27, అక్టోబర్ 2026, మంగళవారం

సమస్య - 5633

28-10-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్”

(లేదా...)

“కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా”

(గెంటేల జగదీశ చంద్రకుమార్ గారికి ధన్యవాదాలతో...)

22 కామెంట్‌లు:

  1. భర్త యెడతెగక త్రాగెడు
    వర్తనమును గాంచి భార్య వలదన కుండన్
    నార్తి పడక బొగడెడు దన
    కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనకుండన్ + ఆర్తి' అన్నపుడు నుగాగమం రాదు.

      తొలగించండి
  2. హర్తల్ నేతలుగా ప్రభుత్వమొదవన్నత్యంత స్వార్థమ్ముతో
    వర్తిల్లన్ బ్రజ బాధలన్ విడుచుచున్ వంచించుచున్ నిత్యమున్
    పూర్తిన్ చేయక వృద్ధి కారకములన్ భోగమ్ములన్ బొందుచున్
    కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'ఒదవన్ + అత్యంత' అన్నపుడు ద్విత్వనకార ప్రయోగాన్ని వర్జించండి.

      తొలగించండి
    2. హర్తల్ నాయకులై గడించ ధనమత్యంతమ్ము స్వార్థమ్ముతో
      వర్తిల్లన్ బ్రజ బాధలన్ విడుచుచున్ వంచించుచున్ నిత్యమున్
      పూర్తిన్ చేయక వృద్ధి కారకములన్ భోగమ్ములన్ బొందుచున్
      కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా!

      తొలగించండి

  3. దూర్తుండై యేలెడి భూ
    భర్తను సేవించు నట్టి భండిలుడట నా
    కర్తృత్వము రోయుచు తన
    కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్.


    దూర్తుండాతడు లోక కంటకునిగా దుర్మార్గముల్ జేయు భూ
    భర్తన్ నిత్యము గొల్చుటయ్యదియె యా బంట్రోతుకున్ గాంచగా
    కర్తృత్వంబగు పాళమందతని దుష్కార్యమ్ము లన్ గాంచి యా
    కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా.

    రిప్లయితొలగించండి
  4. హనుమంతుడు/అంగదుడు రావణునితో...

    కందం
    మూర్తీభవించి ధర్మము
    స్ఫూర్తినొసఁగు దాశరథినిఁ బోరున నిల్పన్
    ధూర్తుల కొప్పదు, కాదది
    కర్తవ్యము! వీడువారు గళ్యాణకరుల్!

    శార్దూలవిక్రీడితము
    స్ఫూర్తిన్ బంచుచు మేటి ధర్మమదియే మూర్తీభవించంగ ని
    ర్వర్తించున్ రఘురామచంద్రుఁడెపుడున్ రాజీవనేత్రుండనన్
    ధూర్త శ్రేణికి వారితో రణమనన్ ద్రుళ్ళింత! రాణించదన్
    గర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా!

    రిప్లయితొలగించండి
  5. ధూర్తులగు నేతలు గదా
    వార్తాపత్రికలు పెట్టి వాస్తవ కథలన్
    బూర్తిగ మఱుగుపఱచి తమ
    కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్

    ధూర్తత్వమ్మిల నాయకత్వమవగా దుర్నీతికేబద్ధులై
    వార్తాపత్రికఁ బూన్చి వ్రాసెదరహో వాస్తవ్య దూరంబుగా
    మార్తాండాయని సొంతవారు బొగడన్ మత్తెక్కి వర్తించుచున్
    గర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా

    రిప్లయితొలగించండి
  6. వర్తనమందు నిజాయితి
    కర్తవ్యమునెరిఁగి మసలు కౌశల్యముతో
    వర్తించ నెలమి వ్యర్థఁపు
    కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్

    ఆర్తత్రాణపరాయణత్వమున తానన్యాయమున్ సైపకన్
    కర్తవ్యోన్ముఖుడై చరించుటయు సాకల్యమ్ముగా సల్పుచున్
    వర్తిల్లన్ కృతకర్ముడండ్రు జనులవ్వానిన్, నికారమ్మునౌ
    కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా

    రిప్లయితొలగించండి
  7. కీర్తిని కోరని వారై
    యార్తుల యెడ కరుణ జూపి యాపద బాపే
    వర్తన గలిగిన గప టపు
    కర్తవ్యము వీడు వారు కళ్యాణ కరు ల్

    రిప్లయితొలగించండి
  8. కం:వార్తా పత్రికలన్ సమ
    వర్తు లగుచు, రాజకీయ పక్షము నొకటిన్
    గీర్తించు పక్షపాతపు
    “కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్”

    రిప్లయితొలగించండి
  9. శా:వార్తాపత్రిక ప్రాణవాయువు ప్రజాస్వామ్యమ్మునన్,నీచమౌ
    వార్తల్ గల్పన జేసి,వార్తలకు దుర్వ్యాఖ్యానముల్ జేయుచున్
    కీర్తిన్ గూర్చ స్వపక్ష వర్గములకే క్రీడించు నా భ్రష్టమౌ
    కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా”


    రిప్లయితొలగించండి
  10. శా॥ నర్తించన్ దగునే కువాదులటు విన్నాణమ్ముతోఁ దెల్పఁగన్
    వర్తిల్లంగను నుగ్రవాదమును సంభావించుచున్ బ్రేచుచున్
    గార్తార్థ్యమ్ముగ సంపదాదులకు ధిక్కారమ్ముతో నట్టిదౌ
    కర్తవ్యమ్మును వీడువారలిలలోఁ గళ్యాణకారుల్ గదా!

    కార్తార్థ్యము కృతజ్ఞత

    రిప్లయితొలగించండి
  11. ఆర్తి నిడ ధార్త రాష్ట్రులు
    వర్తించిరి సంతతమ్ము వారలు క్రూరుల్
    ధూర్తులకుఁ బ్రీతి నిడు దు
    ష్కర్తవ్యము వీడు వారు కల్యాణ కరుల్


    వార్తావ్రాతము నమ్మరా దెవరు విధ్వం సార్హ కార్యాలికిం
    గర్తృత్వమ్మును సమ్మతింపరు జగత్కల్యాణ కాంక్షా మతుల్
    ధూర్తౌఘమ్మున కీఁ దలంప కెదలం దోడ్పాటు సత్పూరు షా
    కర్తవ్యమ్మును వీడు వార లిలలోఁ గల్యాణ కారుల్ గదా

    [సత్పూరుష + అకర్తవ్యము = సత్పూరు షాకర్తవ్యము]

    రిప్లయితొలగించండి
  12. ఆర్తులు కొందరు తమ స
    త్కర్మకు హారతినిపట్ట్రి, తత్జనులు పరీ
    వర్తన జెందియు మరి దు
    ష్కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్

    రిప్లయితొలగించండి
  13. ఆర్తుల వేదన వినక ప్ర
    వర్తనముననటనచూపిపలుకులతోడన్
    కీర్తిని పడయగ నెంచెడు
    *"కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్

    రిప్లయితొలగించండి