22, సెప్టెంబర్ 2016, గురువారం

చమత్కార పద్యాలు – 216/1


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

మొదటి అర్థము - గణపతి స్మరణ

భూరి = పెద్దయగు
జఠర = కడుపు గలవారిలో
గురుఁడు = గొప్పవాడును,
నీరజ = నీటఁ బుట్టిన యగ్ని
అంబక = నేత్రముగాఁ గల శివునకు
భూతి = పుట్టినవాఁడును,
మహిత = అతిశయమైన
కరుఁడు = తొండము గలవాఁడును,
అహీన మణి = సర్పరాజ శ్రేష్ఠము
కలాపుఁడు = అలంకారముగా గలవాఁడును,
అలఘుసత్ = అధిక శ్రేష్ఠమైన
గణేశుఁడు = గణేశ నామము గలవాడును,
అగ్ర = ముఖ్యమైన
గోపుఁడు = వాక్కులు గల ప్రభువైనవాఁడును,
మహా = గొప్పయగు
అమర్త్యసింహుఁడు = దేవతాశ్రేష్ఠుఁడును (అగు గణపతి)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

10 కామెంట్‌లు:

  1. గణపతి ప్రార్ధన జదువగ
    నణువణువును బులక రించె నార్యా !నాకున్
    గణముల కధిపతి యగుటన
    బ్ర ణ తుల నేనిడుదు నిపుడు భక్తిని మిగులన్

    రిప్లయితొలగించండి
  2. పెడ్డబొజ్జవాడు బేసినేత్రు సుతుడు
    కరము పొడవువాడు యురగధారి
    వాడుగణపతి ఘన వాక్కులకధిపతి
    యమరసింహుడేలు ననవరతము.

    రిప్లయితొలగించండి
  3. బానకడుపువాడు ఫాలనేత్రు సుతడు
    పొడుగు తొండమున్న భుజగధరుడు
    బహుగణాధిపుండు వాగధి నాథుండు
    సురవరుండు మనకు శుభములిచ్చు

    రిప్లయితొలగించండి