15, అక్టోబర్ 2026, గురువారం

సమస్య - 5621

16-10-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”

(లేదా...)

“కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో”

(న.చ. సాహిత్ శతావధానంలో జంధ్యాల సుబ్బలక్ష్మి గారి సమస్య)

5 కామెంట్‌లు:



  1. అరయగ జరిగిన భీకర
    కురుపాండవయుద్ధమందు గూలిరనేకుల్
    తరమౌనా లెక్కించగ
    “కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”
    గండూరి

    రిప్లయితొలగించండి
  2. కందం
    ఇరుదేశమ్ముల దురమున
    జరిగెను నరమేధ మెపుఁడు జరుగని రీతిన్
    ఒరిగెను నేలకు మనుజుల
    కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్

    రిప్లయితొలగించండి

  3. పరమాత్ముండా శ్రీహరి
    తిరుమలపై నిలిచె నంచు తిరువడు లెల్లన్
    దరలగ తిరువెంగడమున
    కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్.


    అరమెయి జోదు వాడు త్రిపురాంతకు డాతడె వేడి నంత యు
    ద్ధరణము నిచ్చు వాడని సదాగతి గోరుచు భక్తు లెందరో
    ఖరువు సమీక్షణమ్ము కయి కాశి పురంబున కేగు నట్టి యా
    కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో.

    రిప్లయితొలగించండి
  4. దురము కొనసాగిన యెడల
    కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”
    ధరణిపయి చెదరి యుండుట
    నరయగ , నెవరికయిన నెద యలజడి నొందున్

    రిప్లయితొలగించండి