2, సెప్టెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2133 (ప్రాణములను గొనెడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ప్రాణములను గొనెడువాఁడు పరమాత్ముండౌ"
లేదా...
"వారక ప్రాణముల్ గొనెడువాఁడు గదా పరమాత్ముఁ డన్నచో"

80 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు :

    క్షోణిని ప్రాణుల నలపుచు
    శోణము జుఱ్ఱుచు నెగడెడి సోకుల నెంతన్
    క్షీణము జేయగ వారివి
    ప్రాణములను గోనెడివాడు పరమాత్ము0డౌ.

    (సోకులు= రాక్షసులు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రాణుల నలుపుచు... వారల ప్రాణములను...' అనండి.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. అనాధ శరణాలయాలను నడుపుతున్న పరమాత్ములు ...
      ఏ నాధుడు లేక పసి
      ప్రాణులు నకములను జూపు బ్రతుకులు బతికెన్,
      దీనుల నాదుకొనుట కా
      ప్రాణములను గొనెడువాఁడు పరమా త్ముండౌ

      తొలగించండి
    2. పొలిమేర మల్లేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పసి ప్రాణులు' అన్నపుడు 'సి' గురువు కాదు. 'లేకను పసి। ప్రాణులు నరకమును జూపు బ్రతుకులు బ్రతుకన్..' అనండి.

      తొలగించండి
    3. పసిప్రాణులు సమాసము అనుకున్నానండి .. తెలిసింది, ధన్యవాదములు

      తొలగించండి


  3. ప్రాణముల నిచ్చు వాడును,
    ప్రాణములను గొనెడువాఁడు పరమాత్ముండౌ,
    ప్రాణపు ప్రాణము నతడే
    ప్రాణము నాదని జిలేబి పలికెద వేలా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. క్షమాపణలతో, నిన్నటి సమస్యకు పూరణ
    స్ఫూర్తిన్నిచ్చెడు కావ్యపద్మములఁదాఁబూయించి మెప్పించుచున్
    ఆర్తత్రాణవిశేష భావనల భవ్యంబైన గేయంబులన్
    కర్తవ్యంబుల బోధసేయు రచనల్గావించి యాసాహితీ
    మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్"
    మహాకవి శ్రీశ్రీ స్వర్గ ప్రస్థానం విషయం

    రిప్లయితొలగించండి
  5. కోరిక దీర జన్మమును గూర్మి నొసంగి యనేక బంధముల్
    చేరగ జూచి సౌఖ్యముల సిద్ధిని జూపుచు జీవనాఖ్యమౌ
    తీరగు నాటకంబునను దీర్చిన పాత్ర ముగించువేళలో
    వారక ప్రాణముల్ గొనెడువాడు గదా పరమాత్ముడన్నచో.
    (వారక=ఎల్లప్పుడు) హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. ప్రాణుల కీభువి నెవ్వడు
    జాణతనపులీల జూపి జన్మలనిచ్చున్
    ఖాణమునిచ్చును, వాడే
    ప్రాణములను గొనెడు, వాఁడు పరమాత్ముండౌ"

    రిప్లయితొలగించండి
  7. శోణితమును మాంసమునిడి
    రాణగ నొక యాత్మ దాన రాజిల నార్త
    త్రాణుడనని బిరుదందియు
    ప్రాణములను గొనెడువాడు పరమాత్ముండౌ

    రిప్లయితొలగించండి
  8. ఊరక యోగనిద్ర నటు యూపిరి బోసియు జీవరాశి కే
    పారగ యాటలాడుకొన బారు నిదాన నకర్మకక్రియన్
    వారణ జేయ లేని గతి వాడిన బొమ్మల బాల క్రీడలన్
    వారక ప్రాణముల్ గొనెడు వాడు గదా పరమాత్ముడన్నచో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఏపారగ నాటలాడుకొన..' అనండి.

      తొలగించండి
  9. రేణువులో చేతన, పా
    షాణములోనైనమార్పు సాధ్యమొకనికే!
    వేణువుతో మధురముగా
    "ప్రాణములను గొనెడువాఁడు పరమాత్ముండౌ" 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్నటి సమస్య:
      ఆర్తిన్ బాసెను పద్మమెవ్వడిలలో నాత్మీయుడై వచ్చుచో?
      పూర్తై పోయె దినమ్ముఁ గొంత తడవై పోయెన్ సుమా!సూర్యుడో?
      గుర్తై సూర్యుడు నిల్చు నిప్పుకొలిమై ఘోషింతురే వేళలో?
      మార్తాండుండుదయాద్రిఁ; గ్రుంకెనదిగో; మధ్యాహ్నకాలంబునన్"

      తొలగించండి
    2. కోరక కీడు నెవ్వరికి కూర్చెద రెవ్వరు మంచి నెప్పుడా
      తీరుననున్న వారలకు దిక్కుగ నిల్చెడు వాడు దేవుడౌ
      నేరము వృత్తిగా నెపుడు నెవ్వరి నైనను చంపు నీచులన్
      వారక ప్రాణముల్ గొనెడువాఁడు గదా పరమాత్ముఁ డన్నచో

      తొలగించండి
    3. మడిపెల్లి రాజ్ కుమార్ గారూ,
      ఈనాటి రెండు పూరణలు, క్రమాలంకారంలో నిన్నటి పూరణ అన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. ప్రాణము దైవాధీనము
    నాణెముగానుంచి నరుని నడుపుటకైనన్
    క్షీణింపజేసి వారల
    ప్రాణములనుగొనెడువాడు పరమాత్ముండౌ

    రిప్లయితొలగించండి
  11. వేణుధరుని శైశవమున
    ప్రాణమ్ముల దీయ విషపు పాలను కుడుపన్
    జాణతనముతో పూతన
    ప్రాణములను గొనెడు వాడు పరమాత్ముండౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీరావు గారూ.. నమస్కారాలండీ.. చక్కని భావం.. మంచి శైలి.. పూరణ మనోహరంగా ఉంది.. అభినందనలు...

      తొలగించండి
    2. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  12. శ్రీరమణీమనోరమణసేవనమానగనిచ్చి ,నిత్య సాం. .
    సారిక జీవనమ్మున విశాలయశస్కుని జేసి, విత్తమం..
    దారని కోర్కె ద్రుంచియు,వదాన్యత నేర్పియు,
    నంత్యమందునన్
    వారక ప్రాణముల్ గొనెడివాడు గదా పరమాత్ముడన్నచో!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు మురళీకృష్ణ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  13. గురువుగారూ నిన్నటి పూరణ

    హర్తృప్రక్రియ జేయనెంచి హరుడాజ్ఞాపించ కాలాంతమున్
    కర్తవ్యంబున నేకకాంతి వెలిగిన్ ఖద్యోత సందోహమా
    వర్తన్యుగ్ర ప్రభాసమాన ప్రళయం బంత్యంబు గావించుచున్
    మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేరువ లేకనెవ్వరును జీవన యాత్రపు టంత్యకాలమున్
      తీరని వ్యాధులందుబడి దేహము వీడక కృంగుచుండియే
      నేరము చేసినాడనని నేడ్చిన వాని కృపా కటాక్షమున్
      వారక ప్రాణముల్ గొనెడువాఁడు గదా పరమాత్ముఁ డన్నచో

      తొలగించండి
    2. ఫణికుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్న మీరిచ్చినది యత్యంత క్లిష్టతరమైన సమస్య యనడములో నసత్యము లేదు. ఈ సమస్యా పూరణార్థము కొన్ని సత్యము లుద్దేశ్యపూర్వకముగా విస్మరింపబడినవి. ప్రాచీనాజ్ఞాత కవి పుంగవు డట్లే చేసెను.

    1. శ్రీ కృష్ణుడు చక్రాయుద్ధముతో సూర్యుని గప్పి సూర్యాస్తమయమును భ్రమింప జేసినది సాయంకాలాంతిమ ఘడియలలోనే గాని మధ్యాహ్నమున గాదు కద.
    2. దైత్యరాణ్మార్తాండ రావణ బ్రహ్మ లంకారాజ్యాధినేత పాలిత లంకా పట్టణమున్న త్రికూట సువేలాద్రు లున్నవి దక్షిణ దిశలో గాని తూర్పు దిశలో కాదు కద.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      నిజానికి ఆ సమస్య 'మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె...' అని ప్రారంభమవుతుంది. నేనే 'మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె...' అని మార్చాను. అజ్ఞాత కవి 'అపరాద్రి'తోనే పూరణ చేశాడు. కాని నేను నిశితంగా పరిశీలించకుండానే ఆ కవి మూడు పాదాలను గ్రహించి సమస్యాపాదాన్ని జోడించాను. అందువల్ల అపార్థానికి కారణమయింది. మన్నించండి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీవివరణకు ధన్యవాదములు. అజ్ఞాత కవి పుంగవుని క్షమాపణలు కోరు కుంటున్నాను.

      తొలగించండి
    3. అయ్యో! నేను చేసిన తప్పిదానికి మీరు క్షమాపణలు కోరడమేమిటి?

      తొలగించండి
  15. కానను జీవితమున సుం
    తైనను సంతసమటంచు దైన్యత తోడన్
    దానై పోఁగొనఁ గూడదు
    ప్రాణములను! గొనెడు వాఁడు పరమాత్ముండౌ!

    రిప్లయితొలగించండి
  16. వీణా !వింటివె యియ్యది
    ప్రాణములను గొనెడు వాడు పరమాత్ము o డౌ
    ప్రాణములు గొనుట మఱియును
    ప్రాణముల నిచ్చునతడు పరమాత్ముo డే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. 'ప్రాణమ్ముల నిచ్చునతడు...' అనండి.

      తొలగించండి
  17. నాణెముగ నాటలాడన్
    ప్రాణపు బొమ్మలనుజేసి ప్రహ్లాదముగన్
    త్రాణమునిడి యాట ముగియ
    ప్రాణములను గొనెడువాడు పరమాత్ముండౌ!!!

    రిప్లయితొలగించండి
  18. ద్రోణీ తుల్య భవార్త
    త్రాణ పరాయణ సుగుణ విరాజిత దైవ
    శ్రేణిప్రధముండు శివుడు,
    ప్రాణములను గొనెడువాఁడు, పరమాత్ముండౌ


    మీరిన భక్తి తోడుత నమేయ కృపారస వీక్షణున్ ఘనా
    కారు రమా మనోహరు వికారము వీడి భజింపఁ గల్గు నా
    ద్వారము పుణ్యమూర్తులకు భవ్యపదమ్ము పునర్భవాది తృ
    డ్వారక ప్రాణముల్ గొనెడువాఁడు గదా పరమాత్ముఁ డన్నచో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
      'ద్రోణీ తుల్య భవ..' అర్థం కాలేదు. వివరించండి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      భవార్తత్రాణపరాయణ: సంసార దుఃఖితుల రక్షణాసక్తము; ద్రోణీతుల్య: నావవంటివాడు (సంసారము సాగరము వంటిది కద). ఈ యర్థములలో వ్రాసితిని. సాధువేనా తెలుప గోర్తాను.

      తొలగించండి
    3. మీ భావం ఉదాత్తంగా ఉంది. కాని అన్వయం కుదరడం లేదు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. సవరించిన పద్యమును తిలకించ గోర్తాను.


      ప్రాణినికాయ భవార్త
      త్రాణ పరాయణ సుగుణ విరాజిత దైవ
      శ్రేణిప్రధముండు శివుడు,
      ప్రాణములను గొనెడువాఁడు, పరమాత్ముండౌ

      తొలగించండి
    5. సవరించిన పూరణ సందిగ్ధార్థాన్ని కోల్పోయి అద్భుతంగా ఉంది. నా సూచనను మన్నించి సవరించినందుకు ధన్యవాదాలు!

      తొలగించండి
    6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  19. వేణుధరుండాశ్రిత జన
    త్రాణుడు లక్ష్మీప్రియుండు ధర్మమ్మును తా
    క్షోణిన నిలుపన్ దుష్టుల
    ప్రాణములను గొనెడువాఁడు పరమాత్ముండౌ

    ఆరడి పెట్టు దుర్జనులనంతము జేసి ధరీత్రియందునన్
    భూరిగ ధర్మమున్నిలిపి పుణ్యపథంబు జరించి మోక్షమున్
    గోరెడు సజ్జనావళుల కోర్కెల దీర్చి దురాత్ములైనచో
    వారక ప్రాణముల్ గొనెడువాఁడు గదా పరమాత్ముఁ డన్నచో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'క్షోణిని' అనండి.

      తొలగించండి
  20. వారక ప్రాణముల్ గొనెడు వాడు గదా పరమాత్ము డన్నచో
    నారయ మీరు చెప్పినది యక్షర సత్యము గాదె యీభువిన్
    వారక ప్రాణముల్నిడుచు ప్రాణుల నెప్పుడు రక్షజేయుచున్
    మీరని ప్రేమతో వరలి ,మేదిని శాంతిని గల్గ జేయునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రాణము ల్నిడుచు' అనడం సాధువు కాదు. 'ప్రాణదాత యయి' అనండి.

      తొలగించండి
  21. ధ్యానముఁజేయుచు సతతము
    ధీనులకున్ సేవఁ జేయ స్థిరచిత్తముతో
    వానికి ముక్తినిడుటకై
    ప్రాణములను గొనెడు వాడు పరమాత్ముండే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. దూరక పెద్దలన్ సతము దుర్మతి, ధీనుల నుద్ధరించుచున్
    తీరుగ ప్రార్థనల్ సలిపి దేవునకున్ కడుపావనంపు సం
    సారము చేయుమాన్యులను స్వర్గము పంపు తలంపుతోడుతన్
    వారక ప్రాణముల్ గొనెడువాడుగదా పరమాత్ముడన్నచో

    రిప్లయితొలగించండి
  23. ప్రాణుల రక్షణ గాకను
    ప్రాణుల భక్షించ గలుగ?పాపాత్ముండే|
    ప్రాణము లిడుచున్ తుదకున్
    ప్రాణములను గొనెడి వాడు పరమాత్ముండౌ|
    2.ప్రాణము లివ్వగ బ్రహ్మే|
    ప్రాణమురక్షించు హరియు|”పార్వతి పతియే
    ప్రాణపు విలువలుసమసిన?
    ప్రాణములను గొనెడివాడు పరమాత్ముండౌ”|
    3.కారణజన్మ సార్థకత కాలముజెల్లగ జీవజాలమే
    మారుచు మాయలోకమున మార్పులయందున మట్టిజేరులే|
    వారక ప్రాణముల్ గొనెడి వాడుగదా పరమాత్ము డన్నచో?
    చేరిన సంపదల్ చెలిమి చేరవుగా శవ మైన వేళలో|
    4.ప్రేరణచేత దైవమిల పెద్దగ జేయుచు|కాలచక్రమున్
    తీరిక చేతద్రిప్పగ?నతీతపు శక్తులమాయజాలపున్
    కోరికలందు దోషమిడు కూరిమిరోగము కూల్చి వేయగా?
    వారక ప్రాణముల్ గొనెడి వాడుగదా పరమాత్ముడన్నచో|

    రిప్లయితొలగించండి
  24. ఊరక మానవాళినిల నూపిరి తీసెడి యుగ్రవాదులన్
    దారుణ మానభంగములు ధాత్రి నొనర్చెడి పిచ్చి మూకలన్
    తీరక నర్థ కాంక్ష కడతేర్చెడి క్రూరుల దుర్జనావళిన్
    వారక ప్రాణముల్ గొనెడువాఁడు గదా పరమాత్ముఁ డన్నచో

    రిప్లయితొలగించండి
  25. వేణువు రాగము లూదిన
    వీణియ తా సరిగమలను పీయుష మిడినా
    తానయి యొప్పుచు జీవుల
    ప్రాణములను గొనెడి వాడు పరమాత్ముండౌ!



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పీయూషమును పీయుష మన్నారు. అక్కడ 'పీయూష మిడన్' అనా సరిపోతుందనుకుంటాను.

      తొలగించండి
    2. గురువు గారికి నమస్సులు. కొద్దిపాటి మార్పుతో సవరించిన పద్యం:

      వేణువు నాదము లూదగ
      వీణియపై రాగము ప్రభవించుచు సాగన్
      తానయి యొప్పుచు జీవుల
      ప్రాణములను గొనెడి వాడు పరమాత్ముండౌ!



      తొలగించండి
  26. వేణురవము గోపికలను
    స్థాణువులను చేసెను మది స్థాయిని కోల్పో
    యెను కాయము కంపించగ
    ప్రాణము లను గొనెడు వాడు పరమాత్ముండే

    రిప్లయితొలగించండి
  27. నేటి సమస్యాపూరణం

    వేణురవము గోపికలను
    స్థాణువులనుచేసెను మది స్థాయిని తప్పెన్
    అణువణువునయార్తినిలిపి
    ప్రాణములనుగొనెడువాడు పరమాత్ముండే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అణువణువున నార్తి...' అనండి.

      తొలగించండి
  28. ధ్యానము తో విధిని గొలిచి
    రేణువు రేణువున నతని రీతుల బొగడ
    న్నూనగ ముక్తి నొసంగగ
    ప్రాణములను గొనెడువాఁడు పరమాత్ముండౌ

    రిప్లయితొలగించండి
  29. వేణూమాధవుడిలలో
    జాణుండై పాడగ నడుగులు జల్లన మగువల్
    ప్రాణము లొడ్డుచు వత్తురు
    ప్రాణములను గొనెడివాడు పరమాత్ముడౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేణుమాధవు'ని 'వేణూమాధవు' డనారు. రెండవ పాదంలో గణదోషం. 'వేణుధరుం డీభువిలో। జాణగ పాడగ..' అనండి.

      తొలగించండి
  30. కం. జాణ తనము తోడన్నీ
    క్షోణిన్ చెలరేగి జనుల క్షోభకు కతమౌ
    జాణల, దుష్ట నియంతల
    ప్రాణములను గొనెడు వాడు పరమాత్ముండౌ.

    రిప్లయితొలగించండి
  31. కారుచు ముద్దుముచ్చటలు గారము నొప్పుచు గోలజేయుచున్
    కోరుచు జోలపాటలను కొండొకచో చిచితట్టు గోకుటన్
    పోరుచు రాత్రియున్ పవలు ప్రొద్దున సాయము నాడమంచుచున్
    వారక ప్రాణముల్ గొనెడువాఁడు గదా పరమాత్ముఁ డన్నచో!

    రిప్లయితొలగించండి