1, మార్చి 2021, సోమవారం

సమస్య - 3650

2-3-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్ర”
(లేదా...)
“చేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో”

67 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    నేర్చి నేర్చి నాల్గు నెలలు నెత్తి బాది కొల్కతన్
    చర్చ జేసి రచ్చ జేసి చావు బ్రతుకు మధ్యనున్
    మార్చి మార్చి యిడగ నవ్వి మందులయ్య "హోమియో"
    చేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో...

    రిప్లయితొలగించండి
  2. ఉదరసంబంధిరోగమునుపశమింప
    మాయఁజేయుచుసుద్దనుమాటుఁజేసి
    వైద్యుడీయంగమిత్తియెవేగవచ్చె
    చేర్చుపరలోకమునకునీచేతిమాత్ర

    రిప్లయితొలగించండి
  3. ధనమదాంధుడ వైనట్టి చెనటి వీవు
    దొడ్డి దారిని పత్రాలు దొంగిలించి
    వైద్యుడవయిన యోగులవాడవు కద
    చేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్ర.
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  4. కోటి విద్యలు నేర్చుట కూటి కొరక
    టంచు భావించియును వైద్యు డైతి వయ్య
    ఎట్టి అనుభవము ను లేక నెఱుక లేక
    చేర్చు పర లోకమునకు నీ చేతి మాత్ర

    రిప్లయితొలగించండి
  5. శివుడు చెప్పినంత యముడు చెడ్డ జనుల

    చేర్చుఁ బరలోకమునకు :; నీచేతి మాత్ర

    మునను బాలుని కాలుని ముద్దు కోర

    బారినుండి కాచితివయ్య పార్వతీశ

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  6. ఖర్చుకువెనుకాడకుండ కాసులవెద జల్లి యా
    కుర్చి నెక్కినట్టి దుష్ట కుటిల నేతఁ గొన్న నీ
    వర్చకుడవు గాదె కనగ ననృత వైద్యుడవుగదా
    చేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో!
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  7. సమస్య :

    చేర్చును పరలోకము దమ
    చేతిమాత్ర యయ్యయో

    ( ఎనిమిదేండ్లు వైద్యవిద్య నభ్యసించిన M . D .వైద్యుని వదలి కబుర్లు చెప్పి కల్లమందులతో కాలం గడిపే కపటవైద్యునితో రోగి )

    ఉత్సాహము
    ...................

    నేర్చి నేర్చి వైద్యవిద్య
    నెన్మిదేండ్లు దీక్షగన్ ;
    తీర్చి యేర్చి మందులిచ్చు
    ధీరవైద్యు డుండగా
    మార్చి యతని మిమ్ము నమ్మ
    మాత్ర పెంచె మా రుజన్ ;
    జేర్చును పరలోకము దమ
    చేతిమాత్ర యయ్యయో !

    రిప్లయితొలగించండి
  8. చేర్చినాను నాదు సుతుని
    జేతువంచు వైద్యమున్
    మార్చ లేను నీదు మందు
    మాననీయ వైద్యుడా
    ఓర్చుకొందు డబ్బు లన్ని
    యూడిపోయినా సరే
    చేర్చును పరలోకము దమ
    చేతి మాత్ర అయ్యయో"

    రిప్లయితొలగించండి
  9. ఉత్సాహము:

    కూర్చిరి మన వైద్యలిటను క్రూరరుజ కరోన పో
    నార్చ నౌషధంబు, జనమునందు మృత్యు బాధలన్
    తీర్చ వేగ, వెజ్జు సంప్రతించకుండ వాడిరో
    చేర్చును పరలోకము దమ చేతి మాత్ర యయ్యయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల

      కూర్చిరి నూత్న యౌషధము క్రూర కరోనను విశ్వమందు పో
      నార్చగ మేటి వైద్యులిల నంకిత మిచ్చిరి భారతాంబకున్
      తీర్చిన మందు సత్వరము తీరుగ వాడక నున్న తప్పకన్
      చేర్చును నాకమందు దమ చేతను మ్రింగిన మాత్రయయ్యయో

      తొలగించండి
    2. ఉత్సాహము:

      మార్చి వచ్చె మందు వచ్చె మారలేదు మనము, యే
      మార్చుటె మన పథము, మాస్కు మాని, మాట వినక తా
      మోర్చుకొనుటె తథ్యమౌ, విమోచనంబె సత్యమై
      చేర్చును పరలోకము దమ చేతి మాత్ర యయ్యయో

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఉత్పలమాలలో 'నూత్న+ఔషధము' అన్నపుడు వృద్ధిసంధి, యడాగమం రాదు. "క్రొత్త యౌషధము" అనవచ్చు.
      మూడవ పూరణలో 'మనము+ఏమార్చుటె' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  10. వ్యాధు లకుమందు పడకున్న, వ్యధ మములను
    చేర్చుఁ బరలోకమునకు, నీచేతి మాత్ర
    తీర్చు మాబాధలెపుడును తీరుగాను
    చల్లగ మను నువ్వెపుడును సంతసముగ

    రిప్లయితొలగించండి
  11. ఏమి వైద్యుడవిగనీవు? ఇలన మాకు
    కలుగు వ్యాధులకును నీవు కనికరముగ
    నయము చేయుమందీయవు న్యాయముగను,
    చేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్ర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఏమి వైద్యుడ వౌర నీ విలను మాకు । కలుగు వ్యాధులను నెరింగి కనికరమున..." అనండి.

      తొలగించండి
  12. నేర్చితిమని వైద్య వృత్తి నీతి దప్పి జనుల నే
    మార్చినారు గాని మీదు మాయ మాటలన్నియున్
    ఓర్చుకొనగ జాలమింక నొదులుడయ్య మమ్ములన్
    చేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వదలుడు'ను 'ఒదలుడు' అనరాదు. సవరించండి.

      తొలగించండి
  13. చర్చలేలనింక ధనము చాల ముట్టినట్టు నా
    ఖర్చుయెంతగాని బ్రతుకు గావమనుచుకోర నే
    మర్చిపోనెపుడును నీదు మందుల మహిమ తగునా
    చేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరొన బాధితులన్నను కనికరమ్ము
      లేక గడుసైన రీతిన పైకమడిగి
      మోసపు విధాల జనులను ముంచనేల
      చేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్ర

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. కోవిడు సమయమున మందుకొరకు వెజ్జు
    వద్దకిపుడు బోదగదు నావద్ద నున్న
    నల్ల బిల్లలె దగునన నమ్మినయెడ
    చేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్

    రిప్లయితొలగించండి
  15. మార్చి దొంగ నోట్లు , దొంగ మధువు కాచి ప్రభుతనే

    మార్చి , ధనము కూడవెట్టి , మంత్రి పదవి పట్టి , చే
    కూర్చె దొంగ వైద్య బిరుదు కొడుకుకతడు ప్రీతిగన్

    చేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 3 వ పాదములో
      ప్రీతిగన్. బదులుగా “చూడగన్” అని చదువుకొన వలసిందిగా, విన్నపము

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వైద్య బిరుదు' సమాసం సాధువు కాదు. సవరించండి.

      తొలగించండి
  16. పిచ్చిముదిరివిచ్చలవిడివెచ్చనైనమద్యమున్
    హెచ్చుతగ్గులెంచకుండనిచ్చవచ్చినట్టులన్
    బుచ్చుకొనగహెచ్చెవేడిమొరటువెజ్జుజేరినన్
    *జేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో”*

    రిప్లయితొలగించండి
  17. తేటగీతి
    పేర్చి కుప్పలుగ ధనమ్ము గూర్చ నీకు
    ఆరువత్సరములు వైద్యమనెడు విద్య
    మెదడు మోకాలు నందున మెదలు నంటె¡
    చేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్ర!

    ఉత్సాహము
    పేర్చి కుప్పలుగ ధనమ్ము పేర్మి వైద్య విద్యయే
    నేర్చ నెంచ నిన్ను గోర నీదు తండ్రి యాశతో
    కార్చికంటనీరు నీవు కాళ్ల మెదడుఁ జూపితే¡
    చేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో!

    రిప్లయితొలగించండి
  18. తేటగీతి(షట్పది)
    నిజము నెరుగక నొజ్జపై నిందవేసి
    అలుసు భావాన మాట్లాడి నగుడు జేయ
    పాడి గాదని వేడెద పదుగురెదుట
    మంచి మనసుతో బల్కుమా మాన్యులార
    తరుణమిది గాదు నీరీతి తప్పుబల్క
    "చేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్ర"

    రిప్లయితొలగించండి
  19. శ్రీ గురుభ్యోనమః

    ఖర్చుజేసి కోట్లు దమరు గౌరవంబు బొందిరే
    నేర్చినట్టి విద్యనొదిలి నీతిలేని సాధనై
    కూర్చనాస్తి నంతులేక కూడె దుష్ట కూటమిన్
    చేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వదలి'ని 'ఒదిలి' అనరాదు. "విద్య విడిచి" అనండి. 'సాధన+ఐ' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారు సవరించుకుంటాను 🙏

      తొలగించండి
  20. వలదువలదురా బావ!నీవైద్య మిపుడు
    చేర్చు బరలోకమునకు నీచేతిమాత్ర
    బలుసు పత్రము నైనను భక్షణంబు
    జేసిబ్రదుకుదు వలదునీ చేదుమందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పచ్చి బలుసాకునైనను..." అనండి.

      తొలగించండి
  21. మైలవరపు వారి పూరణ

    విసిగి వేసారిన రోగి...

    ఖర్చు జూచి మూర్ఛనంది కాదు నయము రోగమన్
    గార్చి కార్చి యశ్రువులను కన్నులెండిపోయెడిన్
    మార్చి మార్చి వైద్యతతిని మరల మిమ్ము జేరితిన్
    జేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  22. తెలిసి దెలియని వైద్యము తెలివిమాలి
    చేసి యెందరి యుసురును చేకొనెదవు
    వలదు వలదన్న వినవేల వద్దురోరి
    చేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్ర

    రిప్లయితొలగించండి
  23. ఖర్చు పెరిగి పోవునంచు కడకు మిమ్ము జేరితిన్
    మార్చి మార్చి తోచినట్లు మందులిచ్చుచుంటిరే
    ఓర్చుకొంటి నింత తడవు నో మహా భిషగ్వరా!
    చేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో

    రిప్లయితొలగించండి
  24. వలదు వలదుమాత్ర యీయ వలదుబావ!నాకుగా
    జేర్చును బర లోకముదమ చేతి మాత్ర యయ్యయో
    బ్రతికి యుండ తిందు నికను బలుసు పత్ర మిపుడు,నా
    జీవి యుండు నంత దనుక చేదు మందు దినను రా

    రిప్లయితొలగించండి
  25. ఉత్సాహము :

    కూర్చు మనుచు పెండ్లి విందు కోరి మిమ్ము వేడగన్
    తీర్చు పాక చతురు లింట తీరు వంట లంచనన్
    మార్చి రెల్ల రుచులు విధిని మారు బల్కి రిట్లు గన్
    చేర్చును పర లోకము దమ చేతి మాత్ర యయ్యయో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  26. పాపులను సాగనంపెడి పరమపూజ్య
    చేతి మహిమయు నెంతయో జెప్పలేము
    ఘనత పొందితివైద్యవృత్తినన, నీవు
    చేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్ర

    రిప్లయితొలగించండి
  27. ఓర్చుకొనుచు నొప్పులన్నియోర్పుతోడనిత్యమున్
    ఖర్చుకు వెనకాడ కుండ కాసులెన్నొ రాల్చితిన్
    జేర్చుకున్న వైద్యులు గని చీదరించ, నేడిటన్
    జేర్చును పరలోకముఁ దమ చేతిమాత్ర యయ్యయో
    అసనారె

    రిప్లయితొలగించండి
  28. ఒలుకు మకరందమే నీదు పలుకు లందు
    దాటు నీ భాషణమ్ములు కోట గోడఁ
    జేత లవి మార్చు మా తల వ్రాత లెల్ల
    జేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్ర


    ఉత్సాహము.
    ఓర్చఁ గష్ట మయ్యె రోగ ముపశ మించు నా కనన్
    మార్చ శ్లేష్మ వాత పిత్త మలిన రోగ రాశినిం
    గూర్చి తీవు గొప్ప మందు ఘోర మయ్యె మ్రింగఁగాఁ
    జేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో

    రిప్లయితొలగించండి
  29. భార్య ....

    నేర్చి యుంటి రుచ్యపాకనియతు లన్ని యొప్పగన్
    కూర్చ ట్యూబు యూల లోనఁ, గూర్మి జేసి తియ్యదో!,

    భర్త.....

    ఓర్చి తింటి నిన్ని రోజు లోర్మి చాల దింకపై
    చేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో!

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  30. [


    నాటు వైద్యము నేర్చుచు నలుగురికిల
    మందులనొసగుగ నవియు మతిని చెరచ
    పలికిరాగ్రహమ్మును బూని ప్రజలు వడిగ
    చేర్చుపరలోకమునకు నీ చేతి మాత్ర

    రిప్లయితొలగించండి