23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

చమత్కార పద్యాలు – 216/2

త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

రెండవ అర్థము - శివ స్మరణ           

భూరి జఠర = పెద్ద కడుపు గల విఘ్నేశ్వరునకు
గురుఁడు = తండ్రియైనవాడును,
నీరజ + అంబక = అగ్ని నేత్రము యొక్క
భూతి = సత్తా గలవాఁడును,
మహిత = శూలము
కరుఁడు = హస్తమందు గలవాఁడును,
అహీన మణి = సర్పరాజ శ్రేష్ఠము
కలాపుఁడు = భూషణముగా గలవాఁడును,
అలఘు = ఘనతరమైన
సత్ + గణేశుఁడు = శ్రేష్ఠమైన ప్రమథగణమున కధీశుఁడైనవాడును,
అగ్ర = చివరిదైన
గోపుఁడు = దిక్కున కధిపతి యైనవాఁడును,
(లేక)
అగ్ర = పై భాగమున (అనగా సిగయం దనుట)
గోపుఁడు = కళాపతి (చంద్రుఁడు) గలవాఁడును,
మహా + అమర్త్యసింహుఁడు = గొప్ప దేవతాశ్రేష్ఠుఁడును (అగు శివుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

7 వ్యాఖ్యలు:

 1. బొజ్జగణపతిపిత పుక్షినేత్రమువాడు
  శూలపాణి సర్ప శోభితుండు
  ప్రమథ గణములపతి పైదిక్కుకధిపతి (రాజమౌళియె మిమ్ము)
  దేవరాయడేలు దివ్యముగను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఘనతరోదరునకు జనకుడు ముక్కంటి
  త్రిశిరకరుడు నుగ్ర ద్విజధరుండు
  గణములకు నధిపుడు కకుభాగ్ర నాథుండు
  యెల్ల సురల వేల్పు నేలు మనల

  త్రింశదర్థ పద్యం నిజంగా అనర్ఘరత్నమే.గురువుగారికీ పోకూరి వారికీ కృతజ్ఞతలు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఘనతరోదరునకు జనకుడు ముక్కంటి
  త్రిశిరకరుడు నుగ్ర ద్విజధరుండు
  గణములకు నధిపుడు కకుభాగ్ర నాథుండు
  యెల్ల సురల వేల్పు నేలు మనల

  త్రింశదర్థ పద్యం నిజంగా అనర్ఘరత్నమే.గురువుగారికీ పోకూరి వారికీ కృతజ్ఞతలు

  ప్రత్యుత్తరంతొలగించు

 4. భవ హ ర !శివమ ణి ధరుడ ! వరద !భువిని
  రుద్ర భూమిగ జేసెడి క్షుద్ర జనము
  నణచి కాపాడు మమ్ముల యభయ మిచ్చి
  నిన్నె సేవించు కొందును నిరత మయ్య !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు

  1. పరమాత్మని శి వునందురు
   పరమాత్మయె కార ణంబు వాయువు వీ చన్
   పరమాత్మయె ది శ లన్నియు
   పరమాత్మయె జీ వ కో టి పరి కిం పం గాన్.

   తొలగించు
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, అశ్వత్థ నారాయణ గారికి, సుబ్బారావు గారికి ధన్యవాదాలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మాన్య గురువులు శ్రీ కంది శంకరయ్య గారికి నమస్సులు. మీరందిస్తున్న ఈ సాహితీ విశేషాలు, నిర్వహిస్తున్న భాషాసేవలు అనితర సాధ్యం. అద్భుతమైన విషయ సమాచారమెంతో ఆసక్తిని కలిగిస్తోంది. ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు