చం: పలువిధతర్కముల్ సలుపు వాడొక డిట్లనె "శంకరుండు బౌ ద్ధుల నశియింప జేయ గడు ధూర్తకుతర్కము జేసె, కాచ వి ప్రుల నలు పీఠముల్ నిలిపె బో! కుల తత్త్వము నిల్ప గోరు నా కలుషితచిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్”
(ఈనాటి కొందరు హేతువాదులకు,నాస్తికులకు బుద్ధుని పై అభిమానము, శంకరుల పై ద్వేషము ఉన్నాయి. శంకరుడు బ్రాహ్మణవర్గాన్ని కాపాడటానికి, బౌద్ధాన్ని నాశనం చెయ్యటానికి మాత్రమే ప్రయత్నించా డనేది వారి విమర్శ.)
కందం
రిప్లయితొలగించండివెలయఁగ సర్వులకు శుభముఁ
బలికె జగద్గురుడు దివ్య భగవద్గీతన్
దలఁప గురుపరంపరను న
కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్
చంపకమాల
తెలియని మూఢులన్ దెలివి తేటల దారికి తెచ్చి, వారిలోఁ
గలిగిన పాపవాసనల కల్మషమున్ దమయందు దాల్చుచున్,
జెలువగు జ్ఞానదీపమును జేపడఁ జేసెడు నట్టివారలై
కలుషితచిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్!
అలవాటయినటుల దనకు
రిప్లయితొలగించండితెలిసిన దంతయు నిజమను దీరుగ దానిన్
పలువురి కెటులైన తెలుప
కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్
(1)తలతురు గొప్పవారమని ధర్మ విదూరులు కర్మ భ్రష్టులై;
రిప్లయితొలగించండివిలువలు లేనివాడొకడు వెర్రిగవాగుచు రెచ్చిపోగ నో
ఖలుడికవాణ్ణిజేరి కలికాల ప్రభావముగూడ నిట్లనెన్..
కలుషిత చిత్తులే కద జగద్గురువుల్,
పరికించి చూచినన్!
(2)
తలచుట సాధ్యమాయతుల ధర్మము, జ్ఞానము,స్వాత్మనిష్ఠలన్
కలియుగ మందుభక్తులనుగావగదండముచేతబూని భూ
జనులనునుద్ధరించుటకు సర్వము త్యాగముజేయునట్టి ని
ష్కలుషిత చిత్తులే కద జగద్గురువుల్,
పరికించి చూచినన్!
తలపులు మంగళకరమై
రిప్లయితొలగించండికలనము పలువురి జనులకు కాపాడుటకై
విలువలనడరించెడి ని
ష్కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్
పలువురు గావవత్తురిట వంచకులై గురువేషధారులై
తలపులు దారితప్పి పెడదారిని బట్టిన పెద్దవారలా
కలుషితచిత్తులే కద; జగద్గురువుల్ పరికించి చూచినన్
విలువలు పెంపొనర్చుటకు విజ్ఞత చూపిన వారలందురే
-
రిప్లయితొలగించండిహమ్మయ్య !
విలువలను మరచిన జనులు
కలుషితచిత్తులె కదా; జగద్గురు లెల్లన్
పులుకడిగినట్టి ముత్య
మ్ములు తెలుసుకొనవె జిలేబి మూఢత వలదే
కం:ఫలముల తమ కాశించక
రిప్లయితొలగించండియిలకున్ దత్త్వమ్ము దెలుపుటే లక్ష్యమ్మై
పలు రచనల్ గావించు న
కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్!
చం॥ ఇలననుభూతి యేర్పరచు నెంచఁగ భావన లంతియే కదా!
రిప్లయితొలగించండివిలసిత వేషధారణము విచ్చిన మోసము లెన్నొ కాంచుచున్
మెలఁపును బొంద పల్కరొకొ మిక్కిలి జ్ఞానుల వోలె “నిక్కమే
కలుషిత చిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్”
(ఎవరి అనుభవం వారిది కదండి. సద్గురులెందరో కపటులు లోకమందు రెట్టింపు. అలా మోసపోయిన వారి ఉవాచ)
పలుకులు పేయూషమ్ములు
రిప్లయితొలగించండిపలువురి హితమభిలషించు పావనమూర్తుల్
కలియుగమున వెలసిన ని
ష్కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్
చం: పలువిధతర్కముల్ సలుపు వాడొక డిట్లనె "శంకరుండు బౌ
రిప్లయితొలగించండిద్ధుల నశియింప జేయ గడు ధూర్తకుతర్కము జేసె, కాచ వి
ప్రుల నలు పీఠముల్ నిలిపె బో! కుల తత్త్వము నిల్ప గోరు నా
కలుషితచిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్”
(ఈనాటి కొందరు హేతువాదులకు,నాస్తికులకు బుద్ధుని పై అభిమానము, శంకరుల పై ద్వేషము ఉన్నాయి. శంకరుడు బ్రాహ్మణవర్గాన్ని కాపాడటానికి, బౌద్ధాన్ని నాశనం చెయ్యటానికి మాత్రమే ప్రయత్నించా డనేది వారి విమర్శ.)
పలుకులయందు నిర్జరము పావన జీవనశైలి, నిచ్చలున్
రిప్లయితొలగించండినలుగురి మేలు కోరుకొను నైజము, సత్పథగాములై భువిన్
కలియుగమందు నివ్వటిలు కారణజన్ములుగా చరించు ని
ష్కలుషితచిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్
ఇలపయి శాంతి నెక్కొలుప నెంచుచు, చేయుచు నుంద్రు యత్నముల్
రిప్లయితొలగించండిపలుకుచు సత్యభాషనలఁ బ్రార్థనఁ జేయుచు నాదిశక్తిఁ గో
వెలలను యజ్ఞయాగముల వేవురు భక్తులు కొల్వఁ జేయు ని
ష్కలుషిత చిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్
అల కాంచి యొక్క రిద్దఱి
రిప్లయితొలగించండినలువు రటులె యుందు రని మనములఁ దలఁచుచుం
బలుకఁగ రా దిబ్భంగినిఁ
గలుషిత చిత్తులె కదా జగద్గురు లెల్లన్
కల రిలఁ గొంద ఱెల్లెడలఁ గైతవ సంయము లర్థకాముకుల్
ఫలముల యాశఁ జూపి జన వర్గము నక్కట మోసపుచ్చఁగా
సలలిత మొప్పు నిట్లనిన శంకరుఁ డాదిగ నొజ్జ లెల్ల ని
ష్కలుషిత చిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్