24, అక్టోబర్ 2026, శనివారం

సమస్య - 5630

25-10-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మక్కా రామాలయమట యర్చింపఁ దగున్”

(లేదా...)

“మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్”

18 కామెంట్‌లు:

  1. కందం
    చక్కగ నయోధ్యయందున
    మక్కువ మీరంగఁ గట్ట మహనీయముగన్
    మ్రొక్కియు రామయ్యను రా
    మక్కా! రామాలయమట యర్చింపఁ దగున్

    శార్దూలవిక్రీడితము
    చక్కంగన్ సరయూ నదీ తటిని నుత్సాహంబులేపారఁగన్
    దక్కంగన్ రఘురామసంభవమయోధ్యా దివ్యస్థలిన్
    మ్రొక్కంగన్ గుడిఁ గట్టిరంట మిగులన్ రుచ్యంబుగన్ దీర్చి రా
    మక్కా! రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్

    రిప్లయితొలగించండి
  2. మక్కువ తోడుత శిల్పులు
    చెక్కిరి కర్రల బొమలను చేతుల తోడన్
    చక్కని రీతిగ , గాన ర
    మక్కా ! రామాలయమట యర్చింపఁ దగున్

    రిప్లయితొలగించండి

  3. ఎక్కడ రాముడు పుట్టెనొ
    యక్కడనే నా యయోధ్య యందున గనగన్
    చక్కటి గుడి వెలిసెను శ్యా
    మక్కా రామాలయమట యర్చింపఁ దగున్.


    నిక్కంబయ్యది జన్మభూమి యనుచున్ నిర్ధారణన్ జేయగా
    దక్కెన్ గౌరవ మిన్నినాళ్లకు పవిత్రంబౌ యయోధ్యా స్థలిన్
    చక్కంగన్ రఘురామ మందిరమటన్ సాధ్యంబయెన్ వేగ రా
    మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్.

    రిప్లయితొలగించండి
  4. చక్కగ భద్రాద్రికనుచు
    గ్రక్కున తలపెట్టినారు ఘనతర యాత్రన్
    మక్కువతో మనమేగెద
    మక్కా రామాలయమట యర్చింపఁ దగున్

    మక్కాచూడగ నెంచినారు తురకల్ మావీధిలో గుంపులై
    వక్కాణించిరి క్రైస్తవుల్ సయితమున్ వారేగు ప్రాంతాలనే
    మ్రొక్కన్ హిందువులిప్పుడే పయనమై పోవచ్చు భద్రాద్రి స
    మ్మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్

    రిప్లయితొలగించండి
  5. కం.

    భయభంజనుడట,కరుణా
    మయుడట,పరమాత్ముడట,ఉ *మక్కా! రామా*
    *లయమట,యర్చింపదగున్**
    జయమగునట రామనామ సంస్తుతిచేతన్

    రిప్లయితొలగించండి
  6. మ॥ దిక్కై ప్రోచెడు రామచంద్రుఁడు సదా దీపించడా యెల్లెడల్
    నిక్కంబిద్దియె వృద్ధులైన తరిలో నీమమ్ము శ్రద్ధాసక్తుల్
    మ్రొక్కన్ భక్తియు నమ్మకమ్ముఁ గనుటే ముఖ్యమ్ము ధాత్రిన్ మన
    మ్మక్కా రాముని దివ్య తీర్థము గదా యర్చింపగా రమ్మికన్

    (ఇద్దరే ఉన్న వయసు మళ్ళిన అక్కాచెల్లెలులో చెల్లెలు తన అక్కకు తెలుపుట మనము ఇక ఎక్కడికీ వెళ్ళలేము మనసులో ప్రతిష్ఠించుకొని ఇంట్లో పూజ చేసుకుందామని)

    రిప్లయితొలగించండి
  7. అక్కా! విమలక్కా! రా
    ధక్కా! విజయక్క,శారదక్కా! సంతో
    షక్కా!సరితక్క,అనుప
    మక్కా! రామాలయమటయర్చింపదగున్

    రిప్లయితొలగించండి

  8. ఎక్కడినుంచోశిల్పులు
    రెక్కలుకట్టుకొనివచ్చి రేయింబవళున్
    చక్కగచెక్కిరి రావే
    మక్కా? రామాలయమట యర్చింపదగున్

    రిప్లయితొలగించండి
  9. మక్కువ తో శ్రీరా ముని
    మిక్కిలి భక్తి గను వెడలి మేదిని లోనన్
    చక్కగ దర్శించి యు రా
    మక్కా! రామాల య మ ట యర్చి o పదగున్

    రిప్లయితొలగించండి
  10. నిక్కమ్మైన మనస్సు నుంచి ధృతితో నిర్మించి రాకోవెలన్
    దక్కున్ పుణ్యము వెళ్ళి దేవళములో దర్శింప, చేకూఱె నీ
    పక్కా పండు లయోధ్యలోనొసగ నాభాగ్యమ్ముగా నెంచి శ్యా
    మక్కా! రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్

    రిప్లయితొలగించండి
  11. నిక్కముగాజగమునగల
    డొక్కడెనంతటనునిండియుండినవాడై
    మక్కువనొకభక్తుడనెను
    (లేదా)
    మక్కువనద్వైతిపలికె
    మక్కారామాలయమటయర్చింపదగున్

    రిప్లయితొలగించండి
  12. ఎక్కడికో చన వలదే
    ప్రక్కన మందిర వరమ్ము రమ్యతరముగా
    నొక్కటి వెలసిన దట ర
    మ్మక్కా రామాలయ మట యర్చింపఁ దగున్


    ఎక్కాలమ్మున నైన రాముఁ డిలలో నింపారఁ బూజార్హుఁడే
    యక్కా యేఁగ వలెం బురమ్మునకు నాంధ్రాయోధ్య కుత్సాహులై
    చక్కన్ దర్శన మౌను భద్ర గిరిఁ బూజాద్రవ్య సంపత్తి తె
    మ్మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్

    రిప్లయితొలగించండి
  13. అక్కడ నిక్కడ దిరిగియు
    మ్రొక్కితిమిగదా యనేక మూర్తులకెల్లన్
    ఇక్కడ నున్నది గుడి సో
    మక్కా!రామాల యమట యర్చింపదగున్

    రిప్లయితొలగించండి
  14. ఇక్కట్టుల్ కడతేర భక్తజను లెన్నెన్నో సురస్థానముల్
    దిక్కే దైవమటన్న నమ్మకముతో దృష్టింత్రు, భద్రాద్రియే
    చిక్కుల్ దీర్చెడి చక్కనైన ప్రభువే సీతా సమేతుండు, ల
    క్ష్మక్కా! రాముని దివ్యతీర్థముగదా యర్చింపగా రమ్మిఁకన్

    రిప్లయితొలగించండి
  15. అక్కయపాలెము నందున
    నెక్కుడు సుందరమగు గుడులెన్నియొ గలవా
    ప్రక్కన గలదొక గుడి ల
    క్ష్మక్కా! రామాలయమట యర్చింపఁ దగున్

    రిప్లయితొలగించండి
  16. అక్కా!పోదము రమ్ము సూడగ
    నత్యంతాశ కల్గెన్ మదిన్
    నిక్కమ్మా రమనీయ మందిరము
    నున్ నే గాంచలేదెందునన్
    దక్కున్ పుణ్యము దీని గనినన్
    దథ్యంబు నావాక్కు సో
    మక్కా!రాముని దివ్య తీర్థముగదా
    యర్చించగా రమ్మికన్

    రిప్లయితొలగించండి