పెద్దలు వారు సత్కవులు పేరును బొందిన పండితాగ్రణుల్ పద్దెములల్లు విద్దెలను వారికి వారలె సాటి యండ్రు యే పొద్దును వారి ప్రాభవము పొల్పుగ జూపక విశ్రమింతురే? వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్
పెద్దలు పిన్నలున్ బుధులు వేదిక నందలి ప్రౌఢ ధీరులున్ బద్దలు గట్టి ఛందమున వాదము సేయుచు నీవు నేననన్ విద్దెల పోరు బెంచిరట భీరుల మొద్దుల నీదు వెంట తే వద్దుర సిద్దిపేట జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్
కంది శంకరయ్య వారే స్వయంగా ప్రకటన చేశాక..ఇక కవులను కలిసేందుకు .....ఆ అవధానాలు ఉండే రోజులలో సమయంలో. .కవుల ఇళ్ళకు వెళ్ళటం వృధా ..ఆ వేదికల వద్దే ఉంటారు మంచి వారూ మంచికవులుకూడా..ఆనందోత్సాహాలతో. ఉత్కంఠగా.. చూస్తూ వింటూ.

కవులు ...కవిత్వాలు అవధానాలు అంటూ సిద్దిపేట కు శివరాత్రి రోజు రావద్దు.ఆ రోజు పెద్దలు పిన్నలు సజ్జనులందరూ పూజలు జాగారాలతో శివాలయాలలో గడుపుతూ ఉంటారు మీ ప్రోగ్రాములు చూసేందుకు సజ్జనులెవ్వరూ రారు అని భావం.

రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
నిద్దుర లేచివేకువను నీరస మందున పండ్లుతోముచున్
ముద్దుగ బస్సునెక్కుచును ప్రొద్దుట పూటను హైద్రబాదునన్
కొద్దిగ పద్య విద్యలను కూరిమి లేకయె కాఫిగ్రోలనున్
వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్...
పద్యములను పరిచి పాటవమ్ము తడిపి
రిప్లయితొలగించండిసభలకు కొనిపోయె శంకరయ్య
జనులు నిండె పురము జలము దొరకదట
సిద్దిపేట కేగవద్దు కవులు"
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మాటమాటపెరుగుమాటులేకపలుకు
రిప్లయితొలగించండిమర్మమెంచిఁజూడమరపురాదు
తేటతెల్లమౌనుతెలుగుమాటలజోరు
సిద్దిపేటకేగచిత్రకవులు
సిద్ధిపేట కేగ సిద్ధించు కవులకు
రిప్లయితొలగించండిముద్దుముద్దు కవిత పొద్దుపొద్దు
విద్దె నేర్వకుండ పద్దెమ్ము వద్దన
సిద్ధిపేట కేగవద్దు జనులు
అద్దిరబన్న యందురుగ యచ్చతెనుంగున పద్దెమల్లగా
తొలగించండివిద్దెల గారవించు యలివేణులు, పిన్నలు, పెద్దలందరున్
దిద్దక పద్యరీతులను తీరుగ పద్యము వ్రాయలేనిచో
వద్దుర సిద్ధిపేట జనవద్దు కవుల్, గనరారు సజ్జనుల్
పెద్దలు పద్య సేవకులు ప్రేమగ రమ్మని పిల్పు పంపగన్
రిప్లయితొలగించండిముద్దు కరోనలందుకొని ముందుగ చేరెను పద్య ప్రాంగణిన్
హద్దులు మూసిరంట సరి హద్దులు దాటనునీయరంటయా
వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్"
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మద్దతుచూపకేమనలమాటలమర్మమువిప్పలేరులే
రిప్లయితొలగించండిహద్దులుదాటుచున్కలిమిహాయనివింతగతూలనాడుచున్
పద్ధతిపద్యమందుగలభాసిలుశోభనుచూడరాసభన్
వద్దురసిద్ధిపేటఁజనవద్దుకవుల్కనరారుసజ్జనుల్
సమస్య :
రిప్లయితొలగించండివద్దుర సిద్దిపేట జన
వద్దు కవుల్ గనరారు సజ్జనుల్
( సిద్దిపేటలో మంచిపద్యాలు చెబితే పులకింత - ఏదోగా చెబితే ఏవగింత )
ఉత్పలమాల
-------------
ముద్దులు గారు పద్దెముల
మోజుగ విందురు సభ్యులెల్లరున్;
బెద్దగ గారవించెదరు ;
పెంపుగ నింపుగ జెప్పలేనిచో
వద్దుర సిద్దిపేట జన
వద్దు కవుల్ ; గనరారు సజ్జనుల్
మొద్దుగ నేవొ పద్యముల
ముక్కుచు జెప్పిన నాలకింపగన్ .
సిద్దిపేటయందు నుద్దండులున్నారు
రిప్లయితొలగించండివారి మెప్పు పొంద నేరి తరము?
పరువు నిలుపుకొనగ ప్రద్రవమది మేలు
సిద్దిపేట కేగవద్దు కవులు
అచట గాంచ వచ్చుఁ నష్టావ ధా నముల్
రిప్లయితొలగించండిసిద్ది పేట కేగ : వద్దు కవులు
జార విడువ రాదు చక్కని య వకాశ
మంచు శంక రయ్య యనెను గాదె
ఆటవెలది
రిప్లయితొలగించండిఅపరవాగ్విభవులు నవధానముల సేయ
దిగ్గజములఁ బోలి తీరి రాగ
నవధరింపలేక యభినందనమ్ముల
సిద్దిపేట కేగవద్దు కవులు
ఉత్పలమాల
అద్దరి పాండితీ ప్రభల నయ్యవధానులు దిగ్గజమ్ములై
తద్దయు వాగ్విభూషణల ధన్యులఁ జేయ వధానవేడుకన్
విద్దెల చూడబోవుటకు వేదిక వద్దకు తప్ప నన్యులై
వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్
గ్రాస మునకు కొరత, గ్రామము మున లేదు
రిప్లయితొలగించండిపల్లెలు మనకునిడు పణము చాల
పచ్చనివరిచేలు, పైరగాలి , కలుగు
సిద్ది, పేట కేగవద్దు కవులు
రసపిపాసులు నగరములోని జనులెల్ల
రిప్లయితొలగించండినటగల దవధానమనుచు నెఱగి
వచ్చిరెల్ల రిండ్లు వదలి సభకు గాన
సిద్దిపేట కేగవద్దు కవులు .
. . . విరించి.
పెద్దలు జ్ఞానపూర్ణులగు విజ్ఞులు హెచ్చుగ నున్న పట్టణం
రిప్లయితొలగించండిబిద్దియె, గాంచ పండితుల కిచ్చట లోటను మాటలేదులే
విద్దెలు భూరిగా గల వివేకులు చేరిరి సాహితీసభన్
వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్, గనరారు సజ్జనుల్ .
. . . విరించి.
ఉ:
రిప్లయితొలగించండిముద్దుగ మాటలాడెదరు మోదము నొందెడి భుక్తి గూర్తురౌ
హద్దులు లేని యాదరణ యడ్డము లేదట నక్కు జెర్చగన్
బద్దకమున్నవారలును పద్దెము వ్రాయుట రానివారలే
వద్దుర సిద్దిపేట జన వద్దు కవుల్ గనరారు సజ్జనుల్
వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపెద్దలు వారు సత్కవులు పేరును బొందిన పండితాగ్రణుల్
రిప్లయితొలగించండిపద్దెములల్లు విద్దెలను వారికి వారలె సాటి యండ్రు యే
పొద్దును వారి ప్రాభవము పొల్పుగ జూపక విశ్రమింతురే?
వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్
సభ జరుగును నేడు సమయమునకు రమ్ము
రిప్లయితొలగించండివేడుక పదములది, విందె మనకు
అలసటలను దీర్చు, అసలాలసముగను
సిద్ది పేట కేగవద్దు కవులు
పెద్దలు పిన్నలున్ బుధులు వేదిక నందలి ప్రౌఢ ధీరులున్
రిప్లయితొలగించండిబద్దలు గట్టి ఛందమున వాదము సేయుచు నీవు నేననన్
విద్దెల పోరు బెంచిరట భీరుల మొద్దుల నీదు వెంట తే
వద్దుర సిద్దిపేట జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్
కవులు లేనిచోట యవధాన విద్యయున్
రిప్లయితొలగించండిజరుపుకొనుట నెటుల చక్కగాను
శంకరయ్య గురువు శలవిచ్చె నెందుకో
సిద్దిపేట కేగవద్దు కవులు
సిద్దిపేట కేగవద్దు కవులెపుడు
రిప్లయితొలగించండిహద్దు మీరుచుందురచటి వారు
ముద్దుగ కయిపదము బూరించ కుండిన ,
మొద్దు లెవరు లేరు పురమునందు
రిప్లయితొలగించండిఓర్ని! పాసగూల! ఒక్కరు లేరక్క
డౌర తెలుగు తెలిసి ! డాబు చేయు
వారు పెక్కు గలరు ! వలదు వద్దిక వద్దు
సిద్దిపేట కేగవద్దు కవులు!
రిప్లయితొలగించండిఅనుభవముతో పలికితి సు
జన! వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్!
గనరారు సజ్జనుల్ తెలి
యని విషయములను! విడువరయా యొరకొనకన్!
జిలేబి
ఇట్టితలపుతమకు తట్టనే గూడదు
రిప్లయితొలగించండి"సిద్దిపేట కేగవద్దు కవులు"
మంచి ప్రశ్న వేసి మన్ననలందుము
సందియమ్ముతగదు శంకరార్య !
సందియమ్ము (లేక) సంశయమ్ము
తొలగించండిసుద్దులు చెప్పుచుండె తన సూనునకున్ జనకుండు పుత్రకా!
రిప్లయితొలగించండిపద్దెములన్ బఠించుము శుభంబగు నీకును జ్ఞానవృద్ధియౌ
చద్దుల నారగించి యనిశంబు గృహమ్మున జేరి యుండుమా
వద్దుర సిద్ది! పేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్.
వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్
రిప్లయితొలగించండిహద్దును మీరు చుందురట నచ్చటి
పౌర జనంబు లెల్లరున్
ముద్దుగ కైపదంబులను బూరణ జేయని వేళలందునన్ ,
మొద్దులు కారు వారెవరు , బుద్దుల
నెంచుచు జూచినప్పుడున్
మద గమనముతోన మత్తేభ గుంపులు
రిప్లయితొలగించండిచంపకముల మాల శాతబట్టి
సభల తిరుగబట్టె, జాగరూకులవరో
సిద్దిపేట కేగవద్దు కవులు"
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
కవితాగానకార్యక్రమానికి
రిప్లయితొలగించండి'దుమ్ముపేట' అనే వంచకులు ఎక్కువగా ఉండే ఊరికి వెళ్ళుచున్న సిద్ధరామయ్య అనే ఉత్తమకవి తో మరో కవిమిత్తుడు,...
పద్దెము గిద్దెముల్ యతులు ప్రాసలు సత్కవనమ్ము గానముల్
ముద్దులు గూర్చ వేవియును మోసము చేయుటె వారి వృత్తి నీ
యొద్ద గలట్టి విత్తమునె యూడ్చెద, రూడును కొండ నాల్క హా!
వద్దుర సిద్ది! పేటఁ జనవద్దు కవుల్ గన, రారు సజ్జనుల్.
కంజర్ల రామాచార్య.
సుద్దులు జెప్పవద్దు గడు చోద్దెము ముద్దుగ పద్దెమొద్దికన్
రిప్లయితొలగించండిబెద్దలు బద్దకంబు విడి విద్దెల బుద్దిగ ప్రొద్దు ప్రొద్దునన్
హద్దులు మీరి నేర్చి రపహాస్యము సేయగ పొద్దుపోక పో
**వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్; గనరారు సజ్జనుల్"*
గద్దియబుద్ధవిగ్రహముగాగనువిందొనరించనించగా
రాష్ట్రమునక రోన రగులుచు వ్యాపించె
రిప్లయితొలగించండిసిద్దిపేట కేగ వద్దు కవులు
నెందు కైన మంచి దేగ కుండగనింటి
యొద్ద యుండి వినుడు పద్యములను
వద్దుర సిద్దిపేట జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్
రిప్లయితొలగించండినద్దమఱేయి వచ్చెనటయచ్చటకేమఱి యాకరోన సూ
ముద్దనువోలె గన్పడుచు మోమున దూరుచు గంఠమందు దా
దద్దయు బాధవెట్టునట తాలిమి చాలని నంతగా రవీ!
బూచి చెలఁగు చుండి దోఁచుఁ బ్రాణమ్ములు
రిప్లయితొలగించండికానఁ బడదు కంటఁ గాని కలదు
వింత జాల మందు వేడుకఁ జల్పుఁడీ
సిద్దిపేట కేఁగ వద్దు కవులు
తద్దయు సంధు లొల్లరు సతమ్ము దృతమ్ముల గౌరవింపరే
సుద్దుల యందుఁ బొంక మది చోద్యమె వద్దన నాలకింపరే
గ్రద్దనఁ బద్దె మల్లుటయుఁ గద్దుమ యన్వయ ముండ నేరదే
వద్దుర సిద్దిపేటఁ గనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్
[కేవలము పూరణార్థమె. నా భావ మిది కాదు.]
కలువనింటకవులకష్టమా రోజులన్
రిప్లయితొలగించండిమనసువిప్పినిడివిమాటలాడ
వెడలియుంద్రుకనగఁవేదికన్ శంకరున్
సిద్దిపేట కేగవద్దుకవులు
---గాదిరాజు మధుసూదనరాజు
కంది శంకరయ్య వారే స్వయంగా ప్రకటన చేశాక..ఇక కవులను కలిసేందుకు .....ఆ అవధానాలు ఉండే రోజులలో సమయంలో. .కవుల ఇళ్ళకు వెళ్ళటం వృధా ..ఆ వేదికల వద్దే ఉంటారు మంచి వారూ మంచికవులుకూడా..ఆనందోత్సాహాలతో. ఉత్కంఠగా.. చూస్తూ వింటూ.
రిప్లయితొలగించండివెడలియుంద్రుకనగఁవేదికన్ శంకరున్
సిద్దిపేట కేగవద్దుకవులు
కలువనింటకవులకష్టమా రోజులన్
మనసువిప్పినిడివిమాటలాడ!
---గాదిరాజు మధుసూదనరాజు
కంది శంకరయ్య వారే స్వయంగా ప్రకటన చేశాక..ఇక కవులను కలిసేందుకు .....ఆ అవధానాలు ఉండే రోజులలో సమయంలో. .కవుల ఇళ్ళకు వెళ్ళటం వృధా ..ఆ వేదికల వద్దే ఉంటారు మంచి వారూ మంచికవులుకూడా..ఆనందోత్సాహాలతో. ఉత్కంఠగా.. చూస్తూ వింటూ.
విద్దెలమ్మ గొలువ వేడ్కగ జేరిరి
రిప్లయితొలగించండిపెద్దలందరచట పేర్మి గాని
మొద్దు తెగువ వలదు మూతి ముసుగు లేక
సిద్దిపేట కేగవద్దు కవులు
పెద్దలుపిన్నలున్ కలిసి ప్రేమయుగౌరవముండగుండెలన్
రిప్లయితొలగించండిరద్దులుగుద్దులన్ గొడవలన్ దరిజేరనీక తా
మిద్దరినిద్రమానిపరమేశుగుడిన్ శివరాత్రినుంద్రహో!
వద్దురసిద్దిపేటఁజనవద్దుకవుల్ గన రారు సజ్జనుల్
గాదిరాజు మధుసూదనరాజు
కవులు ...కవిత్వాలు అవధానాలు అంటూ సిద్దిపేట కు శివరాత్రి రోజు రావద్దు.ఆ రోజు పెద్దలు పిన్నలు సజ్జనులందరూ పూజలు జాగారాలతో శివాలయాలలో గడుపుతూ ఉంటారు మీ ప్రోగ్రాములు చూసేందుకు సజ్జనులెవ్వరూ రారు అని భావం.
పెద్దలుపిన్నలున్ కలిసి ప్రేమయుగౌరవముండగుండెలన్
రిప్లయితొలగించండిరద్దులుగుద్దులన్ గొడవలన్ దరిజేరనీక తా
మిద్దరినిద్రమానిపరమేశుగుడిన్ శివరాత్రినుంద్రహో!
వద్దురసిద్దిపేటఁజనవద్దుకవుల్ గన రారు సజ్జనుల్
గాదిరాజు మధుసూదనరాజు
కవులు ...కవిత్వాలు అవధానాలు అంటూ సిద్దిపేట కు శివరాత్రి రోజు రావద్దు.ఆ రోజు పెద్దలు పిన్నలు సజ్జనులందరూ పూజలు జాగారాలతో శివాలయాలలో గడుపుతూ ఉంటారు మీ ప్రోగ్రాములు చూసేందుకు సజ్జనులెవ్వరూ రారు అని భావం.
రిప్లయితొలగించండిసమస్య:
సిద్ధిపేట కేగవద్దు కవులు
ఆ.వె.
సిద్ధిపేటయనగ బుద్ధిజీవులనేల
కావ్యఝరులు విరియు కవులసీమ
బుర్ర పదునుపెట్టి పోవలె, వట్టిగా
*సిద్ధిపేట కేగవద్దు కవులు*
@శ్రీధర్ కొమ్మోజు, వరంగల్
మనతెలంగాణమదిఘనమంచుపలికి
తొలగించండిసిద్ధిపేటతీరునుతెల్పె శ్రీధరకవి
అలుసుగఁదలంచియడుగిడనలుపెదక్కు
సిద్దిపేటకేగ వద్దుకవులు