేసరుం డాతడే
    విద్యా హీనుడు భీరుకమ్ము జనుచున్ వేటాడు సారంగుడే
    హృద్యంబౌ రఘురామ గాథ నతడే యీజాతి కిచ్చెన్ గనన్
    పద్యంబల్లుట రానివాఁడె, సుకవిత్వంబల్లు మెచ్చన్ జనుల్.

    రిప్లయితొలగించండి
  4. పద్య మందున చక్కని భావమలర
    హృద్యమందురు గాదె సహృదయులెపుడు
    హృద్య రచనా విభుడు రసహీనమైన
    పద్యమల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు

    పద్యంబల్లుట నేర్చువాడు కవియౌ భావంబు శోభిల్లగా
    పద్యాలే కమనీయమౌను సతమున్ బాండిత్య సంపత్తినా
    విద్యాదేవి యొసంగ సత్కవివి నీవే దోషభూయిష్ఠమౌ
    పద్యంబల్లుట రానివాఁడె సుకవిత్వంబల్లు మెచ్చన్ జనుల్

    రిప్లయితొలగించండి
  5. శా॥ హృద్యంబై తనరన్ గవిత్వమున నెన్నెన్నో విధమ్ముల్ గనన్
    గద్యంబెంచిన పానుగంటి కవితా గాంభీర్య మొప్పెన్ గదా
    సద్యస్ఫూర్తిని నొక్కడావిధి యశస్సంపన్నుఁడై పల్కెనే
    పద్యంబల్లుట రాని వాఁడె సుకవిత్వంబల్లు మెచ్చన్ జనుల్

    రిప్లయితొలగించండి
  6. తే.గీ:భావశూన్యమై గణముల, బ్రాస,యతుల
    బట్టి పెద్ద కొడుకు వ్రాయు పద్యములను
    వచనకవిత గొప్పగ చిన్న వాడు వ్రాయు
    పద్యమల్లఁడు, సత్కవిత్వమ్ముఁ జెప్పు”

    రిప్లయితొలగించండి
  7. శా:పద్య మ్మేదియొ మొన్న నేర్చుకొని నా పద్యమ్ములన్ బట్టుకన్
    విద్యా హీనుడ! తప్పు బట్టెదవె యీ వేదిన్ !కవిత్వార్థ సం
    వేద్యుం డీ ధనికొండ,పండితునిగా వెల్గొందు,నీ ముందటన్
    పద్యంబల్లుట రానివాఁడె? సుకవిత్వంబల్లు మెచ్చన్ జనుల్
    (ఎవడో నిన్న కాక మొన్న పద్యం నేర్చుకొని నన్ను తప్పు పట్టినట్లు భావించి చేసిన పూరణ. )

    రిప్లయితొలగించండి
  8. వినుత గంభీర భావము విగత మైన
    శుద్ధ శబ్ద లాలిత్యము శూన్య మైన
    భాషఁ బరికింపఁ జక్కని శ్లేష లేని
    పద్య మల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు


    విద్యా భోగము పూర్వ పుణ్య ఫలమే వీక్షింప నెవ్వారికిం
    జోద్యం బెవ్విధిఁ గాంచ లేము సుమి సంశోధింప సుంతైన సం
    వేద్యంబౌ నిది కాళిమాత దయ ప్రాప్తింపంగ నెన్నండునుం
    బద్యం బల్లుట రాని వాఁడె సుకవిత్వం బల్లు మెచ్చన్ జనుల్

    రిప్లయితొలగించండి
  9. ప్రతిభ లను గలిగిన వాడై భాసిత ముగ
    పద్యముల నల్లు కవియయి పరిణ తి గను
    వలసిన విధము గా నల్లు భావ రహిత
    పద్య మల్లడు సత్కవి త్వ మ్ము జెప్పు

    రిప్లయితొలగించండి
  10. సేద్యమ్మున్ బొనరించుచున్ పఠనమున్ క్షేత్రమ్ములన్ దీక్షతో
    హృద్యమ్మౌగతి గీతముల్ వచనమున్ హేలౌ గతిన్ వ్రాయుచున్
    గద్యమ్ముల్ రచియించి యున్నతిని, ప్రఖ్యాతుండు నై ఛందమున్
    పద్యంబల్లుట రానివాఁడె సుకవిత్వంబల్లు మెచ్చన్ జనుల్

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వచన కవితలు నవరస భరితముగను
    వ్రాయు, తప్పకుండ యతులు,ప్రాసలవియు
    గణము లందున భంగము కలుగు రీతి
    పద్య మల్లడు,సత్కవిత్వమ్ముఁ జెప్పు.

    రిప్లయితొలగించండి
  12. తనయు లిద్దరు గలరు సద్ధర్మపరులు
    పెద్ద వాడు వచనకవి ముద్దుగాను
    పద్యమల్లడు , సత్కవిత్వంబుజెప్పు
    చిన్నవాడుపద్యములోనచెలువముగను.

    రిప్లయితొలగించండి