25-10-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మక్కా రామాలయమట యర్చింపఁ దగున్”
(లేదా...)
“మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్”
కందంచక్కగ నయోధ్యయందునమక్కువ మీరంగఁ గట్ట మహనీయముగన్మ్రొక్కియు రామయ్యను రామక్కా! రామాలయమట యర్చింపఁ దగున్శార్దూలవిక్రీడితముచక్కంగన్ సరయూ నదీ తటిని నుత్సాహంబులేపారఁగన్దక్కంగన్ రఘురామసంభవమయోధ్యా దివ్యస్థలిన్మ్రొక్కంగన్ గుడిఁ గట్టిరంట మిగులన్ రుచ్యంబుగన్ దీర్చి రామక్కా! రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్
మక్కువ తోడుత శిల్పులు చెక్కిరి కర్రల బొమలను చేతుల తోడన్చక్కని రీతిగ , గాన రమక్కా ! రామాలయమట యర్చింపఁ దగున్
ఎక్కడ రాముడు పుట్టెనొ యక్కడనే నా యయోధ్య యందున గనగన్ చక్కటి గుడి వెలిసెను శ్యా మక్కా రామాలయమట యర్చింపఁ దగున్.నిక్కంబయ్యది జన్మభూమి యనుచున్ నిర్ధారణన్ జేయగా దక్కెన్ గౌరవ మిన్నినాళ్లకు పవిత్రంబౌ యయోధ్యా స్థలిన్ చక్కంగన్ రఘురామ మందిరమటన్ సాధ్యంబయెన్ వేగ రా మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్.
చక్కగ భద్రాద్రికనుచు గ్రక్కున తలపెట్టినారు ఘనతర యాత్రన్మక్కువతో మనమేగెదమక్కా రామాలయమట యర్చింపఁ దగున్మక్కాచూడగ నెంచినారు తురకల్ మావీధిలో గుంపులైవక్కాణించిరి క్రైస్తవుల్ సయితమున్ వారేగు ప్రాంతాలనేమ్రొక్కన్ హిందువులిప్పుడే పయనమై పోవచ్చు భద్రాద్రి సమ్మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్
కం.భయభంజనుడట,కరుణామయుడట,పరమాత్ముడట,ఉ *మక్కా! రామా* *లయమట,యర్చింపదగున్**జయమగునట రామనామ సంస్తుతిచేతన్
మ॥ దిక్కై ప్రోచెడు రామచంద్రుఁడు సదా దీపించడా యెల్లెడల్నిక్కంబిద్దియె వృద్ధులైన తరిలో నీమమ్ము శ్రద్ధాసక్తుల్ మ్రొక్కన్ భక్తియు నమ్మకమ్ముఁ గనుటే ముఖ్యమ్ము ధాత్రిన్ మనమ్మక్కా రాముని దివ్య తీర్థము గదా యర్చింపగా రమ్మికన్ (ఇద్దరే ఉన్న వయసు మళ్ళిన అక్కాచెల్లెలులో చెల్లెలు తన అక్కకు తెలుపుట మనము ఇక ఎక్కడికీ వెళ్ళలేము మనసులో ప్రతిష్ఠించుకొని ఇంట్లో పూజ చేసుకుందామని)
అక్కా! విమలక్కా! రాధక్కా! విజయక్క,శారదక్కా! సంతోషక్కా!సరితక్క,అనుపమక్కా! రామాలయమటయర్చింపదగున్
ఎక్కడినుంచోశిల్పులురెక్కలుకట్టుకొనివచ్చి రేయింబవళున్ చక్కగచెక్కిరి రావేమక్కా? రామాలయమట యర్చింపదగున్
మక్కువ తో శ్రీరా ముని మిక్కిలి భక్తి గను వెడలి మేదిని లోనన్ చక్కగ దర్శించి యు రా మక్కా! రామాల య మ ట యర్చి o పదగున్
నిక్కమ్మైన మనస్సు నుంచి ధృతితో నిర్మించి రాకోవెలన్దక్కున్ పుణ్యము వెళ్ళి దేవళములో దర్శింప, చేకూఱె నీపక్కా పండు లయోధ్యలోనొసగ నాభాగ్యమ్ముగా నెంచి శ్యామక్కా! రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్
నిక్కముగాజగమునగలడొక్కడెనంతటనునిండియుండినవాడైమక్కువనొకభక్తుడనెను(లేదా)మక్కువనద్వైతిపలికెమక్కారామాలయమటయర్చింపదగున్
ఎక్కడికో చన వలదే ప్రక్కన మందిర వరమ్ము రమ్యతరముగా నొక్కటి వెలసిన దట రమ్మక్కా రామాలయ మట యర్చింపఁ దగున్ ఎక్కాలమ్మున నైన రాముఁ డిలలో నింపారఁ బూజార్హుఁడే యక్కా యేఁగ వలెం బురమ్మునకు నాంధ్రాయోధ్య కుత్సాహులై చక్కన్ దర్శన మౌను భద్ర గిరిఁ బూజాద్రవ్య సంపత్తి తెమ్మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్
అక్కడ నిక్కడ దిరిగియు మ్రొక్కితిమిగదా యనేక మూర్తులకెల్లన్ఇక్కడ నున్నది గుడి సో మక్కా!రామాల యమట యర్చింపదగున్
ఇక్కట్టుల్ కడతేర భక్తజను లెన్నెన్నో సురస్థానముల్దిక్కే దైవమటన్న నమ్మకముతో దృష్టింత్రు, భద్రాద్రియేచిక్కుల్ దీర్చెడి చక్కనైన ప్రభువే సీతా సమేతుండు, లక్ష్మక్కా! రాముని దివ్యతీర్థముగదా యర్చింపగా రమ్మిఁకన్
అక్కయపాలెము నందుననెక్కుడు సుందరమగు గుడులెన్నియొ గలవాప్రక్కన గలదొక గుడి లక్ష్మక్కా! రామాలయమట యర్చింపఁ దగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అక్కా!పోదము రమ్ము సూడగనత్యంతాశ కల్గెన్ మదిన్నిక్కమ్మా రమనీయ మందిరమునున్ నే గాంచలేదెందునన్దక్కున్ పుణ్యము దీని గనినన్దథ్యంబు నావాక్కు సోమక్కా!రాముని దివ్య తీర్థముగదాయర్చించగా రమ్మికన్
కందం
రిప్లయితొలగించండిచక్కగ నయోధ్యయందున
మక్కువ మీరంగఁ గట్ట మహనీయముగన్
మ్రొక్కియు రామయ్యను రా
మక్కా! రామాలయమట యర్చింపఁ దగున్
శార్దూలవిక్రీడితము
చక్కంగన్ సరయూ నదీ తటిని నుత్సాహంబులేపారఁగన్
దక్కంగన్ రఘురామసంభవమయోధ్యా దివ్యస్థలిన్
మ్రొక్కంగన్ గుడిఁ గట్టిరంట మిగులన్ రుచ్యంబుగన్ దీర్చి రా
మక్కా! రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్
మక్కువ తోడుత శిల్పులు
రిప్లయితొలగించండిచెక్కిరి కర్రల బొమలను చేతుల తోడన్
చక్కని రీతిగ , గాన ర
మక్కా ! రామాలయమట యర్చింపఁ దగున్
రిప్లయితొలగించండిఎక్కడ రాముడు పుట్టెనొ
యక్కడనే నా యయోధ్య యందున గనగన్
చక్కటి గుడి వెలిసెను శ్యా
మక్కా రామాలయమట యర్చింపఁ దగున్.
నిక్కంబయ్యది జన్మభూమి యనుచున్ నిర్ధారణన్ జేయగా
దక్కెన్ గౌరవ మిన్నినాళ్లకు పవిత్రంబౌ యయోధ్యా స్థలిన్
చక్కంగన్ రఘురామ మందిరమటన్ సాధ్యంబయెన్ వేగ రా
మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్.
చక్కగ భద్రాద్రికనుచు
రిప్లయితొలగించండిగ్రక్కున తలపెట్టినారు ఘనతర యాత్రన్
మక్కువతో మనమేగెద
మక్కా రామాలయమట యర్చింపఁ దగున్
మక్కాచూడగ నెంచినారు తురకల్ మావీధిలో గుంపులై
వక్కాణించిరి క్రైస్తవుల్ సయితమున్ వారేగు ప్రాంతాలనే
మ్రొక్కన్ హిందువులిప్పుడే పయనమై పోవచ్చు భద్రాద్రి స
మ్మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్
కం.
రిప్లయితొలగించండిభయభంజనుడట,కరుణా
మయుడట,పరమాత్ముడట,ఉ *మక్కా! రామా*
*లయమట,యర్చింపదగున్**
జయమగునట రామనామ సంస్తుతిచేతన్
మ॥ దిక్కై ప్రోచెడు రామచంద్రుఁడు సదా దీపించడా యెల్లెడల్
రిప్లయితొలగించండినిక్కంబిద్దియె వృద్ధులైన తరిలో నీమమ్ము శ్రద్ధాసక్తుల్
మ్రొక్కన్ భక్తియు నమ్మకమ్ముఁ గనుటే ముఖ్యమ్ము ధాత్రిన్ మన
మ్మక్కా రాముని దివ్య తీర్థము గదా యర్చింపగా రమ్మికన్
(ఇద్దరే ఉన్న వయసు మళ్ళిన అక్కాచెల్లెలులో చెల్లెలు తన అక్కకు తెలుపుట మనము ఇక ఎక్కడికీ వెళ్ళలేము మనసులో ప్రతిష్ఠించుకొని ఇంట్లో పూజ చేసుకుందామని)
అక్కా! విమలక్కా! రా
రిప్లయితొలగించండిధక్కా! విజయక్క,శారదక్కా! సంతో
షక్కా!సరితక్క,అనుప
మక్కా! రామాలయమటయర్చింపదగున్
రిప్లయితొలగించండిఎక్కడినుంచోశిల్పులు
రెక్కలుకట్టుకొనివచ్చి రేయింబవళున్
చక్కగచెక్కిరి రావే
మక్కా? రామాలయమట యర్చింపదగున్
మక్కువ తో శ్రీరా ముని
రిప్లయితొలగించండిమిక్కిలి భక్తి గను వెడలి మేదిని లోనన్
చక్కగ దర్శించి యు రా
మక్కా! రామాల య మ ట యర్చి o పదగున్
నిక్కమ్మైన మనస్సు నుంచి ధృతితో నిర్మించి రాకోవెలన్
రిప్లయితొలగించండిదక్కున్ పుణ్యము వెళ్ళి దేవళములో దర్శింప, చేకూఱె నీ
పక్కా పండు లయోధ్యలోనొసగ నాభాగ్యమ్ముగా నెంచి శ్యా
మక్కా! రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్
నిక్కముగాజగమునగల
రిప్లయితొలగించండిడొక్కడెనంతటనునిండియుండినవాడై
మక్కువనొకభక్తుడనెను
(లేదా)
మక్కువనద్వైతిపలికె
మక్కారామాలయమటయర్చింపదగున్
ఎక్కడికో చన వలదే
రిప్లయితొలగించండిప్రక్కన మందిర వరమ్ము రమ్యతరముగా
నొక్కటి వెలసిన దట ర
మ్మక్కా రామాలయ మట యర్చింపఁ దగున్
ఎక్కాలమ్మున నైన రాముఁ డిలలో నింపారఁ బూజార్హుఁడే
యక్కా యేఁగ వలెం బురమ్మునకు నాంధ్రాయోధ్య కుత్సాహులై
చక్కన్ దర్శన మౌను భద్ర గిరిఁ బూజాద్రవ్య సంపత్తి తె
మ్మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్
అక్కడ నిక్కడ దిరిగియు
రిప్లయితొలగించండిమ్రొక్కితిమిగదా యనేక మూర్తులకెల్లన్
ఇక్కడ నున్నది గుడి సో
మక్కా!రామాల యమట యర్చింపదగున్
ఇక్కట్టుల్ కడతేర భక్తజను లెన్నెన్నో సురస్థానముల్
రిప్లయితొలగించండిదిక్కే దైవమటన్న నమ్మకముతో దృష్టింత్రు, భద్రాద్రియే
చిక్కుల్ దీర్చెడి చక్కనైన ప్రభువే సీతా సమేతుండు, ల
క్ష్మక్కా! రాముని దివ్యతీర్థముగదా యర్చింపగా రమ్మిఁకన్
అక్కయపాలెము నందున
రిప్లయితొలగించండినెక్కుడు సుందరమగు గుడులెన్నియొ గలవా
ప్రక్కన గలదొక గుడి ల
క్ష్మక్కా! రామాలయమట యర్చింపఁ దగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅక్కా!పోదము రమ్ము సూడగ
రిప్లయితొలగించండినత్యంతాశ కల్గెన్ మదిన్
నిక్కమ్మా రమనీయ మందిరము
నున్ నే గాంచలేదెందునన్
దక్కున్ పుణ్యము దీని గనినన్
దథ్యంబు నావాక్కు సో
మక్కా!రాముని దివ్య తీర్థముగదా
యర్చించగా రమ్మికన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి