10, జులై 2026, శుక్రవారం

సమస్య - 5524

11-7-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివునిఁ బూజింపనొప్పు మసీదునందు”
(లేదా...)
“శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ”

18 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      శివములన్ శుభముల గూర్చ శివుడనెదరు
      మంగళకరుడల్లా యన మలకలెల్ల
      నిత్యమున్ ప్రార్థనలవేళ నీమమెంచి
      శివునిఁ బూజింపనొప్పు మసీదునందు

      చంపకమాల
      శివములనన్ శుభమ్ములనఁ జిందఁగవాటి శివుండటందురే
      స్తవముల నా రహీముఁగని సాంత్వనఁ బొందఁగ వేడుచుండగన్
      శివము మహమ్మదీయులకుఁ జిందును! వాడె శివుండు! వార లా
      శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ!

      తొలగించండి
  2. హిందువులు దేవళము నందు హితము కోరి
    శివునిఁ బూజింపనొప్పు ; మసీదునందు
    తురకలు నమాజు సలుపును తొరలు రీతి
    వారి విధములు వేరయ్యు పరమమొకడె

    రిప్లయితొలగించండి

  3. అది మహమ్మదీయుల ప్రార్థనాలయమని
    యెఱుగకనె వచించితి వేమొ హిందు వటకు
    నేగు నెట్లు చెప్పె నెవడు నీకు? నెచట
    శివునిఁ బూజింపనొప్పు మసీదునందు?


    వివరిణు డెవ్వడో పలుక వింటివి కాని మసీదటం చనన్
    యవనుల ప్రార్థనాలయమటంచు నెఱంగియు వెఱ్ఱి వాడవై
    ధవలపు ద్రావకమ్ము కలు ద్రావి వచించితి వియ్యదెచ్చ టన్
    శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ.?

    రిప్లయితొలగించండి
  4. ఇందునందను సంశయమేల నీకు
    దేవుని యునికి లేని ప్రదేశమేది
    జగతి నెచ్చటైనను పూజ సలుపవచ్చు
    శివునిఁ బూజింపనొప్పు మసీదునందు

    శివుని పవిత్రతన్ దలచి చిన్మయ రూపుని దివ్యలింగమున్
    శవములఁ గాల్చుచోటగు శ్మశానము నందునఁ జూచి వెంటనే
    శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ
    నవనిని యంచు పల్కెనట నాయవనుండు విశేషరీతినిన్

    రిప్లయితొలగించండి
  5. భువనము నందు కీర్తియును పూర్ణ సుఖంబులు పొంది పిమ్మటన్
    భవములు పాయజేయుటకు భక్తుల కొప్పును భక్తి తోడుతన్
    శివునకు బూజసేయగ మసీదొకటే తగినట్టి స్థానమౌ
    యవనుల కెప్పుడేనియును నాదట కొల్వగ వారి దేవునిన్

    రిప్లయితొలగించండి
  6. భక్తితో హిందువులు గూడి పరవశమున
    శివునిఁ బూజింపనొప్పు, మసీదునందు
    జేరి ముస్లిము సోదరుల్ చిత్తమలర
    వల్లెవేయుదురు ఖురాను భక్తి గదుర

    రిప్లయితొలగించండి
  7. ఎవరి మతమ్ము వారలకు నేర్పరచున్ దగు భక్తిమార్గమున్
    శివమును గూర్చు హిందువులు చిత్తమునందున భక్తితోడనా
    శివునకుఁ బూజ సేయఁగ, మసీదొకటే తగినట్టి స్థానమౌ
    శ్రవణమొనర్ప ముస్లిములు శ్రద్ధగ బల్కు ఖురాను సూక్తులన్

    రిప్లయితొలగించండి
  8. చం॥ సవినయ సంపదల్ గనుచు సర్వులు నొక్కటి యన్న చింతనే
    భువిని జనాళి కాంచి నిజబుద్ధినిఁ దాల్చఁగ భేదముండునే
    భవిత వెలుంగుఁ గోవెలలు వారివి వీరివనంగఁ జెల్లునే
    శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ

    (ఎలాగు అల్లా అంటే సంస్కృతార్థము పరమేశ్వరుడు తల్లి కదండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి పూరణ అండి

      ఇందు గలడందు లేడని యెవరనిరొకొ
      ఈశుఁడుండని చోటేది యిది యెఱుఁగమె
      యెచట నుండిన నచటనె రుచిగ కొలుచు
      శివునిఁ బూజింప నొప్పు మసీదునందు

      తొలగించండి
  9. అన్ని చోటుల వ్యాపించు హరుని గూర్చి
    యెచ్ఛ టైనను పూజింప వచ్చు నంద్రు
    స్వీకరించును పూజల ప్రీతి గాను
    శివుని పూజింప నొప్పు మసీదు నందు

    రిప్లయితొలగించండి
  10. *శంకరాభరణం సమస్యాపూరణం*
    చంపకమాల.
    స్తవముల షిర్డి చేరుకొని సాధన చేసిన భక్త మేఘుడా
    నవవిధ భక్తి మార్గముల, నమ్మిన యీశునిఁ గాంచి సాయిలో,
    శివశివ యంచు నెంచెఁ గడు శ్రేష్టముగాఁ దనకండ్లు చూచు నా
    *శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ.*

    (మేఘశ్యాముడనే శివభక్తుడు షిర్డీ సాయిబాబాలో శివుని చూసి అభిషేకం చేసిన వృత్తాంతం)

    రిప్లయితొలగించండి
  11. అవనిఁ దురకల దైవము శివము లొసఁగు
    నా తురుష్కులకుఁ గనుక నతని శివుఁ డ
    నంగ నొప్పు భక్తిని నంతరంగ మందు
    శివునిఁ బూజింప నొప్పు మసీదు నందు


    అవని శివార్చ నార్హము లనంతము లయ్య గణించి చూడఁ గా
    నివి పరికింప శూన్యములె నిక్కముగా వల దిందు శంకలే
    చెవులకుఁ గంటకమ్ము లివి చెప్పిన మానవుఁ డే తురుష్కుఁడో
    శివునకుఁ బూజ సేయఁగ మసీ దొకటే తగినట్టి స్థానమౌ

    రిప్లయితొలగించండి
  12. అవిరలమైన వర్షము రయమ్మున గూల్చ మసీదు గాలిచే
    భవుని పురాతనంపు గుడి వ్యక్తము గాన్ శివలింగ మచ్చటన్
    ప్రవిమల బుద్ది ముస్లిములు స్వాగతమంచు వచించ మైత్రితో
    శివునకుఁ బూజసేయగ మసీదొకటే తగినట్టి స్థానమౌ

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ!

    చ.మాల :

    అవిసిన ప్రాణ మున్నిలుప డాతఁడెయంచు త్రిపాత్తు గొల్వగన్ !
    అవిరళ భక్తితోడుతను నా హర సర్వ చరాచరుండనే
    సవినయ నిర్మలాత్ముడయి స్థానము లెంచక పూర్ణచిత్తమున్
    శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ!
    భవుడును నిల్చె హజ్ మదిని భక్తిని బూజలు సేయ వింటిలే

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ప్రతి దినంబు వెడలుచు దేవాలయమున
    శివునిఁ బూజింప నొప్పు; మసీదునందు
    మంచిగాను ముస్లిములు నమాజు చేసి
    ప్రార్ధనల్ చేతు రల్లాను పరవశించి.

    రిప్లయితొలగించండి