28, అక్టోబర్ 2026, బుధవారం

సమస్య - 5634

29-10-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము”

(లేదా...)

“ప్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్”

14 కామెంట్‌లు:

  1. అందమునుజూసి మురియుచు నాపడతిని
    కోరి కోరి పెండ్లాడుట కుదురె గాని ,
    సతి కతి తరచుగా పిచ్చి పట్టుచుండ
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    సంప్రదాయము కాదని సంపదలను
    జంట రాబడులెంతని సాగుచుండ
    వధువు ప్రేమాయణము దాచి వరునిఁ బడయ
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము!

    శార్దూలవిక్రీడితము
    ఏణాక్షిన్ గని రాబడిన్ దెలిసి లెక్కింపన్నదే ముఖ్యమన్
    బాణీతోడ వధూవరుల్ మనువునే వాంఛింప స్వార్థమ్మునన్
    జాణల్ దాచిన ప్రేమికుండు చెలఁగన్ సాగించ గూఢమ్ముగన్
    బ్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్

    రిప్లయితొలగించండి

  3. వంట రానట్టి పడతియే భార్య యగుచు
    పలు విధమ్ముల పరిశోధనలను చేసి
    క్రొత్త వంటల వండెడి కొమ్మ యున్న
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము.


    ప్రాణేశా! వలదీ ప్రయత్నమనుచున్ బ్రార్థింతు, నిన్నే బహి
    ప్రాణమ్మంచు దలంచితిన్ గనగ నీవంటల్ తినన్ సేగియే
    ప్రాణంబున్ హరియించు నిక్కమిది నీ పాటిన్ బసాలున్న చో
    ప్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్.

    రిప్లయితొలగించండి
  4. వీణ తీగెను పలికించు విధము నెంచి
    ప్రాణసమను లాలింపడా వల్లభుండు
    రాణి యలుకబూని దరికి రాకయున్న
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము

    వీణాతంత్రినిఁ మీటు రీతి వధువున్ బ్రేయాంసుడే చూడగా
    ప్రాణాధారము నీవటంచు సతితాఁ వాక్రుచ్చులే రూఢిగా
    వేణీవేథనిఁ బోలుచున్ గృహిణి తాఁ వేధింపగా నేర్వగా
    బ్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి:
    ఎడ్డెమనినను తనసతి తెడ్డెమనును
    తనకు తెలియదు చెప్పిన తాను వినదు
    నగలు చీరల కోసము తగవులాడు
    “ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము”

    శార్దూలము:
    మాణిక్యమ్ముల మాడలన్ నగల సమ్మానమ్ముగానిచ్చి క
    ల్యాణమ్ముం బొనరించె గాదెనను మాయమ్మంచు ఘోరంబుగా
    ప్రాణంబుల్ కడతేఱులాగున సతుల్ రాపాడుచుండన్ సదా
    ప్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్

    రిప్లయితొలగించండి
  6. భర్త కనుకూల వతి గాని భార్య దొరుక
    ప్రాప్త మ య్యె న టంచును బాధ పడుచు
    నను భ వించు చు నుండె తా నార్తి తోడ
    ప్రాణ గండ మౌగృహ ము న పతికి సతము

    రిప్లయితొలగించండి
  7. తే.గీ: స్వంత ఇంటి కై నీ పోరు సరియె కాని
    ఇంద్రభవనమ్ము వోలె గట్టించు మంచు
    బతిని నప్పుల లో ముంచ వలదు, దాన
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము”
    (స్వంత ఇల్లు ఉండటం ఆర్థికం గా మంచిదే కానీ దాని కై విపరీత మైన కోరికల తో అప్పులలో మునిగితే సుఖం ఉండదు.)



    రిప్లయితొలగించండి
  8. శా:ప్రాణ మ్మంతయు ధార వోసి గృహనిర్మాణమ్ము గావింప ని
    ర్మాణ మ్మందున వాస్తు దెల్ప నయమార్గ మ్మేదియూన్ లేదొకో
    "ప్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్”
    దీనిన్ మార్చు డటంచు జెప్పి భయమున్ దెప్పించుటే మార్గమే?
    (కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఎవడో వాస్తు పండితుడు దీని వలన భర్తకి ప్రాణగండం అని భయ పెట్టాడట. అలాంటి మూఢవిశ్వాసం తో భయపెట్టక సవ్యంగా తార్కికంగా వివరించ కూడదా?)





    రిప్లయితొలగించండి
  9. వాణి మగఁడైన రక్షింప వలను కాదు
    రాణు లుండినఁ బెక్కండ్రు రాజ యినను
    బాణ సన్నిభ లనిశమ్ము బాధ లొసఁగఁ
    బ్రాణగండమౌ గృహమునఁ బతికి సతము


    శ్రేణీ భూతము లౌను జన్మము లిలన్ జీవాత్మ నాథుండ యౌ
    ఠాణం బౌను శరీర మెన్నఁగను ద్రష్టవ్యమ్ము బ్రహ్మాత్మకున్
    వేణీ సన్నిభ మైన జీవితమహో విచ్ఛిన్న మే నాఁటికిం
    బ్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్

    [పతికి = గేహపతి, జీవాత్మ; గేహము = దేహము]

    రిప్లయితొలగించండి
  10. మాణిక్యమ్మని యెంచి శ్రీమతిని సమ్మానమ్ముతో చూచుచున్
    వాణిజ్యమ్మున నష్టపోవ పతి, సంభావించి చేదోడుగా
    త్రాణమ్మున్ బొనరించ కుండ పదరన్ దర్పమ్ముతో పత్ని వే
    ప్రాణాపాయ పరిస్థితుల్, పతికి సంప్రాప్తించు గేహంబునన్

    రిప్లయితొలగించండి
  11. చాటు మాటున విటునితో సరసమాడు
    భార్య యుండిన నొకవేళ బయట పడిన
    హత్య జేయగా యత్నించు యతివయున్న
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పరుల మోజులో డబ్బుకై పతిని వీడి
    రేయి పగలను భేదమున్ లేక తిరిగి
    పతిని లెక్కచేయని సతి వలన కల్గు
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము.

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పరుల మోజులో డబ్బుకై పతిని వీడి
    రేయి పగలను భేదమున్ లేక తిరిగి
    పతిని లెక్కచేయని సతి పనుల వలన
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము.

    రిప్లయితొలగించండి
  14. కొత్త నగలను కొనమని గొడవ పడుచు
    బాధలిడుచు పసుపు బెట్టు భార్య యుండ
    నప్పు లెన్నొచేసి యావేదనపడుట
    *“ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము”*


    రిప్లయితొలగించండి