27, సెప్టెంబర్ 2016, మంగళవారం

చమత్కార పద్యాలు – 216/6


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

6వ అర్థము అగ్నిదేవ స్మరణ        

భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గలవారిలో గొప్పవాడును (సర్వభక్షకుఁడు),
నీరజ = పద్మములు
అంబక = బాణములుగా గల మన్మథుని యొక్క,
భూతి = భస్మము గలవాఁడును,
మహిత కరుఁడు = అతిశయమైన కిరణములు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్పతనమే మణిభూషలుగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప సోమయాజులు మున్నగు సాధుగణముల కధీశుఁ డైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్య దిక్పతి యైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = గొప్ప దేవతాశ్రేష్ఠు డైనవాఁడును (అగు అగ్నిదేవుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

2 కామెంట్‌లు:

  1. సర్వభక్షకుండు సరసిజాంబక భస్ము
    డతికిరణుడును మణిహార ధరుడు
    యాజిగణములపతి యతిగొప్ప దిక్పతి
    అమరముఖ్యుడేలు నగ్ని మనల.

    రిప్లయితొలగించండి
  2. సర్వ భక్ష కుండు సద్గణ నాధుడు
    మహిత కరుడు మఱియు మణిక లాపు
    డైన యగ్ని దేవు డ హరహమ్ముమనల
    గాచు గాత ! తాను గాపు నగుచు

    రిప్లయితొలగించండి