విశ్వ మెల్లను కాచు ఈశుని వేడు కొంచును భక్తితో విశ్వ శాంతిని కోరు చుండెడు విశ్ర మించని బాపునున్ విశ్వ సించక కాల్చి చంపెగ భీకరంబుగ నాథురామ్ విశ్వమానవ సేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే
తే.గీ:షిరిడి సాయి మందిరమున సేవ జేసి యన్నమును జాతి చూడక నంద జేయ నన్ను హిందూ విరోధి వం చనె నొకండు విశ్వమానవసేవయే వేదన నిడె” (ఈ మధ్య కాలం లో హిందుత్వ వాదం మితి మీరి సాయి బాబా గుడికి పోవటం హిందూ మతానికి వ్యతిరేక మని ప్రచారం చేస్తున్నారు. )
తే॥ పేదలకు సేవఁ జేయఁగఁ బేరిమిఁ గని పరఁగు చుండు వారల నుగ్ర వాదుల ప్రతి ఘటన యడ్జు కొనఁగ నయ్యొ కలగ మిగిలె విశ్వ మానవ సేవయే వేదన నిడె
మత్త॥ నశ్వరమ్మని జీవితమ్మిల నమ్మి సేవల నెంచఁగన్ నిశ్వసించిరి యుగ్రవాదులు నీతి వీడుచు సర్వదా శశ్విదాసులు దుష్ట బుద్థిని సాగనీయకఁ బోవఁగన్ విశ్వ మానవ సేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే
శశ్విదాసుడు పాపి (నేడు ఉగ్రవాదులొకరకంగా దేశాల మధ్య యుద్ధం మరొకరకంగా శోషిత పీడిత జనులకు సాయమందకుండా అడ్డుకుంటున్నాయండి)
మనసు కోరెడు రీతిగ మనెదననగ
రిప్లయితొలగించండివయసు మీరిన కతమున వలనుకాక
వాడుకగ సలుపు చుండెడి పనియయినను
విశ్వమానవసేవయే వేదన నిడె
కాశీ'విశ్వ'నాథునితో ఒక దేశభక్తుడు:
రిప్లయితొలగించండితేటగీతి
తెల్లవారలు భారతదేశము విడ
శాంత్యహింసల సాధింప జాతిపితగ!
కాని వాడని నాథురాం కాల్చనకట!
విశ్వ! మానవసేవయే వేదన నిడె
మత్తకోకిల
ఈశ్వరున్దలఁదాల్చి గాంధి యహింస, సత్యము లెంచుచున్
శాశ్వతమ్ముగఁ బంపె మ్లేచ్చుల జాతికే పితరుండనన్
నశ్వరమ్మని వారిబాటయె 'నాథురామ్' కసి కూల్చెనే!
విశ్వ!మానవసేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి:
రిప్లయితొలగించండిరంతిదేవునికీవి నరకమొసగెనె?
అభవమందజేసె హరియె యంత్యమందు!
పాటులేమిజేసె పరమభాగవతుల?
విశ్వ మానవ సేవ 'యే' వేదననిడె?
రిప్లయితొలగించండిబానిసత్వమున్ మ్రగ్గెడి భరత జాతి
స్వేచ్ఛ గోరి నాడట సమ్మె చేసి నట్టి
కరముచందు గాంధి నొకడు కాల్చి చంపె
విశ్వమానవసేవయే వేదన నిడె.
శాశ్వతమ్మగు స్వేచ్ఛ గోరుచు సమ్మె జేసిన గాంధియే
విశ్వమందు మతాంత రమ్ముల భేదమెంచకు మంచనే
నిస్వనమ్మది నచ్చదంచును నిష్ఠురుండట కాల్చెనే
విశ్వమానవసేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే.
విశ్వమిత్రులై తనరారు వేదవిదులు
రిప్లయితొలగించండివిశ్వశాంతికి బాటలన్ వేసిరి గద
విశ్వమానవసేవయే! వేదన నిడె
విశ్వకద్రుల కలహాలు పెచ్చురేగ
నశ్వరంబగు జీవితమ్మని నాడు తల్చిన మౌనులే
విశ్వశాంతికి దూపటిల్లిన వేళ సల్పిరి చక్కనౌ
విశ్వమానవసేవ; మిక్కిలి వేదనన్ మిగిలించెలే
విశ్వకద్రులు మాటిమాటికి విచ్చుకత్తులు దూయగా
విశ్వ మెల్లను కాచు ఈశుని వేడు కొంచును భక్తితో
రిప్లయితొలగించండివిశ్వ శాంతిని కోరు చుండెడు విశ్ర మించని బాపునున్
విశ్వ సించక కాల్చి చంపెగ భీకరంబుగ నాథురామ్
విశ్వమానవ సేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే
తే.గీ:షిరిడి సాయి మందిరమున సేవ జేసి
రిప్లయితొలగించండియన్నమును జాతి చూడక నంద జేయ
నన్ను హిందూ విరోధి వం చనె నొకండు
విశ్వమానవసేవయే వేదన నిడె”
(ఈ మధ్య కాలం లో హిందుత్వ వాదం మితి మీరి సాయి బాబా గుడికి పోవటం హిందూ మతానికి వ్యతిరేక మని ప్రచారం చేస్తున్నారు. )
తే॥ పేదలకు సేవఁ జేయఁగఁ బేరిమిఁ గని
రిప్లయితొలగించండిపరఁగు చుండు వారల నుగ్ర వాదుల ప్రతి
ఘటన యడ్జు కొనఁగ నయ్యొ కలగ మిగిలె
విశ్వ మానవ సేవయే వేదన నిడె
మత్త॥ నశ్వరమ్మని జీవితమ్మిల నమ్మి సేవల నెంచఁగన్
నిశ్వసించిరి యుగ్రవాదులు నీతి వీడుచు సర్వదా
శశ్విదాసులు దుష్ట బుద్థిని సాగనీయకఁ బోవఁగన్
విశ్వ మానవ సేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే
శశ్విదాసుడు పాపి
(నేడు ఉగ్రవాదులొకరకంగా దేశాల మధ్య యుద్ధం మరొకరకంగా శోషిత పీడిత జనులకు సాయమందకుండా అడ్డుకుంటున్నాయండి)
మ.కో: "విశ్వ మానవు" నంచు నెల్లరు వేదమున్ బఠియించు డం
రిప్లయితొలగించండిచశ్వధాటిని బోధ జేసితి వయ్య బ్రాహ్మణు లెల్లరున్
విశ్వసించక నీదు సేవను విప్రశత్రుని వంటి రో
విశ్వమానవ! సేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే!
(అందరితో వేదం పఠింప జేస్తా నని ఒక బ్రాహ్మణుడు విశ్వమానవత్వం చూపితే అతణ్ని కొందరు బ్రాహ్మణులు బ్రాహ్మణ విరోధి అన్నారు. )
మనవాళి ని ప్రేమించు మనుజు లగుచు
రిప్లయితొలగించండిసర్వ హితమును గోరుచు సమత మమత
పెంచు వారలు గా నుండ ప్రీతి యెటు ల
విశ్వ మానవ సేవయే వేదన నిడె?
నీతు లందు విశ్వాసము చూత మన్న
రిప్లయితొలగించండిలేక యున్నఁ గరుణ సుంత లేక యున్న
నేఁడు స్వార్థమే మితిమీఱ నిండుకొనఁగ
విశ్వ మానవ సేవయే వేదన నిడె
స-శ ప్రాసకు లక్ష్యముగా. ఈ ప్రాస కుమార సంభవము, భాగవతము, శ్రీకృష్ణాతి మానుష తత్త్వములలోఁ బాటింపఁ బడినది.
భాస్వరమ్మను బోలి మండెఁ బ్రపంచ దేశము లక్కటా
నశ్వరం బగు నిట్టు లున్న ఘనప్రపంచము సర్వమున్
శాశ్వతమ్మని నమ్మి రాజ్యము సర్వ దుర్గుణ సార్వభౌ
మేశ్వరుల్ కట మిన్నకుండిన నెల్ల చోటులఁ గల్ల కా
విశ్వ మానవ సేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
భరత జాతికి బానిసత్వమ్ము తొలగ
శాంత్యహింసలతో సమ్మె జరిపినట్టి
గాంధిని తుదకు నొక్కడు కాల్చి చంపె
విశ్వ మానవ సేవయే వేదన నిడె.