4, సెప్టెంబర్ 2016, ఆదివారం

సమస్య - 2135 (కవిసమ్మేళన మనంగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కవిసమ్మేళన మనంగఁ గడు భీతిల్లెన్"
లేదా...
"కవిసమ్మేళన మన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్"

41 వ్యాఖ్యలు:

 1. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కవిగాకున్నను ధనమిడి
  కవితలు గైకొని కవివలె కదలెడి నతడా
  తివురుగ కవితలు జెప్పెడి
  కవిసమ్మేళన మనంగ గడు భీతిల్లెన్.

  (తివురుగ = ఆశువుగా ; వేగంగా/త్వరగా)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ప్రవరంబైన కవిత్వమున్ నిధనులై పర్యాకులత్వంబునన్
  కవులమ్మన్ గొని కోవిదుండనని బింకాలెన్నియో జూపుచున్
  పొవరున్ జెందెడి వాడు సంభ్రమమునన్ పూరించు పద్యాలదౌ
  కవిసమ్మేళనమన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్.

  ప్రత్యుత్తరంతొలగించు


 3. కవులకిదే ఆహ్వానము !
  రవీంద్ర భారతికి రండు రసమయ వేళన్
  కవితా జిలేబి గానము !
  కవి, సమ్మేళన మనంగఁ గడు భీతిల్లెన్ :)

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సవితా పావక రూపు దాల్చి నడతన్ సర్వంసహోత్కంఠతన్
  భవితన్ దిద్ద స్వతంత్ర భారతమునన్ బాధ్యుండె పో సత్కవీ
  ఛవినిన్ గాంచిన దుష్ట నేత చవటౌ ఛాత్రుండునా నొప్పు తా
  (నేత ఖలుడౌ ఛైద్యుండునా నొప్పె)
  కవి సమ్మేళనమన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కవియన తెలుపగు కాకియె
  కవనంబున రక్తి నెరప గల్గక యున్నన్
  సవరణకు నిచ్ఛగించక
  కవి,సమ్మేళన మనంగ కడు భీతిల్లెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సవితా పావక రూపుదాల్చి నడతన్సర్వం సహోత్కంఠతన్
  భవితన్ దిద్ద స్వతంత్ర భారతమునన్ బాధ్యుండ్రె పో సత్కవుల్
  ఛవినిన్ గాంచక దష్ట నేత చవటౌ ఛాత్రుండునా నొప్పె తా
  కవి సమ్మేళన మన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్

  ప్రత్యుత్తరంతొలగించు
 7. నవకవి యుబలాటమ్మున
  వివరించగబూనె కవిత వేదికపైనన్
  కవిగణ పాండితి గని యా
  కవిసమ్మేళన మనంగ గడు భీతిల్లెన్!

  ప్రత్యుత్తరంతొలగించు

 8. కవనమునేర్చెనుగ్రొత్తగ
  కవిశ్రేష్ఠులయెదుటజెప్పకవనముమిగులన్
  వికలితహృదయుండగుటన
  కవిసమ్శేళనమనంగగడుభీతిల్లెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 9. --శుభోదయం-----------------------------

  కవిచేత విభుడు విభుచే
  గవి,సభ, కవివిభుల చేత కడు విలసిల్లున్
  రవి చే రుచి రుచిచే రవి
  రవి రుచి విభవమున నభము రంజిల్లు క్రియన్

  కవి వలన రాజు,రాజువలన కవి,వారిద్దరివలన సభ వెలుగుతుంది.ఎలాగయితే
  సూర్యుని వలన కాంతి , కాంతి చేత సూర్యుడు,వీరిరువురి వలన ఆకాశము కాంతివంత మవుతుందో అలాగ

  భువి షడ్రసముల నాలుక
  జవి గొనగా జేసే బ్రహ్మ సత్కృతి వలనన్
  జెవి నవరసములను జవిగొన
  గవి జేసెను బ్రహ్మకంటెగవి యధికుడగున్
  (ఇది విక్రమసేన మందలిది)
  ఫేస్ బుక్ నుండి గ్రహింపబడినది.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. కవియైనను పదుగురెదుట
  కవనము జెప్పంగ కాళ్లు గడగడ వణకున్
  స్తవనీయులు కొలువుండెడు
  కవిసమ్మేళన మనంగఁ గడు భీతిల్లెన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 12. రవి యను కవి లేడూరన్
  వివరముగా రాసియివ్వ వేగము మీదన్
  దేవా! నీవే దిక్కని
  కవిసమ్మేళన మనంగఁ గడు భీతిల్లెన్
  (రవి అనే ఘోస్ట్ రైటర్తో రాయించే కవి వూరు వెళ్ళగా వాపోతూ ఓ కవి భయపడే సన్నివేశం)

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ప్రత్యుత్తరాలు
  1. రవి యొక్కడున్న చాలును
   ఛవి తాపము సైప లేక సంత్రస్తు లవన్
   భవితవ్యము దేవుఁ డెరుగుఁ
   గవిసమ్మేళన మనంగఁ గడు భీతిల్లెన్


   కవనోగ్రాంశు సమాన తేజ రచనా కంజప్రతీకాశు లీ
   భువ నాకాశ విరాజమాన రవి వైభోగాత్త విద్వాంసులున్
   చవిమత్కంకణ ధారు లుత్తముల వాచా భూషణాయత్త మీ
   కవిసమ్మేళన మన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్

   తొలగించు
 14. కవనముతో నలరింపగ
  నవిరళమగు గాత్రము తనకబ్బక పోవన్
  చెవి కింపు సేయు టెటులని
  కవి సమ్మేళనమనంగ గడు భీతిల్లెన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఎవియో పద్యము లల్లుచు
  నవి సఖులకును వినిపింప నతనిన్ మదమున్
  ఎవరో ఆహ్వానింపగ
  కవి సమ్మేళన మనంగ కడుభీతిల్లెన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  చెవికిన్ గమ్మలు , స్వర్ణ క౦కణము

  ……… ము౦జేతిన్ , భుజ౦బ౦దు శా

  లువ , పె౦డేరము కాలికిన్ , సొగసుగా

  ………… దాల్చున్ | లేదు పా౦డిత్య మే

  లవమున్ | పౌ౦డ్రక వాసుదేవు డనగా

  ………… రాజిల్లు నాత౦డు , స

  త్కవితన్ జెప్పగ లేడు | " డబ్బు " లిడి

  ………… సత్కార౦బులన్ బొ౦దుచున్

  ' కవి భీభత్స' యటన్న పేరు " కొనియెన్ " |

  ……………… గా౦చ౦ గదే మిత్రమా !

  కవిసమ్మేళన మన్న భీతిలెను

  …………… "బ౦గారయ్య " విన్నావటోయ్ల

  { పేరు కొనియెన్ = డబ్బులిచ్చి బిరుదు కొనెను }

  ప్రత్యుత్తరంతొలగించు
 17. స్తవనీయులు,విద్వాంసులు,
  అవధానులు,సరస వి.ర.స. అ.ర.సుల సభలో
  కవన మెరుగ,నల్పుడ నని
  కవిసమ్మేళన మనంగఁ గడు భీతిల్లెన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ప్రత్యుత్తరాలు
  1. భవ బంధంబులు వీడి నిత్యమును సంపత్త్యాశతో కాలమున్
   బవలున్ రాత్రులు గడ్పువానికిని సంభావ్యంబ సాహిత్య మీ
   యవనిన్, వైభవ కాంక్షులన్ వలచునా? యావాణి యదే
   కవిసమ్మేళన మన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్.

   తొలగించు
 19. శవపూజల్ నడుమన్ శ్మశాన ఘననిశ్శబ్దంబు ప్రేతాత్మ గౌ
  రవ వాదంబులు పుర్రె చిట్లు రవముల్ రాబందు లాస్యంబు భై
  రవ నాదంబులు ఫేరవధ్వనుల క్షుద్రంబైన కావ్యాలతో
  కవిసమ్మేళన మన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్!!

  ప్రత్యుత్తరంతొలగించు
 20. శ్రవణానందమునింపక
  సవరణ పద్యాలు వ్రాసి సభలో జదువన్
  కవనము తడబడునెందుకొ?
  కవిసమ్మేళన మనంగ గడు భీతిల్లెన్|
  2.అవలీ లేనట గద్య పద్యముల విన్యాసాల విజ్ఞానమున్
  భవితవ్యంబుకు వ్రాసి పంచగల సంబంధంబు లెన్నున్న?తా
  కవితాశక్తి సభా ముఖంబుగను లక్ష్యంబుంచ కాదెందుకో
  కవిసమ్మేళన మన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్|

  ప్రత్యుత్తరంతొలగించు
 21. స్తవనీయులు,విద్వాంసులు,
  అవధానులు,వి.ర.స.కవులు,అ.ర.స.ల చెంతన్
  కవనమ్మెరుగని వాడని
  కవిసమ్మేళన మనంగ గడుభీతిల్లెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 22. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. అవినీతి మంతుడైన,ప
  దవిన శునకమైన మంత్రి తానే యతిథై
  కవితలు తేళ్ళై కుట్టగ
  కవిసమ్మేళన మనంగఁ గడు భీతిల్లెన్


  కవిసామాన్యు డొకండు గర్వమున గంగై పొంగుచున్ ముంచగా
  భువి నెవ్వాని గణింప నట్టి యొకడున్ పొత్తమ్ముతో మొత్తగా
  రవిచంద్రాదులు కూడ చూడక పరారౌ దాని కాహూతుడై
  కవిసమ్మేళన మన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్"

  ప్రత్యుత్తరంతొలగించు
 24. కవిగా నిప్పుడె క్రొత్త క్రొత్తగను ప్రఖ్యాతమ్ములౌ కైతలన్
  నవకంబైన విధమ్ముగాను మరియున్ నాణ్యమ్ముగా వ్రాయుచున్
  ప్రవచింపంగ సభా ముఖమ్ముగను సంప్రాప్తించ లేకెన్నడున్
  "కవిసమ్మేళన మన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్"!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 25. అవధానమ్ములనారితేరి ,కవితోద్యానమ్ము నిర్మించి, వృ..
  ద్ధవయస్కుండయి,రుగ్మతల్ బడసి,సంతప్తుండునైయుండగా
  కవిసమ్మేళనమంచు బిల్వనతనిన్ "కాదంచు రాలేననన్"
  కవిసమ్మేళనమన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్ !!

  ప్రత్యుత్తరంతొలగించు
 26. కవిగా మన్ననలందగా దగిన సత్కావ్యంపు శబ్దార్థముల్
  నవసౌందర్యవిలాస రాసులగు విన్నాణంపుభావార్థముల్
  స్తవనీయంబగు పాండితీపటిమ వైశారద్యముల్లుప్తమై
  కవిసమ్మేళనమన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్.

  కవిగా నటనము జేయుచు
  రవి తా వేషంబు వేసి రాణకునెక్కెన్
  కవనపు పటిమది లేమిని
  కవిసమ్మేళనమనంగ గడు భీతిల్లెన్.

  ప్రత్యుత్తరంతొలగించు

 27. కవితలు వ్రాయగ నేరక
  కవిపండితుడనని పల్కి కటకట పడుచున్
  వివిధ కవుల తోడ నచట
  కవిసమ్మేళనమనంగ గడు భీతిల్లెన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. కవిగానివాడు తన కవిమిత్రుని కవితలు
  కవి కలము పేరు మార్చి ప్రచురణ జేసి పలు
  కవితలు జనాదరణ కలుగ ఇరువురి పేర్లు
  కవికులమున ఒక్కటిగా నుండ పిలిచిరి
  కవిసమ్మేళన మనంగఁ గడు భీతిల్లె

  ప్రత్యుత్తరంతొలగించు
 29. శంకరాభరణం కవి మిత్రులకు ,పండితులకు గురువర్యులు శ్రీ శంకరయ్య గారికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు
  శ్రీగణనాయకా వరదసిద్ధి వినాయక ఆదిపూజితా
  ఆగమ వందితా సురగణార్చిత విఘ్నవినాశ కారణా
  వేగమె నాతలంపు నెరవేర్పర బాల శశాంక భూషణా
  భోగి భిభూషణా సుజనపోషణ భూరిభవాబ్ది శోషణా
  (రచన:వడ్డూరి అచ్యుత రామకవి.)

  ప్రత్యుత్తరంతొలగించు
 30. కవివరుల కవిత తనదని
  నవశకమున కవిగ కీర్తి నందిన నొకనిన్
  ''భవదీయ గళమున కవిత
  కవిసమ్మేళన'' మనంగఁ గడు భీతిల్లెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 31. కవితాశక్తియు లేకను
  కవిసమ్మేళన మనంగగడు భీతిల్లెన్
  అవిరళ కృషి సాధకులట
  వివరణలన్ నడుగబూన?విధి వక్రించున్|

  ప్రత్యుత్తరంతొలగించు
 32. కవిమిత్రులారా,
  నమస్కృతులు. ఈరోజు ఉదయం మిర్యాలగూడలో పుస్తకావిష్కరణకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఉన్నాను. మీ పూరణలను రేపు ఉదయం సమీక్షిస్తాను. మన్నించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. ధృవతారల బోలు మహా
  కవివర్యుల సద్విమర్శ కవనకషాయముల్
  చవిగొన యధికార గణము
  కవిసమ్మేళనమనంగ కడు భీతిల్లెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 34. బంగారయ్యపై లోకుల మానసం:

  ద్రవిణమ్మెంతయొ కూడబెట్టి తగు కార్యక్రమ్ములన్నిర్వహిం
  చి, వదాన్యుండని పేరుఁ బొందెఁ బలు సంక్షేమాలఁ జేపట్టుచున్
  చివరన్ రాబడి సన్నగిల్లఁ దను దాచెన్ మోము! పర్వమ్ములన్
  గవిసమ్మేళన మన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్?

  ప్రత్యుత్తరంతొలగించు
 35. ఎవరో వేదిక లెక్కి కైత లని తా మేమేమిటో వేడిగా
  చెవులన్ గింగురు లెత్తు రీతి నరముల్ చిట్లంగ నావేశమే
  ప్రవహింపంగను పాడుచుంద్రు మనలే బాబోయి నేనంచు తా
  కవిసమ్మేళన మన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్!

  ప్రత్యుత్తరంతొలగించు

 36. కవికది మోదమ్మేనట
  కవిసమ్మేళన మనంగ, గడు భీతిల్లె
  న్నవధానమ్మును జేయమ
  నివినయముగను కవి గోర నెయ్యపు కాండ్రే

  కవనమ్మల్లెడు ప్రజ్ఞతో నొకడు సత్కావ్యమ్ము లెన్నింటినో
  యవలీలన్ రచియించి పండితుల దివ్యాశీస్సులన్ పొందినన్
  కవిగా వేదిక నెక్కబోవడు సభాకంపంబుతోగావునన్
  కవిసమ్మేళనమన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్

  ప్రత్యుత్తరంతొలగించు
 37. మాడరేషన్ కారణంగాను, ప్రయాణంలో ఉన్నందున పూరణలు ఏవైనా తప్పిపోతే దయచేసి తెలియజేయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 38. కవుల సమావేశ పరచి
  కవితలను వినక సతతము కబురులతోడన్
  వ్యవహారము చేయు జనుల
  కవిసమ్మేళన మనంగ కడుభీతిల్లెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 39. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అనుమతి నిబంధన తో మీరెక్కువ శ్రమ తీసుకుంటున్నారని మా యావేదన.

  ప్రత్యుత్తరంతొలగించు