16-10-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”
(లేదా...)
“కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో”
(న.చ. సాహిత్ శతావధానంలో జంధ్యాల సుబ్బలక్ష్మి గారి సమస్య)
పురజను లిచ్చిరి యతనికి కరచరణాల్ గోటులు ; దలకాయల్ లక్షల్మెరమెచ్చులాడు రీతిగ నురియాడుచునుండె నతని యుపలబ్ధి గనన్
అరయగ జరిగిన భీకరకురుపాండవయుద్ధమందు గూలిరనేకుల్తరమౌనా లెక్కించగ“కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”గండూరి
కందంఇరుదేశమ్ముల దురమునజరిగెను నరమేధ మెపుఁడు జరుగని రీతిన్ఒరిగెను నేలకు మనుజులకరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్
పరమాత్ముండా శ్రీహరి తిరుమలపై నిలిచె నంచు తిరువడు లెల్లన్ దరలగ తిరువెంగడమున కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్.అరమెయి జోదు వాడు త్రిపురాంతకు డాతడె వేడి నంత యు ద్ధరణము నిచ్చు వాడని సదాగతి గోరుచు భక్తు లెందరో ఖరువు సమీక్షణమ్ము కయి కాశి పురంబున కేగు నట్టి యా కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో.
పురజను లిచ్చిరి యతనికి
రిప్లయితొలగించండికరచరణాల్ గోటులు ; దలకాయల్ లక్షల్
మెరమెచ్చులాడు రీతిగ
నురియాడుచునుండె నతని యుపలబ్ధి గనన్
రిప్లయితొలగించండిఅరయగ జరిగిన భీకర
కురుపాండవయుద్ధమందు గూలిరనేకుల్
తరమౌనా లెక్కించగ
“కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”
గండూరి
కందం
రిప్లయితొలగించండిఇరుదేశమ్ముల దురమున
జరిగెను నరమేధ మెపుఁడు జరుగని రీతిన్
ఒరిగెను నేలకు మనుజుల
కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్
రిప్లయితొలగించండిపరమాత్ముండా శ్రీహరి
తిరుమలపై నిలిచె నంచు తిరువడు లెల్లన్
దరలగ తిరువెంగడమున
కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్.
అరమెయి జోదు వాడు త్రిపురాంతకు డాతడె వేడి నంత యు
ద్ధరణము నిచ్చు వాడని సదాగతి గోరుచు భక్తు లెందరో
ఖరువు సమీక్షణమ్ము కయి కాశి పురంబున కేగు నట్టి యా
కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో.