5, జులై 2026, ఆదివారం

సమస్య - 5519

6-7-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“త్రాగినట్టివాఁడె ధన్యజీవి”
(లేదా...)
“త్రాగినవాని జీవితమె ధన్యమగున్ భువిలోనఁ జూడఁగన్”

22 కామెంట్‌లు:

  1. తాను వలచి నట్టి తరళలోచన తోడ
    బెండ్లి జరిగి నంత , పేర్మి నొంది
    యాలి ముద్దు నొంది యధరామృ తంబును
    త్రాగినట్టివాఁడె ధన్యజీవి

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    రామనామమెపుడు ప్రాణసమమయిన
    నాంజనేయుఁడయ్యె నమరజీవి
    విధిగ రామనామ సుధ భక్తి యుతముగన్
    ద్రాగినట్టివాఁడె ధన్యజీవి!

    ఉత్పలమాల
    సాగెను నిత్యమున్ హనుమ సద్గుణ సోముని రామనామమున్
    ప్రేగుల ప్రాణమంచును స్మరించుచుఁ దాఁ జిరజీవిగన్ మనెన్
    రాగముమీర భక్తిగను రాముని నామ సుధారసమ్మునే
    ద్రాగినవాని జీవితమె ధన్యమగున్ భువిలోనఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి

  3. మహిని జూడ నదియె మహిమన్వితమ్మని
    శమమొసంగు నట్టి సాధన మని
    రామ రామ యనెడి నామామృతమ్మును
    త్రాగినట్టివాఁడె ధన్యజీవి.


    భోగము లన్న రోయుచు విముక్తి నొసంగు నటంచు భక్తితో
    నా గిరిజా పతిన్ హృదయమందున నిల్పుచు కొల్చు టొక్కటే
    యోగముగా దలంచుచు నయోనిజు నామ సుధారసమ్ము నే
    త్రాగినవాని జీవితమె ధన్యమగున్ భువిలోనఁ జూడఁగన్.

    రిప్లయితొలగించండి

  4. *(సరదా కోసము పూరణ)*

    ఊరి లోన యున్న సార కల్లుల ద్రావి
    మత్తు లోన తూలు మనిషి కన్న
    ధీటు గాను పరుల దేశంపు మద్యమున్
    త్రాగినట్టివాఁడె ధన్యజీవి.


    బోగపు వాడలన్ దిరుగు మూర్ఖులు మద్యము త్రాగి మత్తుతో
    వాగెడి వారికంటె ధర వాసిగ నున్నను భీతి చెందకన్
    రాగము తోడ మిత్రుడు పరాయి విలాయతి మద్య మిచ్చినన్
    త్రాగినవాని జీవితమె ధన్యమగున్ భువిలోనఁ జూడఁగన్.

    రిప్లయితొలగించండి
  5. దాశరథిని మదిని తలచుచున్న యెడల
    ప్రాప్తమగును పుణ్య ఫలము రామ
    రామ యనుచు రామ నామామృతంబును
    త్రాగినట్టివాఁడె ధన్యజీవి

    ఆగుణధామునిన్ దశరధాత్మజునిన్ నిరతంబు గొల్చుచున్
    సాగుచునున్న దాసుడయి సంతతమా రఘురామ నామమున్
    రాగము మీఱఁ బేర్కొనుచు రామపరాత్పర నామ కంజమున్
    ద్రాగినవాని జీవితమె ధన్యమగున్ భువిలోనఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  6. హరిని గొల్చినంత హరియించు పాపముల్
    పరమునొసఁగు మేటి వరముగాను
    నల్లవేల్పు దివ్య నామామృతమ్మును
    త్రాగినట్టివాఁడె ధన్యజీవి

    ఆగక నెల్లవేళల మహా విజితాత్ములఁ జేరి భక్తితో
    రాగము వైరమున్ విడచి ప్రాగహరమ్ముగ గొల్వ శ్రీహరిన్
    భోగము భాగ్యమిచ్చు ననుమోదముతో హరినామ పేత్వముం
    ద్రాగినవాని జీవితమె ధన్యమగున్ భువిలోనఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      "ఆగక యెల్లవేళల.." అనండి.

      తొలగించండి
  7. ఆ॥ త్రాగెడు మనుజులకు త్రాగని నరుఁడొక
    మూర్ఖుఁడనుట మిగుల ముదముఁ గూర్చుఁ
    ద్రాగు సమయమందుఁ దప్పక పలుకరె
    త్రాగినట్టి వాఁడె ధన్యజీవి

    ఉ॥ త్రాగని వాఁడు విందులను తప్పక నొంటరి నేఁడు తెల్పఁగన్
    మూగుచుఁ ద్రాగు వారలటు మోదము మీరఁగ విందులందునన్
    వాగరె తాము గొప్పయని వ్యర్థుఁడు జీవియె త్రాగకున్నచోఁ
    ద్రావిన వాని జీవితమె ధన్యమగున్ భువిలోనఁ జూడఁగన్

    (ఇది సత్యమండి. అందునా త్రాగే వారు మీ పై అధికారులైతే మరీ చులకన చేయడం సహజం)

    రిప్లయితొలగించండి
  8. ఆ.వె:నిక్క, మమృత మనగ నీ నవ్వె ఓ భామ!
    కన్ను లనెడు రెండు గిన్నెల గొని
    మనము నిండు నట్లు మరి మరి తృప్తిగా
    త్రాగినట్టివాఁడె ధన్యజీవి

    రిప్లయితొలగించండి
  9. ఉ: త్రాగని యట్టి లోభి యొక ధర్మము జేసిన యట్లు మద్యమున్
    ద్రాగెడు వాని దిట్టు గద! త్రాగెడు వారలు సొమ్ము నంతటిన్
    త్యాగము జేయ గాదె ప్రభుతల్ నడిపించుచు నుండె పాలనన్!
    త్రాగినవాని జీవితమె ధన్యమగున్ భువిలోనఁ జూడఁగన్”

    రిప్లయితొలగించండి

  10. నామజపము సతము నీమంబుగమదిని
    సలుపువాడె పరమసజ్జనుండు
    పరవశమున మధురభక్త్యమృతరసము
    త్రాగినట్టివాడె ధన్యజీవి


    సాగుచు భక్తిమార్గమున సద్గురుబోధలసారమందుచున్
    రాగము,ద్వేషముల్ విడచి రామపదాంబుజచిత్తుడౌచు స
    ర్వాగమ సారమౌ మధురభక్తిరసమ్మును మానసంబునన్
    త్రాగినవానిజీవితమె ధన్యమగున్ భువిలోన జూడగన్

    రిప్లయితొలగించండి
  11. భక్తి భావము నను భవుని భజించుచు
    నిత్య పూజ సల్పు నిర్మ లుండు
    వాంఛి తముగ తానుభక్తి రసము
    త్రాగి నట్టి వాడె ధన్యజీవి


    భక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "భక్తియను రసము" అంటే సరి.

      తొలగించండి
  12. ఆగము నొందు జీవితము లాటవెలందుల సంగడమ్మునన్
    త్యాగము జేయుచున్ బ్రతుకు, దారకు ప్రేమనొసంగి, యిచ్చతో
    భోగములందు తేలుచును ముర్మురు కేళిని మోవితేనియల్
    ద్రాగినవాని జీవితమె ధన్యమగున్ భువిలోన జూడగన్

    రిప్లయితొలగించండి
  13. మఱచి పోయి తాను మర్మమ్ము లెల్లను
    మద్య మొసఁగి నట్టి మత్తు లోన
    నిజము లెల్లఁ బలుక నిశ్శంక నిత్యము
    త్రాగి నట్టి వాఁడె ధన్య జీవి


    భోగములం ద్యజించి కడు మోహ మొసంగెడు ప్రాణ హానియౌ
    త్రాగుడు మాని శ్రీ హరి పదద్వయ చింతన నామ డోల లం
    దూఁగుచు సంతతమ్ము పురుషోత్తమ భక్తి రసామృతమ్మునుం
    ద్రాగిన వాని జీవితమె ధన్య మగున్ భువి లోనఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  14. సమస్య : "త్రాగినట్టివాఁడె ధన్యజీవి"

    ఆ. అలవుబలిమియందమైశ్వర్యవిభవము
    లచిరమవియె యొసగ వాత్మశాంతి
    రాగరహితుడగుచు రామనామసుధను
    త్రాగినట్టివాఁడె ధన్యజీవి

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    రామ నామ మెపుడు రమ్యమైన దనుచు
    నిరతము జపియించి నిష్ట తోడ
    రామ రామ యనెడు నామామృతమ్మును
    త్రాగినట్టి వాడె ధన్య జీవి.

    రిప్లయితొలగించండి